iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్ కి పూనకాలే.. కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ నుంచి క్రేజీ న్యూస్..!

  • Published Mar 18, 2024 | 10:01 PM Updated Updated Mar 18, 2024 | 10:06 PM

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల విక్రమ్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఆయన తదుపరి సినిమాలపై భారీ అంచనాలు పెరిగాయి.

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల విక్రమ్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఆయన తదుపరి సినిమాలపై భారీ అంచనాలు పెరిగాయి.

  • Published Mar 18, 2024 | 10:01 PMUpdated Mar 18, 2024 | 10:06 PM
ఫ్యాన్స్ కి పూనకాలే..  కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ నుంచి క్రేజీ న్యూస్..!

ఒకప్పుడు ఇండస్ట్రీలో కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయేవారు. వీరిద్దరి కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఇండస్ట్రీలో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రయోగాత్మక పాత్రలు ఇప్పటి వరకు ఎవరూ చేయలేదంటే అదిశయోక్తి లేదు. 65 ఏళ్లు దాటినా ఇప్పటికే కుర్ర హీరోలతో పోటీ పడుతూ తన క్రేజ్ చాటుకుంటున్నారు. ఓ వైపు తమిళ బిగ్ బాస్ హూస్ట్ గా వ్యవహరిస్తూనే సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న థగ్ లైఫ్ నుంచి క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

సినీ ఇండస్ట్రీలో విశ్వనటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఇటీవల విక్రమ్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం ఆయన కెరీర్ లో దిబెస్ట్ మూవీగా నిలిచింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దిగ్గజ దర్శకులు మణిరత్నంతో కలిసి కమల్ హాసన్ ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ఒకప్పుడు వీరిద్దరి కాంబినేషన్ సినిమా అంటే అది బ్లాక్ బస్టర్ మూవీ అన్నట్లే. చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కబోతుంది. ఈ మూవీ పేరు ‘థగ్ లైఫ్’ అని   పెట్టారు. కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్బంగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ చేశారు. కమల్ కెరీర్ లో 234 వ చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ చిత్రంలై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

ఈ మూవీలో కమల్ హాసన్ రంగరాయ శక్తవేల్ నాయకర్ అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల అనౌన్స్ చేసిన గ్లింప్స్ లో కమల్ హాసన్ డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ మూవీలో కమల్ హాసన్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారని వార్తల సారాంశం. ఈ మూడు పాత్రలను లింక్ చేస్తూ దర్శకులు మణిరత్నం అద్భుతంగా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో మాలీవుడ్ హీరో దుల్కన్ సల్మాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. తమిళ హీరో జయం రవి మరో కీలక పాత్రలో నటించారు.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş