iDreamPost
android-app
ios-app

కరువు ప్రాంతంలో సిరుల పంట.. ఒక్కసారి వేస్తే.. ఎకరాకు రూ.13లక్షల ఆదాయం

  • Published Aug 13, 2024 | 2:36 PM Updated Updated Aug 13, 2024 | 2:36 PM

Soap Nut Cultivation: తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలో ఓ రైతు చేసిన ఆలోచన అతడి ఇంట సిరులుకురిపిస్తోంది. ఆ వివరాలు..

Soap Nut Cultivation: తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతంలో ఓ రైతు చేసిన ఆలోచన అతడి ఇంట సిరులుకురిపిస్తోంది. ఆ వివరాలు..

  • Published Aug 13, 2024 | 2:36 PMUpdated Aug 13, 2024 | 2:36 PM
కరువు ప్రాంతంలో సిరుల పంట.. ఒక్కసారి వేస్తే.. ఎకరాకు రూ.13లక్షల ఆదాయం

మీకు వ్యవసాయం అంటే బాగా ఇష్టం ఉందా.. అయితే మీది మెట్ట ప్రాంతమా.. అంటే నీటి ఎద్దడి ఉన్న ప్రాంతమా. మీ ప్రాంతంలో ఎలాంటి పంటలు సాగు చేయాలో తెలిక.. అప్పుల పాలవుతున్నారా.. లేక భూమలను నిరుపయోగంగా ఉంచుతున్నారా.. అయితే మీరు ఈ రైతును కలుసుకోవాలి. కరువు ప్రాంతంలో ఆయన చేపట్టిన వినూత్న ప్రయోగం.. ఇప్పుడు వారి ఇంట సిరులు కురిపిస్తుంది. సుమారు 33 ఏళ్లుగా ఆదాయం పొందుతున్నాడు. అది కూడా ఎకరాకు 13 లక్షల రూపాయలు. మరి ఇంత భారీ ఆదాయం వచ్చే పంట ఏది.. దాని సాగు విధానం వంటి వివరాలు మీ కోసం..

ఎక్కువ పొలం ఉండి, నీటి వసతి అంతగా లేని బీడు భూముల్లో కుంకుడు తోట ద్వారా అనూహ్యమైన రీతిలో ఎకరానికి రూ. 13 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు నల్గొండ జిల్లా రైతు లోకసాని పద్మారెడ్డి. ఎకరానికి కేవలం రూ. 5 వేల పెట్టుబడితో ఆయన ఇంత భారీ ఈ ఆదాయం పొందటం విశేషం. సుమారు  33 ఏళ్ల క్రితం 12 ఎకరాల్లో 1200 కుంకుడు మొక్కలు నాటారు పద్మారెడ్డి. అప్పుడు అందరు ఆయన్నో పిచ్చివాడిలా చూశారు. కానీ ఇప్పుడు అదే కుంకుడు తోట మీద ఆయన లక్షల రూపాయల ఆదాయం ఆర్జిస్తూ.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

13 lakhs income with an investment of 5 thousand per acre

ముప్పైమూడేళ్ల క్రితం అనగా.. 1991లో పద్మారెడ్డి నీటి వసతి లేని తమ 12 ఎకరాల పొలంలో 1200 కుంకుడు మొక్కలు నాటించారు. వీటి సాగుకు పెద్దగా నీటి అవసరం లేదు. అందుకే పద్మారెడ్డి ఈ ఆలోచన చేశారు. ఆ చెట్లు పెరిగి నేడు ఆయనకు భారీ ఎత్తున దిగుబదడి ఇస్తున్నాయి. వీటిిని ఒక్కసారి నాటి.. మూడు, నాలుగు సంవత్సరాలు వాటిని కాపాడుకుంటే చాలు.. రైతుకు ఊహించనంత ఆదాయం వస్తుందని పద్మారెడ్డి చెబుతున్నారు పెద్ద కమతాలు ఉండి, సీజనల్‌ పంటలు సాగు చేసుకోలేక బీడు పెడుతున్న రైతులు కుంకుడు తోటలను సులువుగా పెంచి, అధికాదాయం పొందవచ్చని పద్మారెడ్డి సూచిస్తున్నారు.

20×20 దూరంలో నాటాలి..

కుంకుడు సాగులో పద్మారెడ్డి 33 ఏళ్ల అనుభవం గడించారు. సాగు గురించి ఆయన మాట్లాడుతూ.. 20″20 అడుగుల దూరంలో కుంకుడు మొక్కలు నాటుకోవాలి. డ్రిప్‌తో నీటిని అందిస్తే సరిపోతుంది అంటున్నారు. అంతేకాక కుంకుడు చెట్ల మధ్య తొలి మూడేళ్లు బొప్పాయి, మునగ, జామ వంటి పంటలు వేసుకుంటే రైతుకు అదనపు ఆదాయం వస్తుంది అంటున్నారు. పంట వేసిన నాలుగో ఏట నుంచి 20-30 కిలోల కాపు ప్రారంభమవుతుందన్నారు. ఐదేళ్ల తర్వాత పూత దశలో నీరు ఇస్తే చాలు. మంచి దిగుబడి వస్తుందని తెలిపారు పద్మా రెడ్డి.

ఇక నవంబర్‌-డిసెంబర్‌లో కుంకుడు పూత వస్తుంది. ఏప్రిల్‌లో కాయలు కోతకు వస్తాయి. కుంకుడు చెట్టు కాపు సీజన్‌ పూర్తయ్యాక ఆకు రాల్చి నిద్రావస్థలోకి వెళ్తుంది. ఎండిన మానులా ఉండే చెట్టు మేలో చిగురిస్తుంది. ఒక్కో చెట్టుకు 20-25 కిలోల రాలుతాయి. ఆకులన్నీ చెట్టు మొదట్లోనే కుళ్లి సేంద్రియ ఎరువుగా పోషకాలను అందిస్తాయి. వీటిని ఒక్కసారి నాటితే సుమారు 200 సంవత్సరాల వరకు ఈ చెట్లకు ఢోకా ఉండదు. ఎండుకాయలు కిలో రూ. 130కి ఇస్తున్నాయి అని చెప్పారు. నాణ్యమైన పొడికి మరింత డిమాండ్ ఉందన్నారు పద్మారెడ్డి.