iDreamPost
android-app
ios-app

పవన్ లిస్టులో షాకింగ్ డైరెక్టర్స్

  • Published Feb 02, 2020 | 7:40 AM Updated Updated Feb 02, 2020 | 7:40 AM
  • Published Feb 02, 2020 | 7:40 AMUpdated Feb 02, 2020 | 7:40 AM
పవన్ లిస్టులో షాకింగ్ డైరెక్టర్స్

ఏదో పింక్ రీమేక్ అనౌన్స్ చేయగానే పవన్ కళ్యాణ్ ఒకటో రెండో సినిమాలు చేసి మళ్ళీ జనసేనలో బిజీ అవుతాడేమో అనుకున్నారందరూ. కానీ దానికి విరుద్ధంగా ఒకేవారంలో రెండు షూటింగ్ ప్రారంభాలు, ఒక అనౌన్స్ మెంట్ రావడం అనేది అభిమానులు సైతం ఊహించనిది. ముఖ్యంగా నిన్న గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబో అనౌన్స్ చేయడం సోషల్ మీడియాలో చిన్నపాటి దుమారమే రేపింది. ఇంకో ఇండస్ట్రీ హిట్ కు దారులు పడ్డాయని అప్పుడే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 

ఈ చర్చలు ఇంకా పూర్తి కాకుండానే ఇప్పుడు మరో డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. సుమంత్ తో మళ్ళీ రావా, నానితో జెర్సి లాంటి ఎమోషనల్ హిట్స్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంతో పవన్ ఓ సినిమా చేయొచ్చనే టాక్ ఇప్పుడు ఇంకో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడో నెలల క్రితమే కథ చెప్పాడని అప్పుడే మెచ్చిన పవన్ కళ్యాణ్ టైం వచ్చినప్పుడు ప్లాన్ చేద్దామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ దిశగా సంకేతాలు ఇస్తున్నాడట. గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం షాహిద్ కపూర్ తో జెర్సి రీమేక్ తో బిజీ ఉన్నాడు. అది పూర్తయ్యే లోపు పవన్ ఇంకా పూర్తిగా ఫ్రీ అయ్యుండడు. ఆలోగా నిజంగా కుదిరితే ఆ స్క్రిప్ట్ పై పనులు మొదలుపెట్టుకోవచ్చు. 

సెన్సిబుల్ సినిమాలు తీసే గౌతమ్ పవన్ లాంటి మాస్ మార్కెట్ ఉన్న హీరోని ఎలా డీల్ చేస్తాడా అనే అనుమానం కలగడం సహజం. ఇదలా ఉంచితే సైరా ఫేమ్ సురేందర్ రెడ్డి వద్ద కూడా పవన్ కోసం ఓ సబ్జెక్టు ఉందట. సైరాలో అన్నయ్యను డీల్ చేసిన విధానం నచ్చిన పవన్ ఇతనికి సై అన్నా ఆశ్చర్యం లేదు. మరోవైపు పవన్ తో పూరి కూడా టచ్ లో ఉన్నాడట. ఈ లెక్కన ఇంకో నాలుగేళ్ళ కాలంలో పవర్ స్టార్ ఎన్ని సినిమాలు చేస్తాడో కౌంట్ చెప్పడం కష్టంగానే ఉంది. రాజకీయాలకు సంబంధించి మీడియాతో టచ్ లో ఉన్న పవన్ సినిమాల ఊసు మాత్రం పొరపాటున కూడా ఎత్తకపోవడం కొసమెరుపు.

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet