P Krishna
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ వస్తున్నారు.
P Krishna
ఏపీలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు తమ తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో తాము చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ పాల్గొంటున్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చుతూ వస్తున్నారు సీఎం జగన్. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా.. ప్రజా బలం తో ముందుకు సాగుతున్నారు. నేడు పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే పల్నాడు ప్రజల కల సాకారం చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల వద్ద రూ.320.26 కోట్లతో చేపట్టిన వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు సీఎం జగన్. ఈ ప్రాజెక్ట్ ద్వారా 24 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నామ మాత్రం శంకు స్థాపన చేశారని.. ఈ నెల 6న అటవీ శాఖ నుంచి అన్ని అనుమతులు తీసుకొని పనులు మొదలు పెట్టినట్లు సీఎం తెలిపారు. పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. పౌరుషాల గడ్డను అభివృద్ది పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. శంకుస్థాపన అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడారు.
గత ప్రభుత్వం పల్నాడు జిల్లాకు ఎంతో చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు, నెరవేరని హామీలు ఇచ్చిందని అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ పనులు చేపట్టారు. కానీ తమ ప్రభుత్వం అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటుందని.. అన్ని అనుమతులు వచ్చిన తర్వాతనే ఈ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశామని అన్నారు. ఏదైనా పని చేయాలన్నా చిత్త శుద్ది ఉండాలని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ను దశలవారీగా మచర్లతో పాటు వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు తీసుకువెళ్తామని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు, తాగు నీరు అందించబోతున్నాం.. పల్నాడు ప్రజల కల సాకారం చేసినందుకు ఎంతో గర్విస్తున్నాం అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీలతో పాటు మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. రూ. 2లక్షల 40 వేల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయి. కోవిడ్ సమయంలోనే సంక్షేమ పథకాలు అమలు చేశామని గర్వంగా చెబుతున్నామన్నారు.
చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదు.. సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ఆపడం మాత్రం తెలుసు. చంద్రబాబు పాలనలో అన్నీ అబద్దాలు, వెన్నుపోటు, మోసాలే. 14ఏళ్లు సీఎం గా చేశారు.. ఒక్కటైనా మంచి పనులు చేశారా? అభివృద్ది పనులు చేపట్టారా? అని ప్రశ్నించారు. కుప్పం ప్రజలకే నీళ్లు ఇవ్వని బాబు ఇతర ప్రాంతాల గురించి ఏం పట్టించుకుంటారు అని విమర్శించారు. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ప్రజలకు వెన్నుపోటు పొడవకుండా ఉంటారా? అన్నారు. మేం పొత్తులను నమ్మకోం.. ఒంటరిగానే బరిలో ఉంటాం. ప్రజలపై మాకు నమ్మకం ఉంది.. నా ధైర్యం ప్రజలు.. అందుకే మధ్య దళారులను పెట్టుకోను అని అన్నారు సీఎం జగన్.