iDreamPost
android-app
ios-app

సోనియాకే భయపడలే, దుష్టచతుష్టయానికి భయపడతారా?

  • Published Jul 09, 2022 | 1:30 PM Updated Updated Jul 09, 2022 | 1:30 PM
  • Published Jul 09, 2022 | 1:30 PMUpdated Jul 09, 2022 | 1:30 PM
సోనియాకే భయపడలే, దుష్టచతుష్టయానికి భయపడతారా?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ రెండో రోజు ప్ర‌సంగాల్లో విమ‌ర్శ‌లు, విసుర్లు వినిస్తున్నాయి. బాబు, రామోజీ, రాధాకృష్ణ, టీవీ5 నాయుడుల‌ను క‌లిపి దుష్టచతుష్టయంగా అభివ‌ర్ణించిన మాజీ మంత్రి పేర్ని నాని, వారంతా క‌ల‌సి, మీడియా వ్యవస్థను దారుణంగా తయారు చేశారని విమర్శించారు. ప్లీనరీ రెండో రోజున ఎల్లో మీడియా-దుష్ట చతుష్టయం తీర్మానంపై చర్చలో మాట్లాడారు. దుష్టచతుష్టయంలో మొదటి దొంగ చంద్రబాబు, రెండో దొంగ రామోజీరావు, మూడో దొంగ రాధాకృష్ణ, నాలుగో దొంగ టీవీ5 నాయుడు. ఈ న‌లుగురిది ప్ర‌య‌త్నం ఒక్క‌టే. మనోడే అధికారంలో ఉండాలన్న‌ ఉన్మాద ప్రయత్నం. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. ఇప్పుడు కూడా రోజూ విషపు రాతలు రాస్తున్నార‌ని విమ‌ర్శించారు. పేర్ని నాటి ప్ర‌సంగాన్ని ప్లీన‌రీ మొత్తం ఆస‌క్తిగా వింది. పేర్ని నాని చెణుకుల‌కు సీఎం జ‌గ‌న్ న‌వ్వారు.

రామోజీరావు నమ్మకద్రోహి అని ఎన్టీయార్ ఆనాడే చెప్పారు. ఔటర్‌ రింగ్‌ కట్టానని చంద్రబాబు చెబుతారు. మరైతే, భూసేకరణ వైఎస్సార్‌ ఎందుకు చేశారు?. అబద్ధాలు చెప్పడంలో బాబును మించినోళ్లు లేరు. డబ్బు కోసమే ఎబీఎన్ రాధాకృష్ణ చేయని దుర్మార్గాలు లేవు. మ‌రైతే, ఏపీలో కందిపప్పు రేటు ఎంత? తెలంగాణలో ఎంత? నీ హెరిటేజ్‌లోఎంత ఉంది? వ‌ంట‌నూని ధరలు మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి? ఇలా అన్ని పాయింట్ల‌ను లేవ‌నెత్తి విమ‌ర్శించారు.

జగన్‌ పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నార‌ని అన్నారు. నాలాంటోళ్లు వస్తుంటారు.. పోతుంటారు.. సీఎం జగన్‌కోసం పనిచేయాలి. ఇంటింటికి తిరగండి, పథకాలు అందాయా? లేదా ఆరా తీయాలని కోరారు. పథకాలు రాకపోతే సరిదిద్దాలన్నారు. అర్హత ఉంటే చాలు, ఏ పార్టీ అయినా సంక్షేమ పథకాలు అందాలని సీఎం చెప్పార‌న్నారు. ఎవరూ శాశ్వతం కాదు, జెండా మోసే కార్యకర్తలు శాశ్వతని అంటున్న‌ప్పుడు ప్లీన‌రీలో చ‌ప్ప‌ట్లు వినిపించాయి.

సింగిల్‌గా రాలేమని చంద్రబాబు, పవన్‌కు తెలుసు.. అందుకే అందరూ కట్ట కట్టుకుని రావాలని చూస్తున్నారు. సోనియా గాంధీనే గడగడలాడించిన వ్యక్తి సీఎం జగన్‌. చంద్రబాబుతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా, 16 మాసాలు జైల్లో పెట్టినా అడుగు వెనక్కు తగ్గలేదు. జగన్‌ అంటే తగ్గేదేలే. అలాంటి వ్యక్తి ఈ దుష్టచతుష్టయానికి భయపడతాడా? అంటూ పేర్ని నాని సభికుల్ని ఉద్దేశించి ప్రసంగించారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobet