iDreamPost
android-app
ios-app

మెగా-సూపర్ కాంబో లేటెస్ట్ అప్డేట్

  • Published Feb 26, 2020 | 12:18 PM Updated Updated Feb 26, 2020 | 12:18 PM
  • Published Feb 26, 2020 | 12:18 PMUpdated Feb 26, 2020 | 12:18 PM
మెగా-సూపర్ కాంబో లేటెస్ట్ అప్డేట్

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఆచార్య(రిజిస్టర్ చేసిన టైటిల్)లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్నాడన్న వార్త గత కొద్దిరోజులుగా సినీ వర్గాలతో పాటు సామాన్య ప్రేక్షకులను ఊపేస్తోంది. ఇది అధికారికంగా ఇప్పటిదాకా ఖరారు కాలేదు. అసలు మహేష్ కథే వినలేదన్న మరో టాక్ కూడా ప్రచారంలో ఉంది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కొరటాల శివ చూచాయగా లైన్ చెప్పాడట. ప్రస్తుతం యాడ్ షూట్ కోసం ముంబైలో ఉన్న మహేష్ తిరిగి రాగానే దీనికి సంబంధించి ఫైనల్ స్టేట్ మెంట్ వస్తుంది.

లీకవుతున్న మరో సమాచారం మేరకు ఇందులో మహేష్ పాత్ర ఇరవై నిమిషాల నుంచి అరగంట మధ్య ఉంటుందట. స్టూడెంట్ లీడర్ గా ఉంటూ ఒక పాట, మాస్ కి పిచ్చెక్కే లెవెల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయట. మరో ఎగ్జైటింగ్ న్యూస్ కూడా ఉంది. అందరూ అనుకుంటున్నట్టు ఇందులో మహేష్ కనిపించేది చిరంజీవి యువకుడిగా ఉన్న పాత్రలో కాదట. ఇద్దరి మధ్య చక్కని కాంబినేషన్ సీన్స్ కూడా ఉంటాయని, అవి పావు గంటకు పైగా ఇద్దరు అభిమానులను ఉర్రూతలూగించేలా ఉంటాయని తెలిసింది.

ఒకవేళ రామ్ చరణ్ కు ఆర్ఆర్ఆర్ వాయిదా లేకపోయి ఉంటే సీన్ వేరుగా ఉండేది. అయితే తండ్రీకొడుకులు కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా కలిసి నటించవచ్చు. కానీ మహేష్ చిరుల కాంబినేషన్ అంత ఈజీగా సెట్ అయ్యేది కాదు. కొరటాల శివతో ఉన్న బాండింగ్, నమ్మకంతోనే మహేష్ చాలా సానుకూలంగా ఉన్నట్టు వినికిడి. దీనికి సంబంధించి అధికారికంగా చెక్ పడాలి అంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు ఇంకా హీరోయిన్ ని ప్రకటించకపోవడం కొసమెరుపు.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetStarzbetStarzbetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom