iDreamPost
android-app
ios-app

టక్ జగదీష్ కి ఆ సూపర్ హిట్ స్ఫూర్తా ?

  • Published Jan 29, 2020 | 7:42 AM Updated Updated Jan 29, 2020 | 7:42 AM
  • Published Jan 29, 2020 | 7:42 AMUpdated Jan 29, 2020 | 7:42 AM
టక్ జగదీష్ కి ఆ సూపర్ హిట్ స్ఫూర్తా ?

న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా వి షూటింగ్ పూర్తి చేసుకుని మార్చ్ 25 విడుదలకు రెడీ అవుతోంది. దీని తర్వాత నాని టక్ జగదీశ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. తనకు నిన్ను కోరి లాంటి ఫీల్ గుడ్ మ్యూజికల్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందబోయే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో మొదలుకానుంది. అయితే దీనికి సంబంధించిన ఆసక్తి కరమైన లీక్ ఒకటి ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

దాని ప్రకారం ఇది 1992లో వచ్చిన సూపర్ హిట్ మూవీ బలరామకృష్ణులు ఛాయల్లో సాగుతుందని చెబుతున్నారు. కాకపోతే అది పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగితే ఇది మాడరన్ స్టైల్ లో సిటీలో ఉంటుందన్న మాట . కామన్ పాయింట్ ఏంటంటే రెండు ప్రధాన పాత్రల మధ్య ఉన్న శత్రుత్వం. బలరామకృష్ణులులో రాజశేఖర్, శోభన్ బాబు అన్నదమ్ములు అయినప్పటికి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. చిలికి చిలికి గాలివానగా మారి కుటుంబ సభ్యుల ప్రాణల మీదకు వస్తుంది. తర్వాత ఇద్దరు కలిసిపోయి విలన్ ని అంతమొందించడం క్లైమాక్స్

టక్ జగదీశ్ లో కూడా అదే తరహాలో నాని, జగపతిబాబుల మధ్య క్లాష్ ఉంటుందట. కాకపోతే అది అన్నదమ్ములుగానా లేక తండ్రికొడుకులుగానా అనే క్లారిటీ అయితే లేదు. శివ నిర్వాణ పాత కథలను తీసుకుని తనదైన శైలిలో ట్రీట్మెంట్ ఇవ్వడం మొదటి రెండు సినిమాల్లోనూ జరిగింది. నిన్ను కోరి హిందీ బ్లాక్ బస్టర్ హం దిల్ దే చుకే సనమ్ లా సాగితే మజిలీ మణిరత్నం మౌనరాగం స్టైల్ లో ఉంటుంది. ఇప్పుడీ టక్ జగదీశ్ కూడా అలాగే స్ఫూర్తి తీసుకున్నదే అని ఫిలిం నగర్ టాక్. ఇది నిజమో కాదో కానీ ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే బలరామకృష్ణులులో కూడా జగపతిబాబు ఓ కీలక పాత్ర చేశాడు. ఇప్పుడు ఇందులో కూడా కీలక పాత్ర అంటే విశేషమేగా

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio