iDreamPost
iDreamPost
టీడీపీ, ఎల్లోమీడియా దిగజారుడు రాజకీయం చేస్తున్నాయి. వైఎస్ విజయమ్మ ప్రసంగాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. విమర్శించడానికి ఏమీలేక విజయమ్మ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. విజయమ్మ వ్యాఖ్యలపై పెడార్థాలు తీస్తున్నారు అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
తెలంగాణలో వైఎస్ షర్మిలకు అండగా నిలవడానికే వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుంటున్న ప్రకటించారు విజయమ్మ . రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలున్నాయి. ఒక పార్టీ గౌరవాధ్యక్షురాలిగా వుంటూ, మరో పార్టీ తరపున మాట్లాడటం సరైంది కాదని విజయమ్మ భావించారు. అందుకు తన నిర్ణయాన్ని ప్లీనరీలోనే ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ రాజీనామాపై ఎలా స్పందించాలో టీడీపీకి, ఎల్లోమీడియాకు అర్ధంకాలేదు. ఇష్టం వచ్చినట్లుగా రాశారు. అందుకే సజ్జలకు చిర్రెత్తుకొచ్చింది.
శుక్రవారం వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశంలో వైఎస్ విజయమ్మ మాట్లాడారు. ఏపీ కంటే, తెలంగాణలో ముందుగానే ఎన్నికలు వస్తాయి. ఏపీ భవిష్యత్తు ప్రయోజనాల కోసం సీఎం జగన్‌కు కచ్చితంగా స్టాండ్ ఉంటుంది. ఆయనకు, తెలంగాణలో షర్మిలకు వేర్వేరు విధానాలు ఉంటాయని విజయమ్మ అన్నారు.
షర్మిలమ్మ తెలంగాణ కోడలుగా, వైఎస్సార్ కూతురుగా వైఎస్ఆర్ టీపీ ఆరంభించారని వైఎస్ విజయమ్మ చెప్పారు. తెలంగాణలో తన ప్రయత్నం ప్రయత్నం చేస్తుందన్నారు. కాని, ఎల్లో మీడియా ఏదిబడితే అది రాయడం దురదృష్టకరం. ఇద్దరి పిల్లలకు తల్లినే, తెలుగువాడి గుండెచప్పుడు వైఎస్సార్. ఇప్పటి వరకు జరిగిందంతా ఒక ఎత్తు, ఇకపై జరగబోయేది ఒక ఎత్తు అని విజయమ్మ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎల్లో మీడియా వైఎస్ విజయమ్మ విరుచుకుపడ్డారు. వైఎస్‌ఆర్ ఆశయాలు పుణికిపుచ్చుకున్నవారు జగన్, షర్మిల. నేను రాయని, చేయని సంతకంతో, రాజీనామా లేఖ విడుదల చేశారు. ఇవి జుగుప్సకర రాతలు. ఆ లేఖ చూసినప్పుడు చాలా బాధ వేసింది. నేను రాయని, నేను చేయని సంతకం ఉన్న లేఖను ఎలా రిలీజ్ చేస్తారు?. తెలంగాణలో షర్మిలకు నా అవసరం ఉంది, అందుకే నేను అక్కడ ఆమెకు అండగా ఉండాలని అనుకుంటున్నా. నా ఉనికి ఎవరికి వివాదస్పదం కాకుండా ఉండాలనే, ఈ నిర్ణయం. ప్రజలకు నా ఇద్దరు బిడ్డలు అండగా ఉంటారు. మీ మద్దతు వారికి కావాలి. తల్లిగా జగన్‌కు ఎప్పుడు నా మద్దతు ఉంటుంది’’ అని విజయమ్మ మనసులో మాట చెప్పారు.
‘‘నన్ను క్షమించమని వైఎస్ఆర్ అభిమానులను కోరుతున్నాను. రాజకీయం అంటే దుష్ప్రచారాలు, వెన్నుపోట్లు కాదు. వైఎస్సార్ లేని లోటును నాకు ఎవరూ తీర్చలేరు’ అని వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి లోనైయ్యారు. ఇలాంటి వాటికి తావివ్వకుండా ఉండేందుకు వైఎస్సార్‌సీపీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా’’ అని విజయమ్మ వెల్లడించారు.