iDreamPost
android-app
ios-app

Godfather గాడ్ ఫాదర్ బిజినెస్ లెక్కలు

  • Published Oct 03, 2022 | 4:23 PM Updated Updated Oct 03, 2022 | 4:23 PM
Godfather గాడ్ ఫాదర్ బిజినెస్ లెక్కలు

ఇంకో రెండే రోజుల్లో గాడ్ ఫాదర్ థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు. ఆచార్య మెగా డిజాస్టర్ తర్వాత వస్తున్న మూవీ అయినప్పటికీ నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా పెద్ద మొత్తాన్ని బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా పెట్టుకుని స్వంతంగా రిలీజ్ చేస్తున్నట్టు ట్రేడ్ టాక్. ప్రస్తుతానికి మేజర్ సెంటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ భీభత్సంగా కాదు కానీ డీసెంట్ గానే ఉన్నాయి. ఒక వేళ మౌత్ టాక్ తో పాటు రివ్యూస్ పాజిటివ్ గా వచ్చాయంటే మాత్రం దసరా పండగ సెలవులను పూర్తిగా వాడుకుని గట్టెక్కొచ్చు. కాకపోతే పొన్నియన్ సెల్వన్ తరహాలో వారం ముందుగా అంటే సెప్టెంబర్ 30నే చిరంజీవి, నాగార్జునలలో ఎవరో ఒకరు వచ్చి ఉంటే ఎక్కువ లాభపడేవాళ్ళన్న కామెంట్లో నిజముంది.

ఇక లెక్కల విషయానికి వస్తే నైజామ్ 22 కోట్లు, సీడెడ్ 13 కోట్ల 50 లక్షలు, ఆంధ్ర 35 కోట్ల దాకా బిజినెస్ చేసినట్టు తెలిసింది. అంటే ఏపీ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు కలిపి 70 కోట్లు అవుతుంది. కర్ణాటక 6 కోట్ల 50 లక్షలు, హిందీ వెర్షన్ తో పాటు మిగిలిన రెస్ట్ అఫ్ ఇండియాకు 6 కోట్ల 50 లక్షలు, ఓవర్సీస్ 7 కోట్ల 50 లక్షల దాకా అమ్మినట్టు తెలిసింది. మొత్తం వరల్డ్ వైడ్ చూసుకుంటే ఇది 91 కోట్లకు చేరుతుంది. అంటే లాభాలు కౌంట్ చేయాలంటే 92 కోట్ల షేర్ ని వసూలు చేయాలి. ఇదంత సులభం కాదు. గాడ్ ఫాదర్ మీద ఉన్న బజ్ కి కనివిని ఎరుగని ఓపెనింగ్స్ వస్తాయని చెప్పలేం కానీ చిరంజీవి రేంజ్ లో బొమ్మ ఉందనే మాట వస్తే మాత్రం కచ్చితంగా రాబట్టుకోవచ్చు.

ఎలా చూసినా ఈ ఫిగర్స్ ఆచార్య, సైరా కంటే తక్కువే. అనవసరమైన రిస్క్ కు తావివ్వకుండా ప్రొడ్యూసర్లు మంచి పని చేశారు. హిందీ వెర్షన్ ప్రమోషన్లు నిన్నటి నుంచి మొదలయ్యాయి. సల్మాన్ ఖాన్ తో బాలీవుడ్ ట్రైలర్ ని రిలీజ్ చేయించి మీడియాతో మాట్లాడ్డం బాగానే వెళ్ళింది. ఈ సందర్భంగానే తమ స్నేహం ఎంత గొప్పదనే విషయం చిరంజీవి, సల్లు భాయ్ షేర్ చేసుకోవడం, కిసీకి భాయ్ కిసీకి జాన్ లో రామ్ చరణ్ క్యామియో చేసిన విషయం బయటపడ్డాయి. మొత్తానికి దసరా బరిలో దిగుతున్న గాడ్ ఫాదర్ ఎలాంటి ఫలితం రాబట్టుకుంటాడో చూడాలి. ఎండ్ టైటిల్స్ కు ముందు వచ్చే తార్ మార్ తప్ప ఇందులో ఎలాంటి డాన్సింగ్ నెంబర్లు లేవన్న సంగతి తెలిసిందే.