కొన్ని భోజనశాలల పేర్లకు ముందు “బ్రాహ్మణ” అనే పదం ఉండడంపై ఓ యూజర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారి కుల వ్యవస్థపై వాడివేడి చర్చకు దారి తీస్తోంది. @peeleraja అనే యూజర్ బెంగళూరులో “బ్రాహ్మణ” పదంతో మొదలయ్యే రెస్టారెంట్లు, కెఫేల పేర్లను స్క్రీన్ షాట్ తీసి ట్వీట్ చేశారు. జొమాటో, స్విగ్గీ యాప్స్ రెండింటిలో తీసిన స్క్రీన్ షాట్స్ ను వేర్వేరుగా అప్ లోడ్ చేశారు. ఆ తర్వాత యూజర్ తన చిన్ననాటి అనుభవాన్నొకదాన్ని వరస […]
భారతదేశంలోని డిజిటల్ మీడియా నియంత్రించడానికి మరో చట్టం రానుంది. వచ్చే వారం పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకురానున్న సవరించిన బిల్లు ప్రకారం , ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవచ్చు. ఇప్పటివరకు ఏ చట్టం, లేదా, ఏ ప్రభుత్వ నియంత్రణ ద్వారా నిర్వచించని మీడియా రిజిస్ట్రేషన్ కోసం, బిల్లు రానుంది. ఇందులో డిజిటల్ మీడియాకూడా భాగమే. ఇకపై డిజిటల్ మీడియా వార్తలను చట్టంలో చేర్చడానికి ప్రెస్ , పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ బిల్లును సవరించే ప్రక్రియను, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ […]
సృజనాత్మకత పేరుతో వచ్చే కొన్ని ప్రకటనలు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుంటాయి. క్రియేటివిటీతో ఫలానా ఉత్పత్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నంలో హద్దు దాటిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ప్రకటనలపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నేరుగా యూట్యూబ్, ట్విట్టర్ లకు లేఖ రాసింది. కొన్ని పర్ఫ్యూమ్/ బాడీ స్ప్రే ప్రకటనలు శృతి మించుతున్నాయని కేంద్ర శాఖ పేర్కొంది. సామూహిక అత్యాచారాలను ప్రోత్సహించేలా చిత్రీకరించిన సదరు ప్రకటనలను వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. మహిళల నైతికత, […]
ఎదిగిన కొడుకు వృద్ధిలోకి వస్తే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. చాలాసార్లు చిన్న విషయాలు కూడా వెలకట్టలేని ఆనందాన్ని అందిస్తాయి. అలాంటిదే ఈ కొడుకు చేసిన పని. జన్మనిచ్చిన వారి విషయంలో ఆతని సున్నితమైన ఆలోచనలు, మంచి మనసుతో అందరి మన్ననలు పొందుతున్నాడు. అమెరికాలో నివాసం ఉంటున్న గౌరవ్ తన తల్లిదండ్రుల అమెరికా పర్యటన కోసం బిజినెస్ క్లాస్ టికెట్లు బుక్ చేశాడు.వాస్తవానికి ఇది చాలా సాధారణమైన విషయం. కానీ, దీని వెనుక అతని భావోద్వేగం, […]
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ట్విట్టర్ కొనుగోలు విషయంలో కొన్ని రోజులు వార్తల్లో నిలిచిన ఎలాన్ మస్క్ తాజాగా అమెరికా రాజకీయాలపై వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తలకెక్కారు. అమెరికాలో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు అని రెండు పార్టీలు ఉన్నాయి. డెమొక్రాట్లు అంటే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పార్టీ. రిపబ్లికన్లు అంటే ట్రంప్ పార్టీ. తాజాగా ఎలాన్ మస్క్ (Elon Musk) అమెరికా రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తూ.. గత ఎన్నికల్లో నేను […]
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఇటీవల 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ ని కొనబోతున్నట్టు ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎలన్ మస్క్-ట్విట్టర్ మధ్య కొనుగోలు ఒప్పందం కూడా జరిగింది. అయితే ట్విట్టర్ ఇంకా ఎలన్ మస్క్ చేతికి రాలేదు. తాజాగా ఈ ట్విటర్ డీల్ను తాత్కాలికంగా ఆపేస్తున్నట్టు ఎలన్ మస్క్ ట్విట్టర్లోనే పోస్ట్ చేశారు. 44 బిలియన్ డాలర్లతో ట్విటర్-ఎలన్ మస్క్ మధ్య కొనుగోలు ఒప్పందం జరగగా ఆరు నెలల్లో ట్విట్టర్ పూర్తిగా ఎలన్ […]
ఇటీవలే సన్ ఆఫ్ ఇండియా విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో జరిగిన ట్రోల్స్ మీద టీవీ ఛానల్స్ లోనూ పెద్ద చర్చే జరిగింది. మంచు ఫ్యామిలీని టార్గెట్ చేయడం పట్ల విష్ణు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాటిని డిలీట్ చేయకపోతే పది కోట్లకు నష్టపరిహారం దావా వేస్తానని ఆయా ప్లాట్ ఫార్మ్స్ కు లీగల్ నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే.సరే సినిమా రన్ ఎలా ఉంది, కలెక్షన్లు ఎంత వచ్చాయి అనేది పక్కనపెడితే ఈ స్థాయిలో […]
సోషల్ మీడియా ఉద్దేశం ఏదైనా సరే ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు దాన్ని యథేచ్ఛగా వాడుకోవడం చూస్తున్నాం. స్టార్ హీరోల అభిమానులు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం, విపరీతమైన అర్థాలతో మాటల దాడులు చేసుకోవడం నిత్యం చూస్తున్నాం. మేము మేము ఒకటే అని పబ్లిక్ స్టేజి మీద హీరోలు ఎంతగా చెప్పుకున్నా సరే ఈ ధోరణిలో మార్పు రావడం లేదు. పై పెచ్చు కొన్నిసార్లు వికృత రూపం దాల్చి మారీ దారుణంగా తిట్టేసుకుంటున్నారు. ఎవరి కోసమైతే […]
తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం దక్కుతుందని దాదాపు శతాబ్ధి కాలం ముందు మావో జెడాంగ్ అనే పెద్దమనిషి చెప్పడమే కాకుండా సాధించి చూపించాడు. ఆ తరువాత కూడా అక్కడక్కడా సాయుధ పోరాటం ద్వారా అధికారం సాధించిన ఉదాహరణలున్నాయి. టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో తుపాకీ పట్టే అవసరం ఉన్నా, అందుకవసరమైన ఓపికా తీరికా ఉన్న మనుషులు తగ్గిపోవడంతో తుపాకీ గొట్టం ద్వారా అధికారం సాధించిన మరో ఉదాహరణ చూసే అవకాశం కనిపించడం లేదు. అయితే ట్విట్టర్ ద్వారా […]
శ్రీకాకుళం ఎంపి కింజరపు రామ్మోహన్ నాయుడుని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడుగా చంద్రబాబు నియమించనున్నారని రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన మరింతగా పెద్ద చిన్న అని తేడా లేకుండా ట్విట్టర్ లో రెచ్చిపోతున్నారు. ఇదిలా ఉండగా వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి, రామ్మోహన్ నాయిడు మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. వాడుకొని వదిలేసే చంద్రబాబు చరిత్రను తెలియజేస్తూ విజయసాయి రెడ్డి ట్విట్ చేశారు. చంద్రబాబు వైఖరి వల్లనే సీనియర్లు పక్కకు […]