iDreamPost
android-app
ios-app

చదువు మధ్యలో ఆపించేసి పెళ్లి చేశారు! ఆమెకి కోపం వచ్చి ఏమి చేసిందంటే?

నవ వధువు పెళ్లైన కొన్ని రోెజులకే షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆ ఒక్క కారణంతో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. పెళ్లి జరిగి నెల గడవక ముందే ప్రాణాలు కోల్పోయింది.

నవ వధువు పెళ్లైన కొన్ని రోెజులకే షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆ ఒక్క కారణంతో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. పెళ్లి జరిగి నెల గడవక ముందే ప్రాణాలు కోల్పోయింది.

చదువు మధ్యలో ఆపించేసి పెళ్లి చేశారు! ఆమెకి కోపం వచ్చి  ఏమి చేసిందంటే?

ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకే షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. ఇదేవిధంగా ఓ నవ వధువు పెళ్లైన కొన్ని రోజులకే కఠిన నిర్ణయం తీసుకుంది. ఆమె జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఉన్నత స్థాయిలో స్థిరపడాలనుకుంది. కానీ ఆమె తల్లిదండ్రుల నిర్ణయం వల్ల ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది ఆ నవ వధువు. పెళ్లి జరిగి నెల కూడా కాలేదు. కాళ్ల పారాణి ఆరలేదు కానీ ఆ కారణంతో బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన జ్ఞాపకం. ఎన్నో ఆశలతో వివాహబంధంలోకి అడుగుపెడుతుంటారు. నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటుంటారు. కానీ ఆ నవ వధువుకు మాత్రం పెళ్లి ఆమె పాలిట శాపంగా మారింది. ఆమెకు చదువు అంటే ఎంతో ఇష్టం. ఉన్నత చదువులు చదవాలని కలలుగన్నది. తాను చదువుకుంటానని తల్లిదండ్రులకు చెప్పింది. కానీ వారు ఇదేమీ పట్టించుకోకుండా వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్‌ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలైన శ్రీను, పద్మ దంపతుల కుమార్తె దేవకి (23).

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవకి ఇటీవల బీఎస్సీ పూర్తిచేసింది. ఆ తర్వాత పై చదువులు చదువుకుంటానని తల్లికి చెప్పింది. అయితే తల్లి.. తనకు ఆరోగ్యం బాగుండటంలేదని కుమార్తెకు నచ్చజెప్పి వివాహానికి ఒప్పించారు. వెంటనే దుబ్బతండా గ్రామానికి చెందిన యువకుడితో గతనెల 28న వివాహం జరిగింది. చదువు తప్పా వేరే ద్యాస లేని దేవకి పెళ్లి వద్దని వారించినా కుటుంబ సభ్యులు వినకపోవడంతో మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలో పెళ్లి తర్వాత పదహారు రోజుల పండగకు పుట్టింటికి వచ్చిన దేవకి ఈ నెల 14న రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా పురుగుల మందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కొత్తగూడెం ఆసుపత్రికి, అనంతరం ఖమ్మం వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. పెళ్లి జరిగి నెల కూడా గడవక ముందే నవ వధువు బలవన్మరణానికి పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.