iDreamPost

ఈ 35 స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ కనిపించదు! లిస్టులో మీ ఫోన్ ఉందేమో చూసుకోండి

WhatsApp Will Stop In These Phones: ఈ 35 ఫోన్లలో ఇక వాట్సాప్ కనిపించకపోవచ్చు. మీ దగ్గర ఈ ఫోన్ ఉంటే వెంటనే ఈ పని చేయండి. లేదంటే మీ ఫోన్ లో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి.

WhatsApp Will Stop In These Phones: ఈ 35 ఫోన్లలో ఇక వాట్సాప్ కనిపించకపోవచ్చు. మీ దగ్గర ఈ ఫోన్ ఉంటే వెంటనే ఈ పని చేయండి. లేదంటే మీ ఫోన్ లో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి.

ఈ 35 స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ కనిపించదు! లిస్టులో మీ ఫోన్ ఉందేమో చూసుకోండి

ఈరోజుల్లో వాట్సాప్ అనేది అందరికీ అత్యవసరం, నిత్యావసరం అయిపోయింది. వ్యక్తిగత అవసరాలకే కాకుండా వ్యాపార అవసరాల కోసం కూడా ఖచ్చితంగా ఫోన్ లో వాట్సాప్ ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఉద్యోగాలు చేసే వారికి కూడా వాట్సాప్ ఉండాల్సిందే. వాట్సాప్ యూజర్ల కోసం మెటా సంస్థ కూడా అనేక మార్పులు తీసుకొస్తుంది. ప్రైవసీ, సెక్యూరిటీ విషయాల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకొస్తుంది. వీటితో పాటు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇదిలా ఉంటే కొన్ని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ నిలిపివేయాలని మెటా నిర్ణయించుకుంది. యాపిల్, శామ్ సంగ్ సహా అనేక ఇతర బ్రాండ్లకు చెందిన కొన్ని మోడల్స్ లో వాట్సాప్ సేవలు ఆగిపోతాయని మెటా కంపెనీ ప్రకటించింది.

యాప్ పనితీరు మెరుగుపరచడం కోసం మెటా సంస్థ ఈ చర్యలు తీసుకుంది. వాట్సాప్ లేటెస్ట్ ఫీచర్స్ ని వాడుకునేందుకు అవసరమైన సిస్టం కొన్ని స్మార్ట్ ఫోన్లలో లేదని మెటా భావించింది. రాబోయే రోజుల్లో 35 స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని కంపెనీ స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నట్లు మెటా తెలిపింది. మరి ఆ స్మార్ట్ ఫోన్ల జాబితా ఏంటంటే?

శామ్ సంగ్:

గెలాక్సీ ఏస్ ప్లస్, గెలాక్సీ కోర్, గెలాక్సీ ఎక్స్ ప్రెస్ 2, గెలాక్సీ గ్రాండ్, గెలాక్సీ నోట్ 3 ఎన్9005, గెలాక్సీ నోట్ 3 నియో ఎల్టీఈ+, గెలాక్సీ ఎస్ ఐ9500, గెలాక్సీ ఎస్ 3 మినీ వీఈ, గెలాక్సీ ఎస్ 4 యాక్టివ్, గెలాక్సీ ఎస్ 4 మినీ ఐ91910, గెలాక్సీ ఎస్ 4 మినీ ఐ9192 డ్యూయోస్, గెలాక్సీ ఎస్ 4 మినీ ఐ91955 ఎల్టీఈ, గెలాక్సీ ఎస్ 4 జూమ్ 

మోటోరోలా:

మోటో జీ, మోటో ఎక్స్ 

ఐఫోన్:

ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ, ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ఈ

హువాయి: 

అసెన్డ్ పీ6 ఎస్, అసెన్డ్ జీ525, హువాయి సీ199, హువాయి జీఎక్స్1ఎస్, హువాయి వై625

లెనోవో:

లెనోవో 46600, లెనోవో ఏ858టీ, లెనోవో పీ70, లెనోవో ఎస్890, లెనోవో ఏ820

సోనీ:

ఎక్స్ పీరియా జడ్1, ఎక్స్ పీరియా ఈ3, ఎక్స్ పీరియా ఎం

ఎల్జీ:

ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్డీ పీ880, ఆప్టిమస్ జీ, ఆప్టిమస్ జీ ప్రో, ఆప్టిమస్ ఎల్7

జడ్టీఈ:

జడ్టీఈ వీ956, జడ్టీఈ యూఎంఐ ఎక్స్2, జడ్టీఈ గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్, జడ్టీఈ గ్రాండ్ మెమో

ఇతర బ్రాండ్లు:

ఫియా ఎఫ్1, టీహెచ్ఎల్ డబ్ల్యూ8, ఆర్కోస్ 53 ప్లాటినం, వికో సింక్ ఫైవ్, వికో డార్క్ నైట్ 

పైన చెప్పిన ఫోన్లలో మెటా చెప్పిన దాని ప్రకారం ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేయకపోతే కనుక వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి. ప్రస్తుతం ఉన్న వాట్సాప్ ఆండ్రాయిడ్ 5.0 వెర్షన్ లో, ఐఫోన్ లో ఐఓఎస్ 12 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఓఎస్ లో మాత్రమే పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 5.0 కంటే తక్కువ వెర్షన్ అయితే కనుక వాట్సాప్ అప్ గ్రేడ్ వెర్షన్ పని చేయదు. అలానే ఐఫోన్ వాడేవారు ఐఓఎస్ 12 లేదా అంతకంటే ఎక్కువ ఓఎస్ కి అప్ గ్రేడ్ అవ్వాలి. లేటెస్ట్ వాట్సాప్ కి తగ్గట్టు అప్డేట్, ఫీచర్లను కలిగిన స్మార్ట్ ఫోన్స్ లో మాత్రమే వాట్సాప్ పని చేస్తుంది. ఇంతకంటే తక్కువ ఉంటే మాత్రం మీ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్లి ఓఎస్ ని అప్డేట్ చేసుకోండి. లేటెస్ట్ ఓఎస్ వెర్షన్ కి మీ ఫోన్ సపోర్ట్ చేస్తే ఓకే. లేదంటే మీరు ఫోన్ ని మార్చాల్సి వస్తుంది. మరీ పాత ఫోన్ అయితే కనుక ప్రాబ్లమ్ అవుతుంది. మీ ఫోన్ వాట్సాప్ యాప్ కి సపోర్ట్ చేయకపోతే మీకు మెసేజ్ వస్తుంది. సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఫోన్ ని అప్ గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి