iDreamPost

మనుషులను రాక్షసులుగా మార్చి.. OTTలో బెస్ట్ యాక్షన్ సిరీస్!

OTT Suggestions- Best Action Series The Imperfects: ఓటీటీలో వెబ్ సిరీస్లు చాలానే ఉంటాయి. కానీ, కొన్ని మాత్రమే అభిమానుల హృదయాలను గెలుచుకుంటాయి. వాటిలో ఈ సిరీస్ కూడా ఒకటి.

OTT Suggestions- Best Action Series The Imperfects: ఓటీటీలో వెబ్ సిరీస్లు చాలానే ఉంటాయి. కానీ, కొన్ని మాత్రమే అభిమానుల హృదయాలను గెలుచుకుంటాయి. వాటిలో ఈ సిరీస్ కూడా ఒకటి.

మనుషులను రాక్షసులుగా మార్చి.. OTTలో బెస్ట్ యాక్షన్ సిరీస్!

వెబ్ సిరీస్లు అంటే ఇష్టమా? మీకోసం ఓటీటీలో చాలానే వెబ్ సిరీస్లు ఉన్నాయి. అయితే అన్నీ వావ్ అనిపించేలా ఉండవు. కొన్ని మాత్రం చూసి చూసి టైమ్ వేస్ట్ అనిపిస్తుంది. అందుకే చాలా మంది వెబ్ సిరీస్ల జోలికి వెళ్లరు. కానీ, మీకోసం ఒక బెస్ట్ యాక్షన్ బేస్డ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తీసుకొచ్చాం. ఈ సిరీస్లో ఒక్కో ఎపిసోడ్, ఒక్కో సీన్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. మీరు ఎక్స్ మెన్ సినిమాలు చూసుంటే మాత్రం మీకు ఈ ఈ సిరీస్ బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆ మూవీలో మ్యూటెంట్స్ ఉన్నట్లుగానే ఈ మూవీలో మాన్ స్టర్స్ ఉంటాయి. అయితే వాటిలో చాలా వరకు మంచివే ఉంటాయి. వారిని అలా మార్చేస్తారు. మరి.. ఆ బెస్ట్ సిరీస్ ఏంటో చూద్దాం.

వెబ్ సిరీస్ అంటే కనీసం ఒక పెద్ద కథ కావాలి. అందులో మంచి ట్విస్టులు ఉండాలి. ఒక పెద్ద కాన్ ఫ్లిక్ట్ పాయింట్ ఉండాలి. ప్రతి క్యారెక్టర్ కి ఒక లక్ష్యం ఉండాలి. అప్పుడే వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాంటి అన్నీ మంచి ఎలిమెంట్స్ ఈ సిరీస్లో ఉన్నాయి. ఇందులో ఒక వ్యక్తి ఉంటాడు. అతడిని వ్యక్తి అనే కంటే రాక్షసుడు అనచ్చు. ఎందుకంటే వారికి కూడా తెలియకుండా వారిని మృగాలుగా మార్చేస్తాడు. ల్యాబులో ఎలుకల మీద ప్రయోగాలు చేసినట్లు యువకులు, యువతుల మీద ల్యాబ్ లో ప్రయోగాలు చేస్తాడు. వారికి తెలియకుండానే వారిని మృగాలుగా మారుస్తాడు. ఆ యువతను క్రూర జంతువులుగా మారిపోయేలా చేస్తాడు.

అయితే ఈ కథలో వారికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని వాళ్లంతా తిరగబడతారు. ఆ సైంటిస్ట్ ల్యాబ్ నుంచి పారిపోయి వారి జీవితాన్ని వాళ్లు గడపాలి అనుకుంటారు. కానీ, ఆ సైంటిస్ట్ మాత్రం వారిని తన అధీనంలోకి తీసుకోవాలి అనుకుంటాడు. వారిని అడ్డుపెట్టుకుని ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలి అని కలలు కంటాడు. అందుకే వారిని తిరిగి రప్పించేందుకు వారిని వేటాడుతూ ఉంటాడు. వాళ్లు కూడా మొదట ప్రాణాల మీద తీపితో పారిపోతారు. కానీ, చివరకు పారిపోవడం కంటే పోరాడటమే కరెక్ట్ అని నమ్ముతారు. ఆ సైంటిస్ట్ సేనపై తిరుగుబాటు చేస్తారు.

తమపై చేసిన ప్రయోగం వల్ల వారికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వాటిని కంట్రోల్ చేసుకుంటూనే.. వారికి జరిగిన అన్యాయంపై పోరాడుతూ ఉంటారు. ఈ వెబ్ సిరీస్ పేరు ‘ది ఇంపర్ఫెక్ట్స్‘. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు డీసీ అభిమానులు అయితే మాత్రం మీకు ఈ వెబ్ సిరీస్ కచ్చితంగా నచ్చేస్తుంది. మీరు ఇప్పటికే ఈ సిరీస్ చూసుంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ సిరీస్ చూడాలి అంటే క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి