iDreamPost
android-app
ios-app

అద్భుతం సృష్టించిన 9 ఏళ్ల బాలుడు.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు!

Manu Sriram Created World Wide Book of Records: కొందరు పిల్లలు అసాధారణ ప్రతిభతో అందరిని ఔరా అనిపిస్తారు. అలానే తెలంగాణకు చెందిన ఆ బాలుడు తనదైన ప్రతిభతో అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

Manu Sriram Created World Wide Book of Records: కొందరు పిల్లలు అసాధారణ ప్రతిభతో అందరిని ఔరా అనిపిస్తారు. అలానే తెలంగాణకు చెందిన ఆ బాలుడు తనదైన ప్రతిభతో అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

అద్భుతం సృష్టించిన 9 ఏళ్ల బాలుడు.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు!

టాలెంట్.. వినడానికి మూడు అక్షరాల పదమే. కానీ…ఇది మనిషిని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లుంది. సమాజంలో మంచి గుర్తింపును అందించడంలో ఈ టాలెంట్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిభ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ..కొందరిలో మాత్రం దానిస్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతో మంది పిల్లలు అతిపిన్నవయస్సులో అద్భుతాలు సృష్టించడమే అందుకు నిదర్శనం. రెండేళ్ల నుంచి మొదలకుని పదేళ్ల వరకు ఉండే కొందరు పిల్లలు తమ అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. అంతేకాక వరల్డ్ రికార్డు, గిన్నిస్ రికార్డు వంటి వివిద వాటిల్లో స్థానం దక్కించుకుంటున్నారు. ఇక ఇలాంటి ప్రతిభవంతుల జాబితాలోకి ఓ తొమ్మిదేళ్ల బాలుడు చేరాడు. తన అద్భుతమైన టాలెంట్ తో ఔరా అనిపించాడు. అతడి ప్రతిభకు వరల్డ్ వైడ్ బుక్ లో స్థానం సంపాదించాడు. మరి..ఆ టాలెంట్ బాలుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన రాపర్తి మను శ్రీరామ్ అనే తొమ్మిదేళ్ల బాలుడు తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం ఆ బాలుడు నాలుగో తరగతి చదువుతున్నాడు. అతడి తండ్రి వైద్య వృతిలో ఉన్నాడు. మను శ్రీరామ్ తల్లి గృహిణి. ఈ బాలుడు చదువులో ఎప్పుడు ముందుండే వాడు. ఏ విషయాన్ని అయినా చాలా త్వరగా గ్రహించే వాడు. తాజాగా అతడి అద్భుతమైన టాలెంట్ కు వరల్డ్ వైడ్ బుక్ లో స్థానం సంపాదించాడు. రాష్ట్రాలు, వాటి రాజధానుల పేర్లను కేవలం 15.8 సెకన్లలో చెప్పాడు. దీంతో మను శ్రీరామ్ వరల్డ్ వైడ్ బుక్ రికార్డును క్రియేట్ చేశాడు.  ఇతకు ముందు ఈ స్థానంలో ఓ అమ్మాయి ఉండేది. ఆ పాప 19 సెకన్లలో లోనే రాష్ట్రాలు,రాజధానుల పేర్లను చెప్పింది. తాజాగా మను శ్రీరామ్ ఆ అమ్మాయి రికార్డును బద్దలు కొట్టి..తాను మరో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. మను శ్రీరామ్ కు వరల్డ్ వైడ్ బుక్ సంస్థ ప్రతినిధులు సర్టిఫికేట్ ను అందజేశారు.

ఇక తాను సాధించిన రికార్డుపై మను శ్రీరామ్ సంతోషం వ్యక్తం చేశాడు. తాను రాష్ట్రాలు, రాజధానులతో పాటు అనేక ఇతర అంశాల గురించి కూడా చెప్పగలను అని తెలిపాడు. రాష్ట్రాలు..వాటి ముఖ్యమంత్రులు, దేశాలు వాటి రాజధానులు, రామాయణం, మహాభారతం, దేశాలు, వాటి జెండాలు వంటి అనేక అంశాల గురించి కూడా చెప్తానని మను శ్రీరామ్ తెలిపాడు. ఇక తమ అబ్బాయి జ్ఞాపక శక్తి చూసి.. మనుశ్రీరామ్ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. చిన్నతనం నుంచి తమ కుమారుడి టాలెంట్ ను గుర్తించి ప్రోత్సహిస్తున్నామని వారు చెబుతున్నారు. విద్యతోనే విజ్ఞానం సాధ్యమౌతుందని  అందుకే తమ కుమారుడికి అన్ని విషయాలపైనా అవగాహన కల్పిస్తున్నామిని తెలిపారు.

భవిష్యత్తులో తమ కుమారుడు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, గొప్ప వ్యక్తిగా ఎదగాలని ఆక్షాంక్షించారు. గతంలో మూడేళ్ల బాలుడు రామయణంలోని శ్లోకాలు చదివి అబ్బురపరిచాడు. ఇలానే హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అక్రీత్ ప్రాణ్ జస్వాల్.. 7 ఏళ్ల వయస్సులో శస్త్రచికిత్స చేసాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన సర్జన్‌గా కూడా పేరు పొందాడు. ఇలా ఎంతో మంది చిన్నారులు తమ అద్భుతమైన ప్రతిభతో  రికార్డులు క్రియేటే చేస్తున్నారు. ఇలా ఎంతో మంది పిల్లలో విశేషమైన ప్రతిభ ఉంటుంది. దానిని తల్లిదండ్రులు, టీచర్లు గుర్తించి..ప్రోత్సహిస్తేనే వెలుగులోకి వస్తుంది. మరి..మను శ్రీరామ్ అద్భుత ప్రతిభపై అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.