iDreamPost
android-app
ios-app

ప్రభాస్ కల్కి సినిమా అర్థం అవ్వాలంటే.. మహాభారతంలోని ఈ కథ తెలుసుకోండి!

The Story Behind Ashwathama In Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మూవీ మొత్తం కల్కి- అశ్వత్థామ పాత్రల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఈ కథ తెలుసుకుంటేనే మీకు కల్కి సినిమా అనేది అర్థమవుతుంది.

The Story Behind Ashwathama In Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మూవీ మొత్తం కల్కి- అశ్వత్థామ పాత్రల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఈ కథ తెలుసుకుంటేనే మీకు కల్కి సినిమా అనేది అర్థమవుతుంది.

ప్రభాస్ కల్కి సినిమా అర్థం అవ్వాలంటే.. మహాభారతంలోని ఈ కథ తెలుసుకోండి!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు తెరపడింది. జూన్ 27న కల్కి 2898 ఏడీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజై ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మైథలాజికల్ స్టోరీకి సైన్స్ ఫిక్షన్ జోడించి విజువల్ వండర్స్ క్రియేట్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్‌తో ఓ కళాఖండాన్ని చెక్కి.. ప్రేక్షకులకు అందించాడు. పాజిటివ్ రివ్యూస్, రేటింగ్‌తో నాలుగేళ్ల పాటు నాగీ పడ్డ కష్టానికి నిజమైన ప్రతిఫలం దక్కినట్లయ్యింది. డార్లింగ్ డై హార్ట్ ఫ్యాన్స్ సైతం కాలర్ ఎగరేస్తున్నారు. దర్శకుడ్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అలాగే అమితాబ్, కమల్ హాసన్, దీపికా నటనకు ఫిదా అయిపోతున్నారు. ఇలా కల్కి సినిమా సూపర్ హిట్ అవ్వడానికి చాలానే కారణాలు ఉన్నా.. ఈ రేంజ్ రెస్పాన్స్ రావడానికి మాత్రం మహాభారతం సీక్వెన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే.., చాలా మంది ఈ సీక్వెన్స్ పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నా.. అసలు ఆ అశ్వత్థామ ఎవరు? ఆయనకి ఆ శాపం ఏంటి? గర్భంలోకి బాణం ఎందుకు వదిలాడు? కల్కిని అశ్వత్థామ ఎందుకు కాపాడుతున్నాడు? ఇంత మంది చిరంజీవులు ఉండగా అతనికే ఈ బాధ్యత ఎందుకు? ఇలాంటి ప్రశ్నలు అన్నీ చాలా మందికి అర్థం కావడం లేదు. అందుకే.. ఇప్పుడు ఆ పూర్తి కథ తెలుసుకుందాం. కల్కి సినిమాని పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే.. ఈ అశ్వత్థామ కథ మొత్తం పూర్తిగా తెలుసుకోండి.

ఎవరీ అశ్వత్థామ?:

‘అశ్వత్థామ హత: కుంజర:’ అనే డైలాగ్‌తో కల్కి 2898 ఏడీ మొదలౌతుంది. ఇంతకు అశ్వత్థామ ఎవరు.. ఆయనకు కృష్ణుడు ఇచ్చిన శాపం ఏంటీ.. ఆ తర్వాత ఏం జరిగింది ఈ సినిమా కథ. ఒకసారి ఇతిహాస గాథల్లోకి వెళితే.. అశ్వత్థామ ద్రోణాచార్యుడి కుమారుడు. అతడు శివుడి వరం. పుట్టుకతోనే ఓ మణితో జన్మిస్తాడు. అశ్వత్థామకు తండ్రి అంటే ఎనలేని ప్రేమ . కౌరవ, పాండవులతో పాటే విలువిద్య నేర్చుకున్నాడు. అర్జునుడితో పాటే బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని సాధిస్తాడు. కానీ అతడికి కాస్తంత దూకుడు స్వభావం ఎక్కువ. తండ్రి మాటలను పెడచెవిన పెడుతుంటాడు. అయితే ద్రోణా చార్యుడికి అర్జునుడు అంటే విపరీతమైన ఇష్టం. అర్జునుడు అన్ని విద్యల్లోనూ మేటిగా రాణిస్తుండటంతో అతడిపై మక్కువ ఎక్కువ చూపిస్తాడు ద్రోణాచార్యుడు. తన తండ్రి తన కన్నా అర్జునుడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడని అశ్వత్థామకి ఈర్ష్య ఏర్పడుతుంది. దీంతో.. చిన్న నాటి నుండే పాండవులపై కోపంతో రగిలిపోతూ, కౌరవులకి దగ్గర అవుతాడు. ఆచార్యుడి పుత్రుడు కనుక అతనికి కౌరవుల్లో తగిన గౌరవం లభిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ కౌరవుల తరుపున యుద్ధం చేస్తాడు.

Kalki Story

ఇక కురుక్షేత్ర యుద్దంలో ద్రోణాచార్యడు కూడా కౌరవుల వైపు యుద్ధం చేస్తాడు. ఆయన్ని నిలువరించడం పాండవుల వల్ల కాకుండా పోతుంది. ప్రాణానికి ప్రాణం అయిన ఆయన కొడుకు అశ్వత్థామ చనిపోయాడని ‘అశ్వత్థామ హత: కుంజర:’అంటూ ధర్మరాజు చెప్తాడు. అది నిజం అనుకుని ద్రోణుడు అస్త్ర సన్యాసం చేస్తాడు. ఇదే అదునుగా భావించిన దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని పీక కోసి చంపేస్తాడు. అప్పుడే అశ్వత్థామ దృష్టద్యుమ్నుడుని చంపి తీరుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. చివరికి 18 రోజుల మహాభారత యుద్ధం ముగుస్తుంది. దుర్యోధనుడు నీటిలో తలదాచుకోగా అతన్ని కూడా భీముడు తొడలపై కొట్టి చావు తీరాలకి చేర్చుతాడు.

ఉప పాండవుల హతం:

అయితే.., ఆ ఆఖరి ఘడియల్లో ఉన్న దుర్యోధనుడు దగ్గరికి అశ్వత్థామ వస్తాడు. దుర్యోధనుడు బోరున విలపిస్తాడు. సోదరా.. నన్ను అధర్మ యుద్ధంలో ఓడించారు. నీ తండ్రిని అధర్మంగా పీక కోసి చంపారు. ఇక నా సైన్యాద్యకుడువి నీవే అంటూ అశ్వత్థామలో ద్వేషాన్ని పెంచుతాడు. దీంతో.. పాండవులను చంపుతానని ధుర్యోధనుడికి మాట ఇచ్చి అశ్వత్థామ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. పాండవులను పగటి వేళ చంపలేడు కాబట్టి.. రాత్రి వేళలో వారు నిద్ర పోతుండగా చంపాలని కుట్ర పన్నుతాడు. ఇది ముందే తెలుసుకున్న కృష్ణుడు.. పాండవులను, తన ప్రాణ మిత్రుడు సాత్యకిని అక్కడ నుండి గంగా నది ఒడ్డుకు దాటించేస్తాడు. కానీ.., అశ్వత్థామ అక్కడే ఉన్న ఉప పాండవులను.. అనగా పాండవుల కుమారులను విచక్షణా రహితంగా చంపేస్తాడు. తన తండ్రిని చంపిన దృష్టద్యుమ్నుడుని కూడా ఆ రాత్రే చంపేస్తాడు.

ఇంత నీచానికి పాల్పడినా కూడా పాండవులు అశ్వత్థామని క్షమిస్తారు. ఆచార్యుడి పుత్రుడు అని వదిలేస్తారు. అయితే.. అశ్వత్థామ ఈర్ష్య గురించి బాగా తెలిసిన శ్రీకృష్ణుడు పాండవులను వెంటపెట్టుకొని అశ్వత్థామ ఉండే ఆశ్రమం వద్దకి పోతాడు. పాండవుల రాకని గమనించిన అశ్వత్థామ.. ఎక్కడ పాండవులు తనని చంపేస్తారో అని.. మొత్తం పాండవ వంశం నాశనం అయిపోవాలని బ్రహ్మాస్త్రం సంధిస్తాడు. బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కోవాలి అంటే.. అదే అస్త్రాన్ని సంధించాలి. ఇక అర్జునుడికి మరో మార్గం లేక.. పాండవ వంశం క్షేమంగా ఉండాలని మరో బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. రెండు బ్రహ్మాస్త్రాలు ఢీ కొంటే సృష్టి నాశనం అయిపోతుందని గ్రహించిన మహర్షులు.. వాటిని వెనక్కి తీసుకునేలా చేయమని కృష్ణుడిని వేడుకుంటారు. అర్జునుడు పెద్దల మాట విని ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ.., అశ్వత్థామకి మాత్రం బ్రహ్మస్త్రాన్ని సంధించడం తెలుసుగాని.. దాన్ని వెనక్కి తీసుకోవడం రాదు. ఆ విషయాన్నే చెప్పగా.. ఏదైనా జంతువుపైకి దారి మరల్చమని పెద్దలు సలహా ఇస్తారు.

చిరంజీవిగా శాపం:

కానీ.., అణువణువునా పాండవుల వంశం నాశనం అయిపోవాలని కోరుకుంటున్న అశ్వత్థామ.. ఆ బ్రహ్మస్త్రాన్ని పాండవ వంశంలోని స్త్రీల గర్భస్థలంపైకి పంపిస్తాడు. ఆ సమయంలో అభిమన్యుడి భార్య ఉత్తర మాత్రమే గర్భంతో ఉంటుంది. బ్రహ్మస్త్రం ఆమె కడుపులోని పిండాన్ని చంపేస్తుంది. ఈ చర్యతో శ్రీకృష్ణుడిలోని కోపం కట్టలు తెచ్చుకుంటుంది. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీ కృష్ణుడు.. చీము, రక్తంతో జీవితాంతం కొండ కోనల్లో చిరంజీవిగా బతకాలని అశ్వత్థామని శపిస్తాడు. ఇలా అందరికీ చిరంజీవిగా బతకాలన్న వరం.. అదృష్టంగా మారితే.. అశ్వత్థామకు మాత్రం శాపంగా మారింది.