iDreamPost
android-app
ios-app

సంచలనాలు సృష్టిస్తున్న థ్రెడ్స్! ట్విట్టర్ కు గడ్డుకాలమే..!

సంచలనాలు సృష్టిస్తున్న థ్రెడ్స్! ట్విట్టర్ కు గడ్డుకాలమే..!

ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఎవరి వద్ద చూసినా స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా అకౌంట్ చాలా కామన్ గా ఉంటున్నాయి. యాప్స్ పరంగా చూసుకుంటే ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లకు చాలా మంచి క్రేజ్ ఉంది. ఈ మూడు కూడా మెటా సంస్థకు చెందినవే. ఈ యాప్స్ కి పోటీ ఇచ్చే యాప్ ఏదైనా ఉంది అంటే అది ట్విట్టర్ అని చెప్పచ్చు. ఇప్పుడు మెటా వేసిన ఎత్తుకు ట్విట్టర్ చిత్తు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కొత్తగా లాంఛ్ చేసిన థ్రెడ్స్ సంచలనాలు సృష్టిస్తోంది.

సాధారణంగా ట్విట్టర్ నుంచి మెటా సంస్థకు గట్టి పోటీ ఉన్న విషయం తెలిసిందే. అయితే ట్విట్టర్ మీద ఇప్పుడు కాస్త ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అదునుగా మెటా సంస్థ థ్రెడ్స్ యాప్స్ ని తీసుకొచ్చింది. ఇది అచ్చు ట్విట్టర్ ని పోలి ఉండటం గమనార్హం. ఈ యాప్ పై ట్విట్టర్ సంస్థ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ మాజీ ఉద్యోగులను హర్ చేసుకుని తమ మేధో సంపత్తిని వినియోగించి ఈ థ్రెడ్స్ యాప్ ని తయారు చేశారని ఆరోపించారు.

అంతేకాకుండా తమ హక్కులను ఉల్లంఘించారంటూ దావా వేస్తామంటూ మెటా సంస్థకు లేఖ కూడా రాశారు. ఈ థ్రెడ్స్ యాప్ ని ఇన్ స్టాగ్రామ్ అనుసంధానం చేస్తూ తీసుకొచ్చారు. కానీ, రెండూ యాప్స్ విడివిడిగానే ఉంటాయి. ఈ యాప్ లాంఛ్ చేసిన తర్వాతి నుంచి సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. లాంఛ్ అయిన రెండు గంటల్లోనే 20 లక్షల మంది సైనప్ అయ్యారు. నాలుగు గంటల సమయంలో ఏకంగా 50 లక్షల మంది యూజర్స్ వచ్చారు.

ఇంక వారం రోజులు గడుస్తుండగా.. సోమవారం మధ్యాహ్నం థ్రెడ్స్ యాప్ ఏకంగా 100 మిలియన్ మార్క్ దాటింది. అయితే ఇన్ స్టాగ్రామ్ కి ఈ థ్రెడ్స్ యాప్ ని జత చేయడమే.. యూజర్లు ఇంతలా పెరగడానికి కారణంగా చెప్పచ్చు. యాప్స్ రెండూ వేరు వేరే అయినా.. ఇన్ స్టాగ్రామ్ నుంచి థ్రెడ్స్ యాప్ లింక్ ని పొందచ్చు. థ్రెడ్స్ దూకుడు చూస్తుంటే ట్విట్టర్ కు గడ్డుకాలం తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ట్విట్టర్ దావా వేసి.. అందులో విజయం సాధిస్తే మెటా సంస్థ చిక్కుల్లో పడ్డట్లే అవుతుంది.

 

Post by @quiverquantitative
View on Threads