కొత్త సినిమాలు చెప్పుకోదగ్గ కౌంట్ లో వస్తున్నా బాక్సాఫీస్ వద్ద ఆశించిన జోష్ కనిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా నెమ్మదిగా ఉండగా టికెట్ కౌంటర్ల దగ్గర సైతం ఏమంత హడావిడి కనిపించడం లేదు. రేపు రవితేజ ధమాకా మీద ట్రేడ్ ఆశలన్నీ. ఇది కూడా టాక్ పికప్ అయ్యాకే స్పీడ్ చూపించేలా ఉంది తప్పించి ముందస్తుగా అయితే ఎలాంటి దూకుడు సూచనలు లేవు. పోటీ ఎందుకని ఈ రోజు రెండు డబ్బింగ్ చిత్రాలు బాక్సాఫీస్ మీదకు […]
అసలెప్పుడూ ప్రమోషన్లకే రాని తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార ఎట్టకేలకు మీడియా కెమెరా ముందుకు వచ్చింది. రేపు విడుదల కాబోతున్న కనెక్ట్ పబ్లిసిటీలో భాగంగా యాంకర్ సుమకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున లాంటి అగ్ర హీరోలతో పాటు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి న్యూ జనరేషన్ తో నటించినా ఎప్పుడూ ఈవెంట్లకు ముఖాముఖీ కార్యక్రమాలకు నో చెప్పే నయన్ ఇప్పుడు మాత్రం ఎస్ చెప్పడం చాలా మందికి […]
దసరా పండక్కు విడుదలైన మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగుపెట్టింది. ఓవర్సీస్ లోనూ 1 మిలియన్ మార్క్ దాటేసి ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి తర్వాత ఆ ఫీట్ అందుకున్న మూడో సినిమాగా రికార్డు అందుకుంది. ఒకవేళ ఆచార్య హిట్ అయ్యుంటే అదీ చేరేది కానీ ఆ డిజాస్టర్ ప్రభావమే దీని బిజినెస్ మీద ప్రభావం చూపించింది. బుధవారం రిలీజ్ తో కలుపుకుని మొత్తం అయిదు రోజులు బాక్సాఫీస్ వద్ద […]
నూటా యాభైకి పైగా సినిమాల సుదీర్ఘ ప్రస్థానంలో చిరంజీవి చూడని ఎత్తుపల్లాలు హిట్లు ఫ్లాపులు లేకపోయినా ఆచార్య ప్రభావమో మరో కారణమో చెప్పలేం కానీ మొత్తానికి గాడ్ ఫాదర్ మీద ముందు నుంచి ఉండాల్సిన స్థాయిలో హైప్ లేదన్నది వాస్తవం. దానికి తోడు నిర్మాణ సంస్థ నిదానంగా చేసిన ప్రమోషన్లు ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టగా, మలయాళం లూసిఫర్ రీమేకనే ప్రచారం దీనికి మేలు కంటే చెడే చేసిందన్న మాట వాస్తవం. ఇన్నేసి విభిన్న అంచనాల మధ్య […]
ఇంకో రెండే రోజుల్లో గాడ్ ఫాదర్ థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు. ఆచార్య మెగా డిజాస్టర్ తర్వాత వస్తున్న మూవీ అయినప్పటికీ నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా పెద్ద మొత్తాన్ని బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా పెట్టుకుని స్వంతంగా రిలీజ్ చేస్తున్నట్టు ట్రేడ్ టాక్. ప్రస్తుతానికి మేజర్ సెంటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ భీభత్సంగా కాదు కానీ డీసెంట్ గానే ఉన్నాయి. ఒక వేళ మౌత్ టాక్ తో పాటు రివ్యూస్ పాజిటివ్ గా వచ్చాయంటే మాత్రం దసరా […]
ఇంకో వారం రోజుల్లో విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మలయాళం లూసిఫర్ రీమేక్ గా రూపొందిన ఈ పొలిటికల్ డ్రామాలో సత్యదేవ్, నయనతార, మురళీశర్మ, సముతిరఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికిది మక్కికి మక్కి సీన్ టు సీన్ కాపీగా తీస్తారేమోననే అంచనాలే ఎక్కువగా ఉన్నాయి. లూసిఫర్ నిడివి మూడు గంటలకు దగ్గరగా ఉంటుంది. అది కూడా కేవలం ఒక ఐటెం సాంగ్ […]
మంచి ప్రతిభ ఉన్న నటుడిగా ఎంత పేరున్నప్పటికీ ఇంకా స్టార్ లీగ్ లోకి చేరుకోలేకపోతున్న సత్యదేవ్ కు బ్లఫ్ మాస్టర్ తర్వాత వచ్చిన పరాజయాలు మార్కెట్ ని బాగా దెబ్బ తీశాయి. తనవంతుగా చాలా కష్టపడుతున్నాడు కానీ దర్శకులు కథల ఎంపికలో చేస్తున్న పొరపాట్ల వల్ల కెరీర్ ఆశించినంత వేగంగా ముందుకు సాగటం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో రాబోతున్న రెండు పెద్ద సినిమాలు సక్సెస్ అయ్యాయంటే అతని ట్రాక్ రికార్డును బుల్లెట్ వేగంతో తీసుకెళ్లే […]
అసలు ప్రమోషన్ల ఊసే లేకుండా డల్ గా కనిపిస్తున్న గాడ్ ఫాదర్ అక్టోబర్ 5 విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదని మెగా కాంపౌండ్ లేటెస్ట్ అప్ డేట్. ఇప్పటిదాకా పబ్లిసిటీపరంగా యాక్టివ్ నెస్ కనిపించకపోవడంతో వాయిదా తప్పదేమోనని టెన్షన్ పడుతున్న అభిమానులకు ఊరట కలిగించబోతున్నట్టు తెలిసింది. ఈ నెల 25 అనంతపూర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. తేదీ కొంచెం అటు ఇటు […]
కేవలం ఇంకో 18 రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా గాడ్ ఫాదర్ విడుదల కానుంది. ప్రమోషన్ల విషయంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ చూపిస్తున్న అలసత్వం అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. రెండు రోజుల క్రితం చిరు సల్మాన్ ఖాన్ ల కాంబో లిరికల్ సాంగ్ ని యుట్యూబ్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ సమయానికి టైమర్ పెట్టుకుని మరీ ఎదురు చూస్తే తూచ్ సాంకేతిక కారణాల వల్ల ఇంకా అవ్వలేదు, ప్రస్తుతానికి స్పాటిఫైలో […]
మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తోందంటేనే కనీసం నెల రోజుల నుంచి ఓ రేంజ్ లో హడావిడి ఉంటుంది. అలాంటిది గాడ్ ఫాదర్ ఇంకో 20 రోజుల్లో రావడం కన్ఫర్మ్ అయినప్పటికీ సోషల్ మీడియాలోనూ ఎలాంటి సౌండ్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిన్న వదిలిన చిరు సల్మాన్ ల కాంబో సాంగ్ బిట్ కూడా ట్రోలింగ్ కు గురయ్యిందే తప్ప ఏమంత ఎగ్జైట్ మెంట్ కలిగించలేదు. అంత పెద్ద క్యాస్టింగ్, తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్, కోలీవుడ్ నుంచి […]