iDreamPost
android-app
ios-app

Bhagyashri Borse: భాగ్యశ్రీ చివరాఖరు చాన్స్ ?

టాలీవుడ్ లో హీరోయిన్లకు వున్నంత డిమాండ్ ఎవరికీ వుండదు.

టాలీవుడ్ లో హీరోయిన్లకు వున్నంత డిమాండ్ ఎవరికీ వుండదు.

Bhagyashri Borse: భాగ్యశ్రీ చివరాఖరు చాన్స్ ?

టాలీవుడ్ లో హీరోయిన్లకు వున్నంత డిమాండ్ ఎవరికీ వుండదు. ఒక్క హిట్ పడితే పది సినిమాలు చేతిలోకి వస్తాయి. అందంగా వుండి..మంచి డ్యాన్సర్ అయి వుంటే హిట్ లు పడకపోయినా అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి. శ్రీలీల దీనికి ఉదాహరణ. ఆమెకు ఎక్కువ హిట్ లు పడలేదు. అయినా బోలెడు సినిమాలు చేసేసారు. ప్రస్తుతం తెలుగులో ఆమెకు సినిమాలు లేవు. కృతి శెట్టి ఫస్ట్ సినిమాతోనే పెద్ద హిట్ కొట్టారు. అయినా ఆమె నటన విషయంలో అంత మంచి మార్కులు పడలేదు తరువాత సినిమాలకు. దాంతో ఆమెకు మంచి అవకాశాలు వచ్చినా నిలదొక్కుకోలేదు.

భాగ్యశ్రీ బోర్సె అలా కాదు. మంచి నటన, అందం, మంచి డ్యాన్సర్. అన్నీ ప్లస్ పాయింట్ లే. తొలి సినిమా మిస్టర్ బచ్చన్ లో ఆమె తన డ్యాన్స్ లతో అదరకొట్టారు. కానీ సినిమా అరి వీర డిజాస్టర్. మలి సినిమా కింగ్ డమ్ . అందులో ఆమెకు పెద్దగా పెర్ ఫార్మ్ చేసేంత లేదు కానీ సినిమా ఫ్లాప్. ముచ్చటగా మూడో సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. అందులో కూడా ఆమె తన డ్యాన్స్ లతో ఆకట్టుకున్నారు. నటన కూడా ఓకె. కానీ సినిమా ఫ్లాప్.

అంటే మొత్తంగా మూడు ఫ్లాపులు భాగ్యశ్రీ ఖాతాలో పడిపోయాయి. ఇప్పుడు నాలుగో సినిమా. అఖిల్ తో చేస్తున్న లెనిన్. ఈ సినిమా నుంచి వచ్చిన పాటల్లో ఎఫ్పటి లాగే భాగ్యశ్రీ డ్యాన్స్ లు సూపర్ గా వున్నాయి. ఇక మిగిలింది సినిమా కూడా సూపర్ గా వుండడం. అఖిల్ కు ఎలాగూ హిట్ కావాలి. అదే టైమ్ లో భాగ్యశ్రీ కి కూడా కావాలి.

బై బ్యాడ్ లక్ అలా జరగకపోతే భాగ్యశ్రీ మీద ఫ్లాపుల ముద్ర పడిపోతుంది. హిట్ పడిందో, భాగ్యశ్రీ చేతిలోకి మరో మూడు నాలుగు సినిమాలు చకచకా వచ్చేస్తాయి. అది తెలియాలంటే ఓ వారం వెయిట్ చేయాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet