iDreamPost
android-app
ios-app

Venkatesh Daggubati: వెంకీ మామ @ 20 కోట్లు

  • Published Jul 06, 2026 | 11:38 AM Updated Updated Jul 06, 2026 | 11:38 AM

టాలీవుడ్ లో హీరోల రెమ్యూనిరేషన్లు డిమాండ్ సప్లయ్ ఆధారంగానే వుంటాయి. మిగిలిన వ్యాపారాల మాదిరిగానే. యంగ్ టాప్ హీరోల రెమ్యూనిరేషన్లు అన్నీ వంద కోట్లు దాటేసాయి.

టాలీవుడ్ లో హీరోల రెమ్యూనిరేషన్లు డిమాండ్ సప్లయ్ ఆధారంగానే వుంటాయి. మిగిలిన వ్యాపారాల మాదిరిగానే. యంగ్ టాప్ హీరోల రెమ్యూనిరేషన్లు అన్నీ వంద కోట్లు దాటేసాయి.

Venkatesh Daggubati: వెంకీ మామ @ 20 కోట్లు

టాలీవుడ్ లో హీరోల రెమ్యూనిరేషన్లు డిమాండ్ సప్లయ్ ఆధారంగానే వుంటాయి. మిగిలిన వ్యాపారాల మాదిరిగానే. యంగ్ టాప్ హీరోల రెమ్యూనిరేషన్లు అన్నీ వంద కోట్లు దాటేసాయి. సీనియర్ హీరోల్లో మెగాస్టార్ రెమ్యూనిరేషన్ దాదాపు 70 కోట్ల పై మాటే అని వార్తలు వినిపిస్తూ వుంటాయి. మరో సీనియర్ హీరో బాలయ్య రెమ్యూనిరేషన్ 35 నుంచి 40 కోట్లు అని టాక్. మిగిలిన ఇద్దరు సీనియర్ హీరోల్లో నాగార్జున తీరు వేరు. ఆయన లాస్ట్ గా చేసిన బయట సినిమా కుబేర. ఆ సినిమాకు నాగ్ రెమ్యూనిరేషన్ 10 కోట్లు పైగానే అని టాక్ వుంది.

విక్టరీ వెంకటేష్ విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పెద్ద హిట్ కొట్టారు. త్రివిక్రమ్ తో సినిమా నిర్మాణంలో వుంది. ఇప్పుడు మళ్లీ అనిల్ తో మరో సినిమా స్టార్ట్ అయింది. ఎఫ్ 2 టైమ్ లో వెంకీ రెమ్యూనిరేషన్ ఎనిమిది కోట్ల రేంజ్ లో వుండేది. ఎఫ్ 3 టైమ్ కు 12 కోట్ల వరకు వెళ్లిందని వార్తలు వినిపించాయి. అలాగే సంక్రాంతికి వస్తున్నాం కి కూడా.

అయితే ఇప్పుడు చేస్తున్న అనిల్ రావిపూడి సినిమాకు వెంకీ రెమ్యూనిరేషన్ 20 కోట్లు అని తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాకు కూడా అంతే రెమ్యూనిరేషన్ అని సమాచారం. ఒక విధంగా రీజనబుల్ అనుకోవాలి. ఎందుకంటే దర్శకుడి కాంబినేషన్ వుంటే దాదాపు 70 కోట్ల నాన్ థియేటర్ మార్కెట్ వుంది. చేస్తున్న రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయితే వెంకీ రెమ్యూనిరేషన్ గట్టిగా పెరిగే అవకాశం వుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet