iDreamPost
android-app
ios-app

థ్రెడ్స్ కు కొత్త చిక్కులు.. న్యాయపోరాటానికి పూనుకున్న ట్విట్టర్!

థ్రెడ్స్ కు కొత్త చిక్కులు.. న్యాయపోరాటానికి పూనుకున్న ట్విట్టర్!

సామాజిక మాధ్యమాల్లో ట్విట్టర్ కు ఎంతో క్రేజ్ ఉంది. ఎలన్ మస్క్ దానిని కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్ కాస్త మసకబారిన విషయం తెలిసిందే. పైగా మస్క తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా యూజర్లు అసంతృప్తితో ఉంటున్న విషయం తెలిసిందే. ఇదే సరైన సమయం అని భావించిన జుకర్ బర్గ్ మెటా నుంచి థ్రెడ్స్ అనే యాప్ ని లాంఛ్ చేశాడు. ఈ యాప్ నుంచి ట్విట్టర్ కు గట్టి పోటీ ఉంటుందని తప్పకుండా చెప్పచ్చు. అందుకేనేమో థ్రెడ్స్ యాప్ పై ట్విట్టర్ గుర్రుగా ఉంది. పైగా న్యాయపోరాటనికి కూడా సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో థ్రెడ్స్ యాప్ తెగ ట్రైండ్ అవుతోంది. యాప్ లాంఛ్ చేసిన కొన్ని గటల్లోనే కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకుంది. ఒక్కరోజులోనే 5 కోట్ల మంది యూక్టివ్ యూజర్లను పొందింది. అయితే 24 గంటలు కూడా గడవక ముందే న్యాయపరమైన చిక్కుల్లో కూడా పడింది. ఈ థ్రెడ్స్ అచ్చూ తమ యాప్ కు నకలులా ఉందంటూ ట్విట్టర్ ఆరోపించింది. తమ హక్కులను ఉల్లంఘించింది అంటూ ట్విట్టర్ ఆరోపణలు చేసింది.

అంతేకాకుండా దీనికి సంబంధించి దావా కూడా వేస్తామంటూ ఎలాన్ మస్క్ న్యాయవాది అలెక్స్ స్పిరో.. జుకర్ బర్గ్ కు లేఖ రాశారు. ట్విట్టర్ కు చెందిన కొంతమంది పాత ఉద్యోగులను చేర్చుకుని తమ రహస్యాలను, ఇంటిలిజెన్స్ ను వినియోగించి ఈ థ్రెడ్స్ ను తయారు చేశారని ఆరోపించారు. ట్విట్టర్ కు సంబంధించి మేథో సంబంధిత వివరాలను వినియోగించకుండా.. మెటా సంస్థ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలంటూ అలెక్స్ స్పిరో డిమాండ్ చేశారు.

ఈ విషయాన్ని మెటా సంస్థ తీవ్రంగా ఖండించింది. ట్విట్టర్ లో పని చేసిన ఏ వ్యక్తులను తాము హైర్ చేసుకోలేదంటూ క్లారిటీ ఇచ్చింది. అసలు అది పెద్ద విషయం కూడా కాదంటూ మెటా కామెంట్ చేసింది. అలెక్స్ స్పెరీ రాసిన లేఖను అమెరికాకు చెందిన ఒక మీడియా సంస్థ ప్రచురించింది. ఈ వార్తపై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. పోటీ మంచిదీ కానీ.. మోసం మాత్రం సరైన పద్ధతి కాదంటూ మస్క్ వ్యాఖ్యానించారు. మరోవైపు ట్విట్టర్, థ్రెడ్స్ యాప్స్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ ఈ ఆరోపణలు చేసింది.