మాండూస్ తుపాన్ బలహీనపడుతున్నవేళ రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. తుపాను పరిస్థితులపై సీఎం అధికారులతో సమీక్షించారు. వివిధ జిల్లాల్లో తుపాను ప్రభావంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు, భారీవర్షసూచన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. భారీగా వర్షాలు కురుస్తున్న నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన పక్షంలో పునరావాస శిబిరాలను తెరిచి, […]
గడపగడపకు అంటూ సాగుతున్న వైసీపీ కార్యక్రమం నుండి దృష్టి మరల్చడంలో సఫలమవుతుందా?. గత సార్వత్రిక ఎన్నికల్లో, తరువాత జరిగిన స్థానిక సంస్థల, ఉప ఎన్నికలలో తీవ్ర వ్యతిరేకత కనబరచిన ప్రజల నుండి కొంతైనా సానుకూలత సాధించుకొంటుందా?. చంద్రబాబు, టీడీపీ కార్యక్రమాల చర్చ వచ్చిన ప్రతిసారీ గత అయిదేళ్ల పాలన గురించి, బాబు చేసిన మోసాల గురించి, పాలనా వైఫల్యాల గురించి జ్ఞప్తికి రావడం సహజం. అందుకు ఫలితమే గడచిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణమైన పరాజయం . అదలా […]
విశాఖలో ప్రధాని చేతుల మీదుగా 7,614 కోట్లు విలువైన 5 ప్రాజెక్టులకు శంకుస్థాపన ,7,619 కోట్లతో పూర్తి చేసిన నాలుగు ప్రాజెక్టులను జాతికి అంకితం.. శంకుస్థాపనల ప్రాజెక్టులు.. రూ.7,614 కోట్లు విలువైన 5 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ►రూ.152 కోట్లతో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ. ►రూ.3,778 కోట్లతో రాయ్పూర్–విశాఖపట్నం 6 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవే, ఎకనామిక్ కారిడార్. ►రూ.566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్కు ప్రత్యేకమైన రోడ్డు. ►రూ.460 కోట్లతో విశాఖపట్నం రైల్వేస్టేషన్ […]
ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్న గవర్నమెంట్ టీచర్లకు తీపి కబురు! పది వేల మందికి పైగా ఉపాధ్యాయులను డిప్యూటీ DEOలు, MEOలు, హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేయడానికి రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన ఫౌండేషనల్ స్కూళ్ళలో సబ్జెక్టుల బోధనకు స్కూల్ అసిస్టెంట్ టీచర్లు అవసరం. దీంతో SGTలలో అర్హులైనవారికి SAలుగా పదోన్నతులు కల్పించాలని ముఖ్యమంత్రి YS జగన్ ఇప్పటికే ఆదేశాలు […]
పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండువైపులని అందుకే ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ తప్పనిసరని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ సంస్థతో ఎంఓయూ సందర్భంగా ఆయన మాట్లాడారు. పర్యావరణానికి మేలు చేసే నిర్ణయాన్ని ప్రకటించారు. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ ప్లాస్టిక్ వ్యర్థాలను వలంటీర్లు క్లీన్ చేశారు. ఇవాళ విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగిందని […]
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటున్నాం. జపాన్ కంపెనీకి ప్రపంచంలోనే ఐదో స్థానం ఉంది. అలాంటిది 15 నెలల్లోనే ఏటీసీ టైర్ల పరిశ్రమను స్థాపించగలిగామని ప్రకటించారు ఏపీ సిం జగన్. ఆగస్టు 2023 నాటికి రెండో పనులు పూర్తి చేసే అవకాశం ఉందన్న సీఎం, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. ఈ మూడేళ్లలో పారిశ్రామికాభివృద్ధి పరుగులుపెడుతోందన్న సీఎం, ఏపీకి 17 భారీ పరిశ్రమలతో 39, 350 కోట్ల పెట్టుబడులు […]
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, విజయవాడ, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరించారు సీఎం జగన్. అనంతరం, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శనను వీక్షించారు. స్వాతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా. పింగళి వెంకయ్య తీర్చిదిద్దిన జాతీయ జెండా, భారతీయుల గుండె అని సీఎం జగన్ ప్రకటించారు. సార్వభౌమత్వానికి, ఏకత్వానికి, దేశభక్తికి, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. వాదాలు వేరైనా దేశ స్వాతంత్రం లక్ష్యంగా పోరాడారు. వాళ్లను స్మరించుకుంటూ.. […]
మాది సంక్షేమ ప్రభుత్వం, అన్నివర్గాల ప్రభుత్వం, కాపు నేస్తం అందులో భాగమేనని సీఎం జగన్ చెప్పారు. సంక్షేమ ప్రభుత్వమన్న నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. పాత ప్రభుత్వంతో కొత్త ప్రభుత్వాన్ని పోల్చిచూడమంటున్నారు. డీబీటీ అంటే, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. డీబీటీ ద్వారా అవినీతికి ఎలాంటి తావులేకుండా నేరుగా, సంక్షేమ పథకాల నిధుల్ని, లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామన్నారు సీఎం జగన్. వైఎస్సార్ కాపు నేస్తం మూడో విడత నిధుల విడుదలలో భాగంగా, కాకినాడ గొల్లప్రోలు సభ నుంచి […]
రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనమని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. బుధవారం పోర్టు శంకుస్థాపన తర్వాత నిర్వాసితులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. రామాయపట్నం పోర్టు రావడంతో, ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగాలు వస్తాయి. పోర్టు వల్ల రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది. ప్రత్యక్షంగా వేల మందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. పోర్టుతో చుట్టుప్రక్కల ఆర్ధికాభివృద్ధి జరుగుతుందన్న భరోసానిచ్చారు సీఎం జగన్. ఇప్పటివరకు మనకు కేవలం 6 పోర్టులుంటే, మరో 4 పోర్టులను […]