nagidream
Block Adult Content On X: ఎక్స్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మీ ఫీడ్ లోకి అడల్ట్ కంటెంట్ ఎక్కువగా వస్తుందా? అడల్ట్ వీడియోలు, బో*ల్డ్ ఫోటోలు వస్తున్నాయా? వాటిని చూడడం మీకు ఇష్టం లేదా? అయితే ఈ టిప్స్ ఫాలో అయితే ఎప్పటికీ కనిపించకుండా చేసుకోవచ్చు.
Block Adult Content On X: ఎక్స్ యాప్ ఓపెన్ చేసినప్పుడు మీ ఫీడ్ లోకి అడల్ట్ కంటెంట్ ఎక్కువగా వస్తుందా? అడల్ట్ వీడియోలు, బో*ల్డ్ ఫోటోలు వస్తున్నాయా? వాటిని చూడడం మీకు ఇష్టం లేదా? అయితే ఈ టిప్స్ ఫాలో అయితే ఎప్పటికీ కనిపించకుండా చేసుకోవచ్చు.
nagidream
ఈ నెలలో సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్ కంటెంట్ మోడరేషన్ రూల్స్ ని అప్డేట్ చేసింది. అడల్ట్, గ్రాఫిక్ కంటెంట్ కి ఎంగేజ్మెంట్ పెంచుకునేందుకు అధికారికంగా ఆమోదించింది. అయితే 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు ఈ అడల్ట్ కంటెంట్ ని చూడలేరని ఎక్స్ కంపెనీ తెలిపింది. సెన్సిటివ్ కంటెంట్ అనే లేబుల్ తో కనిపించే అడల్ట్ కంటెంట్ ఏదీ మైనర్లు చూడలేరని తెలిపింది. అయితే 18 ఏళ్లు పైబడిన చాలా మంది యూజర్లకు అడల్ట్ కంటెంట్ అనేది ఎక్స్ ప్లాట్ ఫార్మ్ లో సర్వ సాధారణమైపోయింది. దీంతో చాలా మంది ఎక్స్ యూజర్లు దీని మీద రిపోర్ట్ చేశారు. అయితే మీరు ఇలాంటి అడల్ట్ కంటెంట్ ని మీ ఎక్స్ ఫీడ్ లోకి రాకుండా ఆపుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజెస్ లో కూడా బ్లాక్ చేసుకునే ఆప్షన్ ఉంది.
అయితే అడల్ట్ కంటెంట్ అన్నీ సెన్సిటివ్ మీడియా కిందకు రావు. అలాంటి వాటిని మీరు బ్లాక్ చేయాలంటే పా*ర్న్ వంటి పదాలను మ్యూట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇలాంటి పదాలను మ్యూట్ చేస్తే కనుక ఎక్స్ ఫీడ్ లో మీకు ఇలాంటి పోస్టులు కనిపించవు.
ఎక్స్ లో కొత్త ఖాతా ఓపెన్ చేసినప్పుడు మీ పుట్టిన తేదీని నమోదు చేయకండి లేదా 18 కంటే తక్కువ వయసుని ఎంటర్ చేయండి. దీని వల్ల ఎక్స్ ఫీడ్ లో మీకు అశ్లీల కంటెంట్ కనిపించదు. మీ పుట్టిన తేదీ నమోదు చేయకపోవడం వల్ల మీరు మైనర్స్ గా పరిగణించబడతారు.
అయితే మీరు ఈ పదాలను 24 గంటలు, 7 రోజులు, 30 రోజుల వరకూ కనిపించకుండా కూడా చేసుకోవచ్చు. మీకు వద్దనుకున్నప్పుడు బ్లాక్ చేసుకోవచ్చు. మళ్ళీ చూడాలంటే మ్యుటెడ్ పదాలను తొలగించుకోవచ్చు. అడల్ట్ కంటెంట్ అయినా, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ వంటి వాటినైనా బ్లాక్ చేయచ్చు. ఆ బ్లాక్ ని తొలగించుకోవచ్చు.