జీవితంపై ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లి, ఉన్నతస్థాయికి ఎదగాలని అనుకున్న ఓ నల్గొండ యువకుడు అమెరికాలో ఓ నల్ల జాతీయుడు జరిపిన కాల్పుల్లో మరణించాడు. నల్లగొండ పట్టణంలోని వివేకానందనగర్ కాలనీకి చెందిన నక్క సాయిచరణ్ అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే ఉద్యోగం చేస్తూ మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ సిటీలో నివసిస్తున్నాడు. తన స్నేహితుడిని ఎయిర్పోర్టులో దింపి తన కారులో తిరిగి వస్తుండగా ఇంటర్స్టేట్–95 హైవేలోని కేటన్ అవెన్యూ వద్ద ఓ నల్ల జాతీయుడు అతని కారుపై కాల్పులు […]
తెలంగాణలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అటు అధికార టిఆర్ఎస్ లోనూ..ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ లోనూ నాయకుల మధ్య అంతర్యుద్ధం జరుగుతుంది. అయితే ఇక్కడ చెప్పబోయేది స్వపక్షంలో విపక్షం గురించి కాదు..అధికార పార్టీ మంత్రికి, ప్రతిపక్ష పార్టీ ఎంపికి జరిగిన బహిరంగ యుద్ధం గురించి. వేర్వేరు పార్టీలకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు ప్రజల ముంగుటే ఆడుకున్న వాగ్వాదం గురించి… తెలంగాణలోని నల్గొండ జిల్లాలో నియంత్రిత పంటల సాగు కార్యాచరణ ప్రణాళికపై జరిగిన సదస్సు […]
కృష్ణానది పరీవాహక ప్రాంతంలో అర్థరాత్రి 2.36 నిమిషాలకు భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. సుమారు 35సెకన్లు వరకు భూమి కంపించినట్లు తెలుస్తోంది. నల్గొండ, సూర్యాపేట, కృష్ణాజిల్లా ప్రాంతాల్లో కూడా ఈ భూ ప్రకంపనలు కనిపించాయి. కోదాడ, హుజూర్నగర్ ప్రాంతంలోని చిలుకూరు, మునగాల, అనంతగిరి, నడిగూడెం సహా పలు గ్రామాల్లో భూమిలో ప్రకంపనలు వచ్చాయి. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం ముత్యాల, రావిరాలలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కృష్ణానదీ […]