iDreamPost
android-app
ios-app

గూస్ బంప్స్ తెప్పిస్తున్న కమల్ ‘థగ్ లైఫ్’ గ్లింప్స్.. ఇవి గమనించారా!

  • Published Nov 06, 2023 | 8:52 PM Updated Updated Nov 06, 2023 | 8:52 PM

కమల్ హాసన్ తన కొత్త సినిమా థగ్ లైఫ్‌ని ప్రకటించారు. చాలా బోల్డ్‌గా తన సినిమాను ప్రకటించాడు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో 'థగ్ లైఫ్' తెరకెక్కుతోంది. 2.55 సెకన్ల నిడివి గల వీడియోను షేర్ చేస్తూ టైటిల్ ను రివీల్ చేశారు.

కమల్ హాసన్ తన కొత్త సినిమా థగ్ లైఫ్‌ని ప్రకటించారు. చాలా బోల్డ్‌గా తన సినిమాను ప్రకటించాడు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో 'థగ్ లైఫ్' తెరకెక్కుతోంది. 2.55 సెకన్ల నిడివి గల వీడియోను షేర్ చేస్తూ టైటిల్ ను రివీల్ చేశారు.

  • Published Nov 06, 2023 | 8:52 PMUpdated Nov 06, 2023 | 8:52 PM
గూస్ బంప్స్ తెప్పిస్తున్న కమల్ ‘థగ్ లైఫ్’ గ్లింప్స్.. ఇవి గమనించారా!

కమల్ హాసన్ నట విశ్వరూపం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ యూనివర్సల్ హీరోగా ఎదిగారు. రొటీన్ కు భిన్నంగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ తనకు తానే సాటిగా నిరూపించుకున్నాడు ఈ లోక నాయకుడు. ఇటీవల విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కమల్ హాసన్ వరుస సినిమాలతో బిజీ అయ్యారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్సంలో ఇండియన్ 2 మూవీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. ఇక తన దూకుడును మరింత పెంచి ప్రస్తుతం లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన టైటిల్ ను ప్రకటించారు చిత్ర యూనిట్.

కమల్ హాసన్ తన కొత్త సినిమా థగ్ లైఫ్‌ని ప్రకటించారు. చాలా బోల్డ్‌గా తన సినిమాను ప్రకటించాడు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ తెరకెక్కుతోంది. 2.55 సెకన్ల నిడివి గల వీడియోను షేర్ చేస్తూ టైటిల్ ను రివీల్ చేశారు. వీడియోలో, కమల్ హాసన్ అద్భుతమైన శైలిలో యాక్షన్ చేస్తూ కనిపించారు. అతని యాక్షన్ చూసి అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరగుతోంది. సినీ వర్గాల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 68 ఏళ్ల వయసులో కమల్ హాసన్ యాక్షన్ చూస్తుంటే 57 ఏళ్ల సల్మాన్ ఖాన్ యాక్షన్ మర్చిపోతారన్నట్లుగా ఉంది. కమల్ హాసన్ అట్టిట్యూడ్ తగ్గట్లుగానే టైటిల్ ఉందంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కమల్, మణిరత్నం కాంబోలో వస్తున్న సినిమాకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. రేపు కమల్ హాసన్ తన బర్త్ డే. ఈ సందర్భంగా క్రేజీ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్.

తాజాగా టైటిల్ అనౌన్స్‌ మెంట్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ మేవీకి ‘థగ్ లైఫ్’ అని పేరు పెట్టారు. ఈ చిత్రంలో రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే గ్యాంగ్‍స్టర్ కమల్ కనిపించబోతున్నారు. ఈ వీడియోలో నెరిసిన జుట్టు, మీసాలు ఉన్న వ్యక్తిగా మారువేషంలో “నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. పుట్టినప్పుడే శక్తివేల్ నాయకర్ నుదిటిపై క్రిమినల్, గూండా, యాకూజా అని రాసినట్టు ఉన్నారు” అంటూ మొదలు పెడతారు. కొందరు రౌడీలు కమల్ పై దాడి చేసేందుకు దూసుకొస్తుండగా, వారందరినీ కమల్ అంతమొందిస్తాడు. ఈ వీడియోలోని యాక్షన్ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కథ గురించి రివీల్ చేయకపోయినా సినిమాలో కమల్ పాత్ర గురించి కొన్ని ముఖ్యమైన క్లూస్ ఇచ్చారు మేకర్స్. ఆయన క్యారెక్టర్ పేరు రంగరాయ సత్తివేల్ నాయకన్. చివరి పదం చూడగానే నాయకుడు గుర్తొచ్చేలా సెట్ చేసిన తీరు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş