దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ గత కొన్నాళ్లుగా బాగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ ఎలాన్ మస్క్ ఈ కంపెనీని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఏదో ఒక విషయం ద్వారా న్యూస్‌లో ట్విట్టర్ పేరు వినిపిస్తూనే ఉంది. మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ తొలగింపు, భారీ స్థాయిలో ఉద్యోగుల తీసివేతతో పాటు బ్లూ టిక్కు డబ్బులు లాంటి విషయాల ద్వారా ట్విట్టర్ బ్రాండింగ్‌పై దెబ్బపడుతూ వచ్చింది. అయితే మస్క్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ లోగో నుంచి పక్షి మాయమైపోతుందని ఆయన తెలిపారు.
కొన్నేళ్లుగా ట్విట్టర్‌కు పిట్ట లోగో మెయిన్ సింబల్‌గా ఉన్న విషయం తెలిసిందే. లోగో మార్పుకు సంబంధించిన విషయాన్ని ఆదివారం ట్విట్టర్లో ఎలాన్ మస్క్ వెల్లడించారు. సరికొత్తగా ఏర్పాటు చేసిన ‘ఎక్స్ కార్ప్’ అనే కంపెనీలో ట్విట్టర్‌ను విలీనం చేస్తున్నట్లు కొన్నేళ్ల కింద ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ‘ట్విట్టర్ బ్రాండ్‌కు, ఆ తర్వాత క్రమంగా అన్ని పక్షులకు మేం వీడ్కోలు పలకనున్నాం. ఈ నైట్ పోస్ట్ చేసిన ‘ఎక్స్’ లోగో బాగుంటే.. రేపటి నుంచి వరల్డ్‌వైడ్‌గా అదే లైవ్‌లోకి వస్తుంది’ అని మస్క్ ట్వీట్ చేశారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఇదే అతిపెద్ద మార్పుగా నిలవనుందని చెప్పొచ్చు.
ఎలాన్ మస్క్‌కు ‘ఎక్స్’ అనే అక్షరం అంటే చాలా ఇష్టం. ఈ విషయం అందరికీ తెలిసిందే. ట్విట్టర్ సీఈవోగా లిండా యాకరినో బాధ్యతలు తీసుకున్న టైమ్‌లోనూ కంపెనీని ఎవ్రీ థింగ్ యాప్ ఎక్స్‌గా మార్చడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని మస్క్ ట్వీట్ చేశారు. ఇకపోతే, ట్విట్టర్‌లోని అన్‌వెరిఫైడ్ అకౌంట్స్ నుంచి డైరెక్ట్ మెసేజెస్ పంపడాన్ని పరిమితం చేస్తున్నట్లు శనివారం మస్క్ ప్రకటించారు. డైరెక్ట్ మెసేజ్‌ల స్పామ్‌ను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అన్వైరిఫైడ్ అకౌంట్స్ నుంచి భవిష్యత్తులో పరిమిత సంఖ్యలోనే డైరెక్ట్ మెసేజ్‌లు చేయగలరని ఆయన స్పష్టం చేశారు. ట్విట్టర్ లోగో నుంచి పిట్టను తీసేయడంపై మీరేం అనుకుంటున్నారు అనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Like this but X pic.twitter.com/PRLMMA2lYl
— Elon Musk (@elonmusk) July 23, 2023