iDreamPost

భార్య, పిల్లల్ని చంపేందుకు యత్నించిన భర్తకు శిక్ష వేయని కోర్టు.. ఎందుకంటే..?

భార్య, ఇద్దరు పిల్లల్ని చంపేందుకు ప్రయత్నించాడు ఓ ఇండో అమెరికన్ డాక్టర్. కారులో షికారుకు అని తీసుకెళ్లి.. కొండపై నుండి లోయలోకి కారు పోనిచ్చాడు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కాగా, భార్యా పిల్లలు..

భార్య, ఇద్దరు పిల్లల్ని చంపేందుకు ప్రయత్నించాడు ఓ ఇండో అమెరికన్ డాక్టర్. కారులో షికారుకు అని తీసుకెళ్లి.. కొండపై నుండి లోయలోకి కారు పోనిచ్చాడు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కాగా, భార్యా పిల్లలు..

భార్య, పిల్లల్ని చంపేందుకు యత్నించిన భర్తకు శిక్ష వేయని కోర్టు.. ఎందుకంటే..?

అమెరికాలో భారతీయులపై దాడులు కొత్తేమీ కాదు. బయట వ్యక్తులే కాదు.. సొంత కుటుంబీకులే పొట్టన బెట్టుకుంటున్నారు. గత ఏడాది ఇండో అమెరికన్ డాక్టర్ తన భార్యను బిడ్డలను చంపేందుకు ప్రయత్నించాడు. అయితే తృటిలో ప్రాణాల నుండి బయట పడ్డారు. కానీ ఉద్దేశ పూర్వకంగా తమను చంపేందుకు ప్రయత్నించాడని గుర్తించిన భార్య.. బలంగా ఆ విషయాన్ని నమ్మింది. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. కోర్టులో హాజరు పరిచారు. కాగా, తాజాగా ఈ ఘటనపై విచారణ చేపట్టిన కోర్టు.. అతడికి శిక్షకు బదులు.. అతడిని మానసిక చికిత్స చేయించాలని ఆదేశించింది. అయితే భార్యా, పిల్లలను అతడు చంపేందుకు ఎందుకు ప్రయత్నించాడో తెలిసి పోలీసులు, కోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి.

భార్య, ఇద్దరు పిల్లలను చంపేందుకు ప్రయత్నించిన ఇండో అమెరికన్ రేడియాలజిస్ట్ ధర్మేష్ పటేల్ శిక్ష నుండి తప్పించుకున్నాడు. అతడికి కోర్టు మానసిక చికిత్స చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది జరిగిన ఈ ఘటనపై తాజాగా తీర్పు వెల్లడించింది. గత ఏడాది జనవరిలో కాల్నిఫోర్నియాలో జీవిస్తున్న ధర్మేష్.. భార్య నేహాతో పాటు ఏడు, నాలుగేళ్ల చిన్నారులతో కలిసి బయటకు వెళ్లాడు ధర్మేష్. కారును ఓ కొండపై నుండి 250 అడుగుల లోతులోకి పోనిచ్చాడు. దీంతో కారు తీవ్రంగా ధ్వంసమైనప్పటికీ.. కుటుంబ సభ్యులంతా సురక్షితంగా బయటపడ్డారు. అయితే అతడు ఉద్దేశపూర్వకంగానే చంపేందుకు ప్రయత్నించాడని గుర్తించిన భార్య.. భర్తపై కేసు పెట్టేందుకు నిరాకరించింది. అయితే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

అతడ్ని కోర్టులో హాజరు పరిచారు. కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. అతిగా ఆలోచించి అతడు భార్యను పిల్లల్ని చంపేందుకు యత్నించినట్లు నిర్దారించాడు. ఈ ఘటన జరగడానికి వారం ముందు నుండి తనను ఎవరో ఫాలో అవుతున్నారని భయపడ్డాడు ధర్మేష్. తన పిల్లలను కిడ్నాప్ చేస్తారని, లైంగిక వేధింపులు జరుగుతాయని, అక్రమ రవాణా జరిగే అవకాశాలున్నాయని బలంగా నమ్మాడు. తన కుటుంబాన్ని అలాంటి పరిస్థితుల్లో చూడలేక.. చంపేయాలని నిర్ణయించుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆయన తరుఫున లాయర్స్ వాదనలు వినిపించాడు. అతడు స్కిజో ఆఫెక్టివ్ డిజార్డర్, మేజర్ డిప్రెసివ్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని, మతి స్థిమితం, భ్రమ కలిగించే ఆలోచనతో బాధపడుతున్నాడని చెప్పడంతో ఆయన శిక్షకు బదులు.. మానసిక చికిత్స అందించాలని పేర్కొంది న్యాయ స్థానం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి