iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్ మాజీ ఎంపీ తుమ్మల దామోదర్ రెడ్డి కన్నుమూత!

  • Published May 14, 2024 | 12:47 PM Updated Updated May 14, 2024 | 5:56 PM

Ex MP Thummala Damodar Reddy: ఈ మధ్య కాలంలో రాజకీయ నేతలు, సినీ పరిశ్రమకు చెందిన వారు వరుసగా చనిపోతున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు, కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

Ex MP Thummala Damodar Reddy: ఈ మధ్య కాలంలో రాజకీయ నేతలు, సినీ పరిశ్రమకు చెందిన వారు వరుసగా చనిపోతున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు, కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

కాంగ్రెస్ మాజీ ఎంపీ తుమ్మల దామోదర్ రెడ్డి కన్నుమూత!

ఇటీవల రాజకీయ, సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వయోభారం, రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య సమస్యల ఇలా ఎన్నో కారణాల వల్ల సెలబ్రెటీలు, రాజకీయ నేతలు కన్నుమూస్తున్నారు. దీంతో వారి అభిమానులు, కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి వరకు ఎన్నికల హడావుడి నడిచింది. రాజకీయాల్లో ఉంటూ పేద ప్రజల కోసం తమ వంతు కృషి చేసిన నేతలను ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారు.. వారిని గుండెల్లో దాచుకుంటారు. అలాంటి నేతలు కానరాని లోకాలకు వెళ్తే శోక సంద్రంలో మునిగిపోతారు. తాజాగా నల్లగొండ కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

నల్లగొండ మాజీ ఎంపీ తుమ్మల దామోదర్ రెడ్డి (85) సోమవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. దామోదర్ రెడ్డికి భార్య సులోచన, కొడుకు సభాష్ చంద్రారెడ్డి, కూతరు ఝాన్సీ లక్ష్మి ఉన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక దామోదర్ రెడ్డి విషయానికి వస్తే.. నల్లగొండ జిల్లా పీఏపల్లికి మండలం అజ్మాపురానికి చెందిన దామోదర్ రెడ్డి 1980 లో నల్లగొండ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి గెలిచారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ప్రజలకు చేసిన సేవలకు మంచి గుర్తింపు సంపాదించారు.

దేవరకొండ ప్రాంతంలోని గిరిజనుల సమస్యలపై పార్లమెంట్ లో ప్రస్తావించి వాటికి పరిష్కారానికి కృషి చేశారు. మాజీ సీఎం లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, నేరుమల్లి జనార్థన్ రెడ్డి, చకిలం శ్రీనివాసరావులకు ఆయన మంచి సన్నిహితులు.  ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తీర్చేందుకు కృషి చేసేవారు. నల్లగొండలో ఎంతోమంది కాంగ్రెస్ నేతలకు ఆయన ఆదర్శంగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గా దామోదర్ రెడ్డి కొత్తగా వచ్చిన నేతలకు ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచేవారు.  దామోదర్ రెడ్డి మృతిపై మంత్రులు ఉత్తమ్ కుమారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే బాలు నాయక్ తదితరులు సంతాపం తెలిపారు. ఇంత గొప్ప నాయకుడిని కోల్పోయినందుకు కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.