Dharani
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. వారికి నేరుగా దర్శనం కల్పించనున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు..
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. వారికి నేరుగా దర్శనం కల్పించనున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ సర్కార్.. యాదగిరి గుట్ట అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. ఆలయాన్ని పునర్నిర్మించింది. ఇప్పుడు ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారాలు, పండగుల, పర్వదినాలు, సెలవుల్లో యాదాద్రి స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ కడుతున్నారు. తెలంగాణ తిరుపతిగా ప్రఖ్యాతి గాంచిన యాదాద్రిలో.. తిరుమల తరహాలోనే నియమ నిష్టలు పాటిస్తున్నారు. ఇక తాజాగా యాదాద్రి అధికారులు.. భక్తులకు శుభవార్త చెప్పారు. వారికి నేరుగా ఉచిత దర్శనం కల్పించనున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ వివరాలు..
యాదాద్రి నరసింహుడి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. దివ్యాంగులు, వృద్ధులకు నేరుగా ఉచితంగా లక్ష్మీ నరసింమ స్వామిని దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆలయ ఈవో భాస్కర్ రావు.. ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి రోజూ ఊదయం 7:30-8:30 గంటల వరకు, 10-11 గంటల వరకు, మధ్యాహ్నం 2-3, సాయంత్రం 5-6, రాత్రి 8:30-9 గంటల మధ్య కాలంలో.. మధ్య తూర్పు గోపురం నుంచి దివ్యాంగులు, వృద్ధులను నేరుగా ఆలయంలోకి అనుమతించనున్నారు.
అలానే జూన్ 1 నుంచి యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తులు కేవలం సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని.. ఈ నియమం పాటించని వారిని దర్శనానికి అనుమతించమని ఆలయ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. మగవారు ధోతి, ఆడవారు చీర, లంగా ఓణి, చుడిదార్, పంజాబీ డ్రెల్‌లు ధరించి రావాల్సి ఉంటుందని తెలిపారు. అలానే తిరుపతి తరహాలోనే కొండ మీద ప్లాస్టిక్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే.
ఇక ఆలయంలో నృసింహస్వామి వార్షిక జయంతి మహోత్సవాలు సోమవారం (మే 20) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వస్తివాచనం, సాయంత్రం అంకురార్పణ పర్వాలతో వేదపండితులు, యాజ్ఞికులు నృసింహుడి వార్షిక జయంతి మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ వేడుకల్లో యాదాద్రీశుడు తిరుమల వాసుడైన శ్రీవెంకటేశ్వరస్వామి రూపంలో ఉదయం గరుడ వాహనంపై.. రాత్రివేళ పరవాసుదేవుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ మహాముఖ మండపంలో లక్ష కుంకుమార్చన కైంకర్యాన్ని వేద, మంత్ర పఠనాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాదాద్రి ఆలయానికి అనుబంధంగా ఉన్న పాతగుట్టలోనూ స్వామి జయంతి వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.