Arjun Suravaram
Arjun Suravaram
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసిన ఈ విషయం గురించే చర్చ. ఏ ఇద్దరిని కదిలించిన చంద్రబాబు అరెస్ట్ గురించి చర్చించుకుంటున్నారు. అలానే సోషల్ మీడియాలో సైతం చంద్రబాబుకు సంబంధించిన విషయాలు ఫుల్ ట్రెడింగ్ లో ఉన్నాయి. జీ20 సమావేశాల తర్వాత అత్యధికంగా ట్విట్టర్‌లో ‘అవినీతి చక్రవర్తి చంద్రబాబు’ అన్న పదమే ట్రెండింగ్‌లో ఉంది. శనివారం ఉదయం స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు అవినీతిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలోనే స్కామ్ స్టర్ బాబు అనే పదం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది.
తరచూ ఏదో ఒక అంశానికి సంబందించిన పదాలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇటీవల జీ-20 సదస్సు కు సంబంధించిన పదాలు ట్రెండ్ అవుతున్నాయి. అలానే కరప్షన్ కింగ్ సీబీఎన్ పేరుతో క్రియేట్ చేసిన హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఇక శనివారమంతా ట్విట్టర్ ట్రెండింగ్‌లో జి-20సమావేశల అంశం తరువాత ఈ హ్యాష్ ట్యాగ్ రెండో స్థానంలో కొనసాగింది. నెటిజన్లు శనివారం ఉదయం నుంచి ఈ హ్యాష్ ట్యాగ్‌తో లక్షలాది పోస్టులను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.
దీంతోపాటు స్కామ్ స్టార్ చంద్రబాబు, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం పేరుతో క్రియేట్ చేసిన హ్యాష్ ట్యాగ్‌లు కూడా ట్రెండింగ్‌లో నిలిచాయి. జీ20 సమావేశాల సందర్భంగా జాతీయ మీడియా చంద్రబాబు అంశంపై ఎక్కవగా ఫోకస్ చేయలేదు. అలానే చంద్రబాబుకు సంబంధించిన ఈ వార్తల ఎక్కువ సమయం కేటాయించకపోయినా సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో ఇప్పటికే ఈడీ రంగంలోకి దిగి రూ.30 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసిన విషయాన్న నేషనల్ మీడియా ప్రధానంగా ప్రస్తావించింది. మరి.. ట్విట్టర్ లో స్కామ్ స్టర్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెడింగ్ లో ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఏమో, తెలియదు, గుర్తులేదు… మర్చిపోయా -బాబోరు#ScamSterChandrababu#scamstarchandrababu#BanYellowMediaSaveAP#EndOfTDP pic.twitter.com/fl7hzLSWua
— 🇮🇳 కాటేపల్లి శేషుయాదవ్ 🇸🇱 (@sesuyadav) September 9, 2023
స్కాం స్టార్….#SkillDevelopmentScam#Rcpm#ScamsterChandrababuలా pic.twitter.com/Vb5fPfAip1
— Surya naga prasad Kudupudi (@Suryanagaprasa1) September 10, 2023