చిరంజీవి సినిమా నుంచి త్రిష తప్పుకుంది. కారణం మొదట చెప్పిన కథకి , తర్వాత జరుగుతున్న దానికి తేడా ఉండటమే. దీన్ని సృజనాత్మక విభేదంగా త్రిష కొత్త పేరు పెట్టింది. నిజానికి మన సినిమాలన్నీ హీరో ఒరియెంటెడ్ మాత్రమే. హీరోయిన్కి ప్రాధాన్యత ఉన్న సినిమాలు తక్కువ. ఇన్నేళ్లు ఫీల్డ్లో ఉన్న త్రిషకి ఈ విషయం తెలియకుండా ఉండదు. అందులోనూ చిరంజీవి సినిమా అంటే హీరోయిన్ డమ్మీనే. సైరాలో తమన్నా, నయనతారల పరిస్థితి చూశాం కదా! విషయం ఏంటంటే […]
గత ఏడాది అక్టోబర్ ముందు వరకు దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోయింది. కారణం మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి సినిమా. చిరు డ్రీం ప్రాజెక్ట్ ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న దర్శకుడిగా ఇతని మీద చాలా చర్చ జరిగింది. ఇక్కడ వంద కోట్ల షేర్ రాబట్టుకున్నప్పటికీ బయటి రాష్ట్రాల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యింది సైరా. పాన్ ఇండియా కలలను ఛిద్రం చేస్తూ ఫైనల్ గా నష్టాలు మిగిల్చింది. అభిమానులను సైతం సైరా […]
మన దేశంలో బాలీవుడ్ తర్వాత మళ్లీ అంత పెద్ద ఇండస్ట్రీ టాలీవుడ్ అనే చెప్పాలి. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి ఆదాయం వస్తోంది. అయితే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సినిమా పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయం ఒక్కటిగానే ఉండేది. రాష్ట్రం విడిపోయాక రెండు రాష్ట్రాలకూ ఆదాయం లభిస్తోంది. అందుకే సినీ ఇండస్ట్రీనుంచి ఎవరు వచ్చి ముఖ్యమంత్రులను కలిసినా ఆహ్వానిస్తున్నారు. అయితే ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయి చాలాకాలం గడిచినా సినీ ఇండస్ట్రీనుంచి […]
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన స్థానం సాధించిన మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాజకీయాల్లో అదే రీతిలో శాసించాలని ఆశించారు. కానీ అందుకు భిన్నంగా పరిస్థితులు ఎదురయ్యాయి. చివరకు ఆయన సొంత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, కేంద్ర మంత్రివర్గంలో చేరినా ఎక్కువ కాలం కొనసాగడానికి ఛాన్స్ దక్కలేదు. దాంతో మళ్లీ సినిమాలతో ఆయన బిజీ అయిపోయారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య షూటింగ్ లో పాల్గొంటూనే సినీరంగానికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. […]
నిన్న జరిగిన విశ్వక్ సేన్ హిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సమర్పకుడుగా వ్యవహరించిన నాని వల్ల రాజమౌళి, అనుష్క, అల్లరి నరేష్, సందీప్ కిషన్, రానా లాంటి స్పెషల్ గెస్టులు రావడంతో వేడుక నిండుగా జరిగింది. గత కొంతకాలంగా మీడియా కంటికి దూరంగా ఉన్న అనుష్క చాన్నాళ్ల తర్వాత కెమెరా ముందు రావడంతో ముఖ్యంగా అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. స్టేజి మీద విల్లు ఎక్కుపెట్టి బాణం వదలడం లాంటివి చేయడంతో మంచి […]
173 సంవత్సరాల కిందట 22-Feb-1847న కుంఫిణీ సైన్యం చేతిలో చంపబడి, 30 సంవత్సరాల పాటు అస్థిపంజరం గ్రామ గుమ్మటానికి వేలాడదీయబడిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్ర మీద గడచిన 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చిరంజీవి “సైరా” ఈ చర్చకు పునాది వేసింది . చరిత్రలో ఎవరి మీద జరగనంత దాడి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి మీద జరిగింది.దాని ప్రధాన కారణం వర్తమాన సామాజిక,రాజకీయ కారణాలు కావచ్చు. నరసింహా రెడ్డిది కాదనలేని తిరుగుబాటు 11 […]
ఈ పోకడ గమనిస్తే మనవాళ్ళకు పక్క చూపులు ఎక్కువయ్యాయి. అంటే ఇతర రాష్ట్రాల్లో డబ్బింగ్ రూపంలోనో లేదా మల్టీ లాంగ్వేజ్ లోనో సినిమాలు వదిలి కాస్త ఎక్కువ డబ్బు చేసుకుందామనే ఆలోచన ఎక్కువ ఫలితాలను ఇవ్వడం లేదు. విజయ్ దేవరకొండ ఇప్పటికే ఈ విషయంలో మూడు సార్లు దెబ్బ తిన్నాడు. నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ తెలుగుతో సహా అన్ని వెర్షన్లు బోల్తా కొట్టాయి. చిరంజీవి సైరా ఇక్కడే ఓ మాదిరిగా పర్వాలేదు అనిపిస్తే […]
ఏదో పింక్ రీమేక్ అనౌన్స్ చేయగానే పవన్ కళ్యాణ్ ఒకటో రెండో సినిమాలు చేసి మళ్ళీ జనసేనలో బిజీ అవుతాడేమో అనుకున్నారందరూ. కానీ దానికి విరుద్ధంగా ఒకేవారంలో రెండు షూటింగ్ ప్రారంభాలు, ఒక అనౌన్స్ మెంట్ రావడం అనేది అభిమానులు సైతం ఊహించనిది. ముఖ్యంగా నిన్న గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబో అనౌన్స్ చేయడం సోషల్ మీడియాలో చిన్నపాటి దుమారమే రేపింది. ఇంకో ఇండస్ట్రీ హిట్ కు దారులు పడ్డాయని అప్పుడే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. […]
స్టార్ హీరోల సినిమాలకు వసూళ్లు తగ్గినప్పుడు అభిమానులను మళ్ళీ ఆకర్షించడం కోసం, ప్రేక్షకులకు మరోసారి ఆప్షన్ ఇచ్చేందుకు ఎడిటింగ్ టేబుల్ లో తీసేసిన సీన్లు, పాటలు కలపడం కొత్తగా వచ్చిన ట్రెండ్ కాదు. నిన్న సరిలేరు నీకెవ్వరు టీమ్ త్వరలో కొన్ని సన్నివేశాలను జోడించబోతున్నామని అవి చాలా హిలేరియస్ గా ఉంటాయని చెప్పారు. నిజానికి అవి అంత కామెడీ ఉన్న ఎపిసోడ్లే అయితే ముందే అలా కోతకు గురయ్యేవి కాదుగా. ఇప్పుడు ఇవి యాడ్ చేసినంత మాత్రాన […]
ఇటీవలే విడుదలైన సరిలేరు నీకెవ్వరులో ఒక యాక్షన్ సీక్వెన్స్ లో సేతురామన్ అనే నటుడు చెప్పిన లోడ్ ఎత్తాలి రమణ అనే డైలాగ్ బాగా పేలింది. చెక్ పోస్ట్ పడతాది అంటూ సీమ యాసలో చెప్పిన ఆ ఒక్క లైన్ కే జనం కనెక్ట్ అయిపోయారు. ఎంతగా అంటే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో స్టేజి మీద పిలిచి ప్రత్యేకంగా గౌరవించేంత. అయితే ఈ సేతురామన్ ప్రేక్షకులకు కొత్త కాని పరిశ్రమకు కాదు . అతనికి […]