మొన్న శుక్రవారం విడుదలైన మణిరత్నం విజువల్ గ్రాండియర్ పొన్నియన్ సెల్వన్ 1 తమిళ వెర్షన్ దూసుకుపోతోంది. కేవలం మూడే రోజుల్లో 200 కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరడంతో అభిమానుల ఆనందం మాములుగా లేదు. ఆ స్థాయిలో మిగిలిన భాషల్లో దూకుడు లేనప్పటికీ అక్కడా డీసెంట్ రన్ తో పరుగులు పెడుతోంది. ముఖ్యంగా తెలుగులో అతి తక్కువ ధరకు ఇవ్వడం కలిసి వస్తోంది. కేవలం 10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో బరిలో దిగడంతో ఆల్రెడీ వచ్చేసిన 7 […]
మణిరత్నం పొన్నియన్ సెల్వన్ లో ఆదిత్య కరికాలన్గా చియాన్ విక్రమ్ చెలరేగిపోపోయాడు. ఈ టీజర్ ఒకనాటి చరిత్రను కళ్లముందుగా చాలా గొప్పగా తీసుకొచ్చింది. 55 ఏళ్ల క్రితం కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా మణిరత్నం సినిమా తెరకెక్కుతోంది. వీరుడైన చోళ యువరాజు ఆదిత్య కరికాలన్ని ఎవరు చంపారు? ఈ సినిమాలో అదే సస్పెన్స్. అతను సింహాసనానికి వారసుడు. ఇందులో కీలకమైన నందిని పాత్రను ఐశ్వర్య రాయ్ బచ్చన్ పోషించింది. ఇదేమీ హీరోయిన్ పాత్రకాదు. అంతఃపురం వ్యూహాలు, […]
సాధారణంగా ఒక దర్శకుడికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ సింక్ అవ్వడం ప్రతి బాషా పరిశ్రమలోనూ చూస్తుంటాం. కాకపోతే అవి కేవలం కొన్ని హిట్లకే పరిమితం కావడం గమనించవచ్చు. అలా కాకుండా దశాబ్దం పైగా ఒక జంట ఇండియన్ సినిమా ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప క్లాసిక్స్ ఇవ్వడం అందులోనూ ఆ ఇద్దరి పుట్టినరోజు ఒకే తేదికి రావడం కన్నా మ్యూజిక్ లవర్స్ కు పండగ ఏముంటుంది. వాళ్ళే ది గ్రేట్ మణిరత్నం-ఇళయరాజా. ఈ కాంబినేషన్ లో 10 సినిమాలు […]
మణిరత్నం దర్శకత్వంలో కోలీవుడ్ బాహుబలిగా చెప్పుకుంటున్న పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 30న విడుదల కాబోతున్న ఈ విజువల్ గ్రాండియర్ మీద అక్కడ అంచనాలు మాములుగా లేవు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు అదే టైటిల్ పెడతారా లేక మారుస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇంకా ఇక్కడ హక్కుల కొనుగోలు జరగలేదు. విక్రమ్ టైటిల్ రోల్ పోషిస్తుండగా కార్తీ, జయం రవి, త్రిష, జయరాం, ఐశ్వర్య రాజేష్ […]
ఇండియన్ సెల్యులాయిడ్ ని తీవ్రంగా ప్రభావితం చేసిన దర్శకుల జాబితాలో ఖచ్చితంగా ఉండే పేరు మణిరత్నం. కెరీర్ ప్రారంభంలో తడబడినా మౌనరాగం, ఘర్షణ, నాయకుడు, గీతాంజలి, అంజలి, దళపతి లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ని ఇచ్చి వాటిని అప్ కమింగ్ డైరెక్టర్స్ కు రిఫరెన్స్ బుక్స్ లా మార్చిన ఘనత ఆయనది. తన శైలికి భిన్నంగా చేసిన ప్రయోగాలు కొన్ని లేకపోలేదు. 1992లో రోజా అద్భుత విజయం సాధించాక తన మీద విపరీతంగా పెరిగిపోయిన అంచనాలకు […]
ఒకే తరహా సాంప్రదాయ పద్ధతిలో ఇంకా చెప్పాలంటే మూసలో సాగుతున్న సినిమా సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఇళయరాజా బెస్ట్ సాంగ్స్ ని ఎంచుకోమనే పరీక్ష పెడితే ఒక్క రోజులో దాన్ని పూర్తి చేయడం అసాధ్యం. అంత స్థాయిలో అన్నేసి గొప్ప పాటలు ఇచ్చారు కాబట్టే జనరేషన్ తో సంబంధం లేకుండా ప్రతిఒక్కరు ఆయన గీతాలను ఇష్టపడతారు ప్రేమిస్తారు. అలాంటి రాజాను ప్రత్యక్షంగా అందులోనూ స్వయంగా కంపోజ్ చేసిన పాటలను లైవ్ చూసే ఛాన్స్ మాత్రం ప్రతిసారి […]
గౌతమ్ వాసుదేవ మీనన్. సౌత్ సినిమా ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. తీసుకునే కథలు చిన్నవే అయినా తనదైన శైలిలో డిఫరెంట్ ట్రీట్మెంట్ తో మెప్పించేలా తీయడం ఈయన స్టైల్. అందుకే మొదటి సినిమా మిన్నాలే(తెలుగు చెలి)మొదలుకుని మొన్నటి తూటా దాకా దీన్ని గమనించవచ్చు. సాధారణంగా ఒక ఫార్ములా ప్రకారం వెళ్లిపోయే కమర్షియల్ సినిమాకు కొత్త గ్రామర్ ను నేర్పించిన దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం తర్వాత గౌతమ్ మీనన్ పేరే చెప్పొచ్చు. సూర్యతో 2003లో […]
న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా వి షూటింగ్ పూర్తి చేసుకుని మార్చ్ 25 విడుదలకు రెడీ అవుతోంది. దీని తర్వాత నాని టక్ జగదీశ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. తనకు నిన్ను కోరి లాంటి ఫీల్ గుడ్ మ్యూజికల్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందబోయే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో మొదలుకానుంది. అయితే దీనికి సంబంధించిన ఆసక్తి కరమైన లీక్ ఒకటి ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. […]
దర్శకుడు ఎవరైనా తన ఆలోచనలను తెరమీద అనుకున్నట్టుగా ఆవిష్కరించాలంటే అందులో ఛాయాగ్రాహకుడి పాత్ర చాలా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య కుదిరే బాండింగ్ ని బట్టే సినిమా అవుట్ ఫుట్ ఆధారపడి ఉంటుంది . అందుకే కెమెరా పట్టుకున్న ప్రతి ఒక్కరు గుర్తింపు తెచ్చుకోలేరు. ప్రేక్షకుల మనసును అందరూ గెలుచుకోలేరు. తన కన్నుతో చూసేవాళ్లకు ఓ అద్భుత ప్రపంచాన్ని చూపించే వాళ్ళు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన ప్రతిభావంతులు పిసి శ్రీరామ్. గత 40 ఏళ్లుగా అవిశ్రాంతంగా […]