Chiranjeevi
వారానికి వెయ్యి..నెలకోసారి హాయి అన్నట్లుగా ఏడాదికి ఒక సినిమా తీస్తారు అనిల్ రావిపూడి
వారానికి వెయ్యి..నెలకోసారి హాయి అన్నట్లుగా ఏడాదికి ఒక సినిమా తీస్తారు అనిల్ రావిపూడి
Chiranjeevi
వారానికి వెయ్యి..నెలకోసారి హాయి అన్నట్లుగా ఏడాదికి ఒక సినిమా తీస్తారు అనిల్ రావిపూడి. కానీ ఆ సినిమాతో నిర్మాతలకు ఫుల్ ప్రాఫిట్ వుంటుంది. నిర్మాత దిల్ రాజు మూడు సినిమాలతో ఈ లాభాలు చవిచూసారు. నిర్మాత సాహు రెండు సినిమాలు చేసారు. అంత లాభాలు చవి చూడలేదు కానీ ఫరవాలేదు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారు. దాంట్లో మంచి లాభాలు కళ్ల చూసే అవకాళం వుంది.
మరి ఇంతకీ ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి సినిమా ఎవరితో? 2028 సంక్రాంతికి రావిపూడి కాంబినేషన్ ఎవరితో? సింపుల్ ఆన్సర్. నందమూరి బాలకృష్ణతోనే. భగవంత్ కేసరి తరువాత మరోసారి రిపీట్. ఆ మేరకు ఫిక్స్ అయిపోయింది. గోపీచంద్ మలినేని, కొరటాల శివ సినిమాల తరువాత అనిల్ తో సినిమా వుంటుంది.కొరటాల సినిమా 2027 సమ్మర్ కు అయిపోతుంది. ఆ టైమ్ కు అనిల్ రెడీ.
అంతా బాగుంది. మరి ఈ ప్రాజెక్ట్ కు నిర్మాత ఎవరు? ఇంకెవరు అనిల్ తో బోలెడు అనుబంధం వున్న సాహు గారపాటి లేదా దిల్ రాజు కావచ్చు. నిజానికి బాలయ్య ఓ సినిమాను సాహు గారపాటికి చేయాల్సి వుంది. వృద్ధి సినిమాస్-మలినేని ప్రాజెక్ట్ సాహు దే. కానీ అటు వెళ్లింది. ఆ డ్యూ వుండనే వుంది. కానీ దిల్ రాజుకు ఓ సినిమా చేయాలని రావిపూడి అనుకుంటున్నారు.
కానీ బాలయ్య అటు సాహు అంటారో ఇటు దిల్ రాజు అంటారో. ఆ పేరు ఫిక్స్ అవుతుంది.