P Venkatesh
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వైరల్ గా మారుతోంది. ఇక డీప్ ఫేక్ వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపై ఈ ఫేక్ వీడియోలకు చెక్ పడనుంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వైరల్ గా మారుతోంది. ఇక డీప్ ఫేక్ వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపై ఈ ఫేక్ వీడియోలకు చెక్ పడనుంది.
P Venkatesh
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమమైంది. ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలను సృష్టిస్తోంది. అయితే లేటెస్ట్ టెక్నాలజీని మంచి కోసం వినియోగిస్తే ఎలాంటి సమస్య రాదు. కానీ కొంత మంది టెక్నాలజీని అడ్డుపెట్టుకుని దారుణాలకు పాల్పడుతున్నారు. ఆన్ లైన్ ఫ్రాడ్, ఫేక్ వీడియోలు, ఫేక్ ఫొటోలు, వాయిస్ రికార్డింగ్స్ రిక్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ఫేక్ వీడియోల భారిన పడి సెలబ్రిటీల నుంచి పొలిటికల్ లీడర్స్ వరకు బాధితులుగా మారుతున్నారు. అయితే ఈ ఫేక్ వీడియోలకు చెక్ పెట్టేందుకు ప్రముఖ సోషల్ మీడియా ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అదిరిపోయే ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫేక్ వీడియోలను కనిపెట్టే ఫీచర్ ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డీప్ ఫేక్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. సినిమా హీరోయిన్ల ఫోటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు కొందరు వ్యక్తులు. ఇప్పటికే ఈ డీప్ ఫేక్ వీడియోలకు క్రికెట్, బిజినెస్, సినిమా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు మాట్లాడిన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాల్లో ప్రచారం చేసి రాక్షస ఆనందం పొందుతున్నారు. డీప్ ఫేక్ వీడియోల వల్ల నిజ నిజాలు తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో డీప్ ఫేక్ వీడియోలకు చెక్ పెట్టేందుకు ఎక్స్ ప్లాన్ రెడీ చేస్తోంది.
డీప్‌ఫేక్ వీడియోలను అరికట్టేందుకు ఎక్స్ సిద్దమవుతోంది. అలాంటి వీడియోలను కనిపెట్టే ఫీచర్‌ను ఎక్స్ (ట్విటర్) త్వరలో తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ ఎక్స్ అధికారిక అకౌంట్ లో ప్రకటించారు. డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోస్, క్రియేట్ చేసే షెల్లోఫేక్స్ లాంటి సాఫ్ట్‌వేర్లను పసిగట్టే విధంగా ఈ ఫీచర్ ను రూపొందిస్తున్నారు. ఈ ఫీచర్ తో ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఫొటోస్, వీడియోస్ 30 పర్సెంట్ మ్యాచ్ అయితే ఎక్స్ ఫేక్ వీడియోగా గుర్తిస్తుందని ఎక్స్ వెల్లడించింది. పోస్ట్ చేసిన వీడియో, ఫొటో, ఆడియో ఎన్ని పోస్టులకు రిలేటెడ్ గా ఉందో నెంబర్స్ తో సహా చూపిస్తుందని ఎక్స్ తెలిపింది. ఎక్స్ నిర్ణయంతో త్వరలోనే డీప్ ఫేక్ వీడియోలకు అడ్డుకట్ట పడునుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.