iDreamPost
android-app
ios-app

నటి న్యూడ్‌ ఫొటోలు లీక్‌ అంటూ వార్తలు.. స్పందించిన నటి!

  • Published Jun 22, 2023 | 12:02 PM Updated Updated Jun 22, 2023 | 12:02 PM
  • Published Jun 22, 2023 | 12:02 PMUpdated Jun 22, 2023 | 12:02 PM
నటి న్యూడ్‌ ఫొటోలు లీక్‌ అంటూ వార్తలు.. స్పందించిన నటి!

సోషల్‌ మీడియా యుగంలో.. మన వ్యక్తిగత జీవితానికి ఎలాంటి భద్రత లేదు. ప్రస్తుతం సోషల్‌ మీడియా వినియోగం అనేది ప్రతి ఒక్కరికి అవసరంగా మారింది. సెలబ్రిటీలు తప్పకుండా సోషల్‌ మీడియాల వినియోగించాల్సిన పరిస్థితులు. అభిమానులకు, తారలకు మధ్య సోషల్‌ మీడియా అనేది వారధిగా మారింది. ఫ్యాన్స్‌తో డైరెక్ట్‌గా మాట్లాడటానికి సోషల్‌ మీడియా బాగా పనికి వస్తుంది. అంతేకాక.. వారికి అదనపు ఆదాయవనరుగా కూడా ఉపయోగపడుతుంది. అయితే సోషల్‌ మీడియా వల్ల ఉపయోగం ఎంత ఉందో.. చెడు కూడా అంతే జరుగుతుంది. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటోలను మార్ఫ్‌ చేసి.. వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. ఇక తాజాగా ఓ నటికి చెందిన న్యూడ్‌ ఫొటోలు అంటూ కొన్ని అసభ్యకరమైన పిక్స్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. తాజాగా దీనిపై సదరు నటి స్పందించారు. ఆ వివరాలు..

నటి జయవాణి అంటే టక్కున గుర్తుపట్టడం కష్టం కానీ.. విక్రమార్కుడు చిత్రంలో.. రవితేజతో గొడవకు వచ్చే సన్నివేశంలో.. ఒరేయ్‌ సత్తిగా బయటకు రారా అంటూ చెప్పే ఒకే ఒక్క డైలాగ్‌తో ప్రేక్షకులకు చేరువయ్యారు జయవాణి. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ.. రాణిస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్న జయవాణి.. తనకు నచ్చిన పాత్రలు మాత్రమే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక సినిమాల సంగతి పక్కకు పెడితే.. సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు జయవాణి. ఫేస్‌బుక్‌లో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ఒక మిలియన్‌కు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఇలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం జయవాణి పేరిటి ఒక ట్విట్టర్‌ అకౌంట్‌ దర్శనం ఇచ్చింది. ఇది తన అఫీషియల్ అకౌంట్ అని.. దయచేసి ఫేక్ అకౌంట్లను ఎంకరేజ్ చేయొద్దని ప్రొఫైల్‌లో రాసి ఉంది. బ్లూటిక్‌ కూడా ఉండటంతో.. ఇది జయవాణి అఫిషియల్‌ అకౌంట్‌ అని భావించారు అభిమానులు. దాంతో కొన్ని రోజుల్లోనే సుమారు 17వేలకు పైగా మంది ఆమె ట్విట్టర్‌ ఖాతాను ఫాలో అవ్వసాగారు. అయితే గత కొన్ని రోజులుగా జయవాణి ట్విట్టర్‌ అకౌంట్‌లో అసభ్యకరమైన కంటెంట్‌ పోస్ట్‌ అవుతూ వస్తోంది. మహిళలకు సంబంధించిన అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలను జయవాణి అకౌంట్‌తో రీట్వీట్‌ చేస్తుండటంతో.. ఇది పెద్ద సంచలనంగా మారింది. దీనిపై భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా నేడు జయవాణి న్యూడ్‌ ఫొటో అంటూ మహిళ వెనక వైపు భాగం కనిపించేలా ఉన్న ఫొటోను ఒకటి జయవాణి అకౌంట్‌లో కనిపించడంతో.. ఆమె అభిమానులు షాక్‌కు గురయ్యారు.

ఈ ఫొటోతో పాటు.. జయవాణి నెట్‌ఫ్లిక్స్‌లో శూర్పణఖ అనే వెబ్‌ సిరిస్‌లో నిర్మిస్తూ.. నటిస్తోంది. ఐదు భాషల్లో ఈ వెబ్‌సిరీస్‌ విడుదల కానుంది. త్వరలోనే టీజర్ విడుదల కానుంది. ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన ప్రీ లుక్ అంటూ ఆ న్యూడ్ ఫొటో వదిలారు. నిమిషాల్లోనే ఇది వైరల్‌ అయ్యింది. అసలు ఇంతకు ఇది జయవాణి ట్విట్టర్‌ ఖాతానేనా.. స్వయంగా తనే తన న్యూడ్‌ ఫొటో పోస్ట్‌ చేస్తుందా అంటూ నెటిజనులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ న్యూడ్‌ ఫొటో ఇష్యూపై జయవాణి స్పందించారు. ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడి.. దీనిపై క్లారిటీ ఇచ్చారు.

అసలు తనకు ట్విట్టర్ అకౌంటే లేదని జయవాణి చెప్పారు. తన పేరు మీద ఎవరో ఈ ఫేక్ అకౌంట్ సృష్టించారని తెలిపారు. మీరు ‘శూర్పణఖ’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారా అని చాలా మంది అడుగుతున్నారని.. కానీ తాను ప్రస్తుతం ఎలాంటి వెబ్‌సిరీస్‌లలో నటించడం లేదని వెల్లడించారు. ఆ న్యూడ్ ఫొటోలు తనవి కాదని.. అసలు ఆ ట్విట్టర్ అకౌంట్ కూడా తనది కాదని.. దయచేసి ఎవ్వరూ ఆ ట్వీట్లను నమ్మొద్దని జయవాణి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ఆ ఫేక్ ట్వీట్లు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş