iDreamPost
android-app
ios-app

బొంబాయి మూవీలో హమ్మ హమ్మ సాంగ్‌లో ఉన్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

మణిరత్నం ది బెస్ట్ చిత్రాల్లో ఒకటి బొంబాయి. 1995లో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమానే కాదు పాటలు సూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్. ఇందులో హమ్మ హమ్మ సాంగ్ వేరే లెవల్. ఈ పాటలో ముసుగు ధరించిన యాక్టర్ ఎవరో తెలుసా..?

మణిరత్నం ది బెస్ట్ చిత్రాల్లో ఒకటి బొంబాయి. 1995లో వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమానే కాదు పాటలు సూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్. ఇందులో హమ్మ హమ్మ సాంగ్ వేరే లెవల్. ఈ పాటలో ముసుగు ధరించిన యాక్టర్ ఎవరో తెలుసా..?

బొంబాయి మూవీలో హమ్మ హమ్మ సాంగ్‌లో ఉన్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు మణిరత్నం. ఆయన దర్శకత్వంలో నటించాలంటే ఓ వరంగా భావిస్తుంటారు నటీనటులు. తెలుగులో నాగార్జునకు మాత్రమే ఆ అదృష్టం దక్కింది. ఎంతో మంది దర్శకులకు మార్గదర్శకుడు. పల్లవి, అను పల్లవి నుండి నేటి పొన్నియన్ సెల్వన్ చిత్రాల వరకు సెల్యూలయిడ్ మీద ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీశాడు. వాటిల్లో ఒకటి బొంబాయి. 1995లో వచ్చిన ఈ సినిమా కాంట్రవర్సీలో ఇరుక్కుంది. ఇందులో హీరో హీరోయిన్లది (అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా) వేర్వేరు మతాలు కావడంతో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఈ మూవీ కమర్షియల్‌గా సక్సెస్ అందుకుంది. ఇది 1996లో ఫిలడెల్ఫియా ఫిల్మ్ ఫెస్టివల్‌తో సహా అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శితమైంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.

రెహమాన్‌కి వరుసగా నాలుగవ ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు (తమిళం) సంపాదించిపెట్టింది. బొంబాయి పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్. ఇక ఇందులో ‘ఉరికే చిలుకా వేచి ఉంటాను కడవరకు’, ‘కన్నానులే కలయికలు’‘కుచ్చి కుచ్చి కూనమ్మా’‘మతమేలా.. గతమేలా’, ‘హమ్మ హమ్మ’ సాంగ్స్ ఇప్పటికీ చార్ట్ బస్టర్సే. అయితే ఈ మూవీలో హమ్మ హమ్మ సాంగ్స్‌లో సైడ్ ట్రాక్ కింద ఇద్దరు డ్యాన్సర్స్ కనిపిస్తారు. అందులో మేల్ డ్యాన్సర్ మరెవరో కాదు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్స్ ప్రభుదేవా, రాజు సుందరం బ్రదర్ నాగేంద్ర ప్రసాద్. ఇందులో ముసుగు వేసుకుని ఓ అమ్మాయి కనిపిస్తుంది.. కనిపించి, కనిపించని విధంగా ఫోకస్ అయిన ఆ నటి ఎవరో తెలుసా..? మన సోనాలి బింద్రే. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది ఈమెనే.

Bombay Movie, Hamma Hamma Song heroine 1

ఈ బాలీవుడ్ యాక్టర్ తమిళంలో ఈ పాటతోనే ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రేమికుల రోజు.. మరో మూవీ చేసింది. ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. ఆమె తమిళంలో కన్నా తెలుగులోనే ఎక్కువ చిత్రాలు చేసింది. అందులోనూ స్టార్ హీరోలతో నటించడం విశేషం. మహేష్ బాబు మురారి, చిరంజీవితో ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్, శ్రీకాంత్ తో ఖడ్గం, నాగార్జునతో మన్మధుడు, బాలకృష్ణతో పల్నాటి బ్రహ్మనాయుడు చిత్రాల్లో యాక్ట్ చేసింది. శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత ఆమె తెలుగు తెర నుండి క్విట్ అయ్యింది. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ.. హందీ బుల్లితెరపై సందడి చేస్తుంది. ఇటీవల క్యాన్సర్ బారిన పడి కోలుకున్న బ్యూటీ.. ప్రస్తుతం టెలివిజన్ షోలతో బిజీగా మారిపోయింది. ఇటీవల మురారి రీ రిలీజ్ సందర్భంగా వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ పై ఆనందాన్ని వ్యక్తం చేసింది ఈ బ్యూటీ.