iDreamPost

విజయం మనదే.. సంబరాలకు సిద్ధంగా ఉండండి.. సజ్జల రామకృష్ణారెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో గత నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎలక్షన్స్ కు సంబంధించిన ఫలితాలు జూన్ 4 న వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో సజ్జల మళ్లీ మనదే విజయం అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లో గత నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎలక్షన్స్ కు సంబంధించిన ఫలితాలు జూన్ 4 న వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో సజ్జల మళ్లీ మనదే విజయం అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

విజయం మనదే.. సంబరాలకు సిద్ధంగా ఉండండి.. సజ్జల రామకృష్ణారెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నెల 13న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి. ఇక వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టి ప్రజల ఆదరణ పొందిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆద్వార్యంలోని వైసీపీ పార్టీ మరోసారి అధికారం చేపట్టాలని దృఢ సంకల్పంతో ఉన్నది. కాగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ నెల 4న అంటే రేపు( మంగళవారం) వెల్లడికానున్నాయి.

ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ వైసీపీదే విజయమంటూ వెల్లడించారు. ఎన్నికల్లో కచ్చితంగా మనమే గెలుస్తున్నామని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అందరూ రేపు 11 గంటలకు సంబరాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.సజ్జల మాట్లాడుతూ.. కౌంటింగ్‌ సమయంలో వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాడేపల్లి పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్సీపీ కౌంటింగ్‌ ఏజెంట్లకు జూమ్‌ మీటింగ్‌లో జరుగుతున్న శిక్షణాతరగతుల్లో ఆయన పాల్గొన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో డ్రామాలు ఆడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తులని విమర్శించారు. ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని వైసీపీ శ్రేణులకు సజ్జల సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఒక్క ఓటు కూడా పొల్లు పోకుండా వైసీపీ అకౌంట్లో పడే విధంగా కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి, కౌంటింగ్ పూర్తై డిక్లరేషన్ తీసుకునేంత వరకు కూడా అక్కడి నుంచి ఎవరూ కూడా కదలొద్దని అందరినీ రిక్వెస్ట్ చేశామని తెలిపారు. వైసీపీ పార్టీ శ్రేణులంతా దానికి సిద్ధంగా ఉన్నాయని సజ్జల తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి