iDreamPost
android-app
ios-app

నయనతారలో మార్పు – ప్రమోషన్ల వెనుక అసలు కారణం

  • Published Dec 21, 2022 | 7:28 PM Updated Updated Dec 21, 2022 | 7:28 PM
  • Published Dec 21, 2022 | 7:28 PMUpdated Dec 21, 2022 | 7:28 PM
నయనతారలో మార్పు – ప్రమోషన్ల వెనుక అసలు కారణం

అసలెప్పుడూ ప్రమోషన్లకే రాని తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార ఎట్టకేలకు మీడియా కెమెరా ముందుకు వచ్చింది. రేపు విడుదల కాబోతున్న కనెక్ట్ పబ్లిసిటీలో భాగంగా యాంకర్ సుమకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున లాంటి అగ్ర హీరోలతో పాటు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి న్యూ జనరేషన్ తో నటించినా ఎప్పుడూ ఈవెంట్లకు ముఖాముఖీ కార్యక్రమాలకు నో చెప్పే నయన్ ఇప్పుడు మాత్రం ఎస్ చెప్పడం చాలా మందికి షాక్ కలిగిస్తోంది. ఇంత హఠాత్తుగా మార్పేంటబ్బా అంటూ ఆ వీడియోను చూస్తున్నారు. కొంచెం లోతుగా ఆలోచిస్తే దీనికి కారణాలు అర్థమవుతాయి.

నయనతార విగ్నేష్ శివన్.. ఫ్యాన్స్ కోసం ఏర్పాటు చేసిన రిసెప్షన్


మొదటిది కనెక్ట్ నిర్మాణంలో భర్త విగ్నేష్ శివన్ కీలక భాగస్వామి. అంటే పెట్టుబడి ఇద్దరి సొమ్మే. రెండోది ఇది చాలా చిన్న సినిమా. కేవలం 99 నిముషాల నిడివితో పూర్తి హారర్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఇలాంటి దానికి జనాన్ని థియేటర్లకు రప్పించడం అంత సులభం కాదు. ఓటిటిలో ఈ టైపు కంటెంట్ టన్నుల్లో దొరుకుతుంది. కాబట్టి ప్రత్యేక ఫోకస్ అవసరం. మూడోది క్రిస్మస్ కి విపరీతమైన పోటీ నెలకొంది. అదే రోజు విశాల్ లాఠీ వస్తోంది. ఒక రోజు గ్యాప్ తో రవితేజ ధమాకాకి తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ దక్కనుంది. మాస్ ఆడియన్స్ కి దీని మీద మంచి అంచనాలు ఉన్నాయి. నిఖిల్ 18 పేజెస్ సైతం మంచి బజ్ తో థియేటర్లలో అడుగు పెట్టనుంది

ఇవి కాకుండా బాలీవుడ్ నుంచి సర్కస్ వస్తోంది. రణ్వీర్ సింగ్ దీపికా పదుకునే హీరో హీరోయిన్లు. ;పూజా హెగ్డే కూడా ఉంది కానీ తనను ఎందుకో హైలైట్ చేయడం లేదు. మరి ఇంత విపరీతమైన పోటీ ఉన్నప్పుడు నయనతార ఈ మాత్రం చొరవ తీసుకుని మీడియాతో మాట్లాడ్డం అవసరమే. ప్రీమియర్లు కూడా వేశారు కానీ ఇంకా స్పష్టమైన రిపోర్ట్ రావాల్సి ఉంది. మయూరి, గేమ్ ఓవర్ లాంటి విలక్షణ చిత్రాలతో భయపెట్టిన దర్శకుడు అశ్విన్ శరవణన్ నుంచి వస్తున్న మూవీ కావడంతో హారర్ లవర్స్ ఆసక్తిగానే ఉన్నారు. కరోనా లాక్ డౌన్ టైంలో ఓ కుటుంబంలో చెలరేగిన భయానక సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ కనెక్ట్ ని రూపొందించారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş