iDreamPost
android-app
ios-app

Peddi:పెద్ది లాభమా? నష్టమా?

ఇది మిలియన్ డాలర్ ప్రశ్న. కేవలం పెద్ది నిర్మాత మాత్రమే సరైన ఆన్సర్ చేయగలిగిన ప్రశ్న. ఆయనకు మాత్రమే జవాబు తెలిసిన ప్రశ్న.

ఇది మిలియన్ డాలర్ ప్రశ్న. కేవలం పెద్ది నిర్మాత మాత్రమే సరైన ఆన్సర్ చేయగలిగిన ప్రశ్న. ఆయనకు మాత్రమే జవాబు తెలిసిన ప్రశ్న.

Peddi:పెద్ది లాభమా? నష్టమా?

ఇది మిలియన్ డాలర్ ప్రశ్న. కేవలం పెద్ది నిర్మాత మాత్రమే సరైన ఆన్సర్ చేయగలిగిన ప్రశ్న. ఆయనకు మాత్రమే జవాబు తెలిసిన ప్రశ్న. వందల కోట్ల రికార్డ్ వసూళ్లు సాధించింది తమ హీరో సినిమా అని మెగా అభిమానుల సంబరం. అన్ని వందల కోట్ల వసూళ్ల సినిమా అందించానని దర్శకుడు బుచ్చిబాబుకు ఆనందం. తన ఖాతాలో మంచి సినిమా పడిందని హీరోకి ఎలాగూ సంతోషమే.

కానీ పెద్ది సినిమా నిర్మాతకు ఏమైనా మిగిల్చిందా లేదా అన్న అనుమానం మాత్రం ఇండస్ట్రీ సర్కిళ్లలో వుండనే వుంది. ఎందుకంటే ఈ సినిమా నిర్మాణానికి చాలా ఎక్కువ ఖర్చు అయింది. బయటకు వచ్చిన ఫుటేజ్ కన్నా మరో గంట నుంచి గంటన్నర మేరకు ఫుటేజ్ వచ్చిందని, అదంతా ఎడిటింగ్ టేబుల్ మీద వుండిపోయిందని గ్యాసిప్ లు వుండనే వున్నాయి. ఆ సంగతి అలా వుంచితే చాలా మంది నటులు వున్నారు సినిమాలో. వారందరి డేట్ లు చాలా అంటే చాలా ఎక్కువే వాడుకున్నారు. కానీ తెరమీద చూస్తే జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడమో, ఒకటి రెండు డైలాగులతో సరిపెట్టడమో జరిగింది.

కానీ చాలా మంది పది నుంచి ఇరవై రోజులు, అంతకన్నా ఎక్కువే సినిమా కోసం వర్క్ చేసినట్లు తెలుస్తోంది. అంటే ఆ మేరకు వాళ్లకు పేమెంట్ లు అయితే ఇవ్వాల్సిందే. పైగా ప్రాజెక్ట్ లేట్ కావడం వల్ల వడ్డీల భారం అన్నది కామన్. ఇవన్నీ కలిసి సినిమా నిర్మాణ వ్యయాన్ని బాగా పెంచాయి. అందువల్ల అమ్మకాలకు, పెట్టుబడికి మధ్య మార్జిన్ ఏ మేరకు వుండి వుంటుంది అన్నది తెలియాల్సి వుంది.

అది అలా వుంచితే ఇప్పుడు నిర్మాత జిఎస్టీల రూపంలో బయ్యర్లకు కనీసంలో కనీసం పాతిక కోట్ల వరకు ఇవ్వాల్సి వుంటుందని తెలుస్తోంది. ఓవర్ సీస్ బయ్యర్ కు ఎంతో కొంత వెనక్కు ఇవ్వాల్సి వుంటుందని టాక్ వినిపిస్తోంది. అలాగే నైజాం బయ్యర్లు మైత్రీ కూడా నిర్మాతకు బాగా సన్నిహితం. అందువల్ల అవసరం అయితే వారికి కూడా ఇవ్వాలి.

ఇవన్నీ కలిస్తే కనీసం ముఫై నుంచి ముఫై అయిదు కోట్లకు పైగానే వుంటాయి. అంటే పెద్ది సినిమా మీద నిర్మాతకు విడుదల నాటికి ముఫై అయిదు కోట్ల మేరకు లాభం వచ్చి వుంటే ఇవన్నీ పే చేసేస్తే ఏమీ మిగిలదు. అంతకన్నా ఎక్కువ వచ్చి వుంటే లాభమే. లేదు అంతకన్నా తక్కువే వచ్చి వుంటే ఇప్పుడు ఇలా వెనక్కు ఇవ్వడం వల్ల పెద్ది సినిమా నిర్మాతకు నష్టమే మిగులుస్తుంది.

ఈ ప్రశ్శకు సమాధానం లేదా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వగలిగింది నిర్మాత మాత్రమే. అంతవరకు ఈ విషయంలో లోలోపల గ్యాసిప్ లు మాత్రం వినిపిస్తూ వుంటాయి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet