iDreamPost
android-app
ios-app

Chiranjeevi గాడ్ ఫాదర్ ముందున్న భారీ సవాళ్లు

  • Published Aug 22, 2022 | 3:40 PM Updated Updated Aug 22, 2022 | 3:40 PM
Chiranjeevi గాడ్ ఫాదర్ ముందున్న భారీ సవాళ్లు

ఇవాళ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నిన్న సాయంత్రం విడుదల చేసిన గాడ్ ఫాదర్ టీజర్ ఆన్ లైన్ లో బాగానే దూసుకుపోతోంది. సర్ప్రైజ్ ప్యాక్ లాగా ఇందులోనే సల్మాన్ ఖాన్ ని రివీల్ చేయడం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. అయితే చివర్లో విఎఫ్ఎక్స్ సహాయంతో ఇద్దరూ జీపులో వచ్చే సీన్ లో ఎఫెక్ట్స్ సరిగా లేకపోవడంతో కొంత ట్రోలింగ్ కి అవకాశం దక్కింది. చివరి నిమిషం దాకా ఒత్తిడి నెత్తి మీద వేసుకుని వీడియో సిద్ధం చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని, వాస్తవానికి ఫైనల్ కాపీలో ఇంపాక్ట్ వేరుగా ఉంటుందని యూనిట్ వర్గాలంటున్నాయి. దీనికి తోడు చెప్పిన టైంకి కాకుండా అరగంట లేట్ చేయడం మరో ట్విస్టు.

ఇక అంచనాల విషయానికి వస్తే గాడ్ ఫాదర్ మీద మంచి హైప్ ఉంది కానీ భీభత్సమైన అంచనాలు లేవు. మళయాలం లూసిఫర్ రీమేక్ గా రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో సత్యదేవ్ నయనతార భార్యాభర్తలుగా నటిస్తున్నారు. సెకండ్ హాఫ్ లో వచ్చే యంగ్ లీడర్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారో ఇంకా బయటికి రాలేదు. ఆచార్య తాలూకు విషాదం అవమానం సమిసిపోయే విధంగా గాడ్ ఫాదర్ రచ్చ చేయాలని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే బజ్ పెరిగేలా టీజర్ కట్ చేయించారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద మాత్రం కొన్ని విమర్శలు వచ్చాయి. వరుణ్ గేజ్ గనిలో నేపధ్య సంగీతాన్నే దీనికి వాడుకున్నాడని నెటిజెన్లు ఆధారాలు చూపిస్తున్నారు.

అక్టోబర్ 5 విడుదల కాబోతున్నగ్ గాడ్ ఫాదర్ నేరుగా నాగార్జున ది ఘోస్ట్ తో తలపడనుంది. అదే రోజు బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం, నందిని రెడ్డి అన్నీ మంచి శకునములే షెడ్యూల్ అయ్యాయి. ఇప్పుడీ అనౌన్స్ మెంట్ తో మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. కేవలం ఏడు నెలల గ్యాప్ చిరు మూడు సినిమాలు రాబోతున్నాయి. గాడ్ ఫాదర్ తర్వాత 2023 సంక్రాంతికి వాల్తేర్ వీరయ్య, ఏప్రిల్ 14న బోళా శంకర్ ఆల్రెడీ ప్రకటించేశారు. ఇంత వేగంగా రిలీజులు మెగాస్టార్ కు గత మూడు దశాబ్దాల్లో ఎప్పుడూ జరగలేదు. గాడ్ ఫాదర్ కనక బ్లాక్ బస్టర్ అయితే ఆటోమేటిక్ గా దాని తాలూకు ప్రభావం రాబోయే వాటి మీద పాజిటివ్ గా ఉంటుంది. చూడాలి ఏం చేయనుందో