iDreamPost
iDreamPost
మాండూస్ తుపాన్ బలహీనపడుతున్నవేళ రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. తుపాను పరిస్థితులపై సీఎం అధికారులతో సమీక్షించారు. వివిధ జిల్లాల్లో తుపాను ప్రభావంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు, భారీవర్షసూచన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. భారీగా వర్షాలు కురుస్తున్న నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన పక్షంలో పునరావాస శిబిరాలను తెరిచి, ప్రజలకు అండగా ఉండాలని ఆదేశించారు.