iDreamPost
android-app
ios-app

నాగార్జున క్లాసిక్ మూవీ గీతాంజలి హీరోయిన్ ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలుసా..?

ది లెజండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఏకైక తెలుగు మూవీ గీతాంజలి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ మూవీ క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. ఇందులో నటించిన హీరోయిన్...

ది లెజండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఏకైక తెలుగు మూవీ గీతాంజలి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ మూవీ క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. ఇందులో నటించిన హీరోయిన్...

నాగార్జున క్లాసిక్ మూవీ గీతాంజలి హీరోయిన్ ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలుసా..?

సినీ ఇండస్ట్రీ దిగ్గజ దర్శకుల జాబితా తీస్తే.. తొలి పది స్థానాల్లో కచ్చితంగా ఉండే పేరు మణి రత్నం. ఇప్పటి తరం దర్శకులకు ఆయనొక స్ఫూర్తి ప్రదాత. ఈ లెజండరీ తీసిన సినిమాలు చూసి ఎంతో మంది యువకులు ఇండస్ట్రీలోకి వచ్చి డైరెక్టర్లుగా మారారు. కేవలం దర్శకులే కాదు.. ఆయన వర్కింగ్ స్టైల్‌కు హీరోలు సైతం ఫిదా అయిపోయి మణి రత్నం మూవీల్లో ఒక్క సినిమాలో అయినా నటించాలని ఆశ పడుతుంటారు. ఇండియన్ ఇండస్ట్రీలో ఆయన తెరకెక్కించిన చిత్రాలు క్లాసికల్ మూవీస్‌గా నిలిచిపోతుంటాయి. ప్రేమ కథలు, టెర్రరిజమ్, చరిత్ర.. ఏ కేటగిరి సినిమాలు తీసినా.. ఓ కళా ఖండంగా తీర్చిదిద్దుతారు. దక్షిణాది ఇండస్ట్రీల్లోని అన్ని భాషల్లో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఇక హిందీ పరిశ్రమకు కూడా ఎనలేని హిట్స్ అందించాడు.

మణి రత్నం సినిమాలో లొకేషన్స్, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక ఈ వర్సటైల్ డైరెక్టర్ తెలుగులో ఒకే ఒక్క సినిమా తీశాడన్న సంగతి తెలిసిందే. అదే గీతాంజలి. కింగ్ నాగార్జున హీరోగా, గిరిజ సెట్టార్ హీరో హీరోయిన్లుగా నటించిన ట్రాజెడీ లవ్ స్టోరీ. నాగార్జున, గిరిజల మధ్య కెమిస్ట్రీని ఇప్పటికీ ప్రెష్ గా ఫీల్ అవుతుంటారు ప్రేక్షకులు. 1989లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు అదొక క్లాసిక్ మూవీ. ఇళయ రాజా అందించిన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకే హైలెట్. ఇందులో పాటలు వింటుంటే.. మనస్సు ఎక్కడికో వెళ్లిపోతూ ఉంటుంది.

Gitanjali's heroine has changed now 01

‘జగడ జగడ జగడం చేసేస్తాం’ నుండి‘ ఓ పాప లాలీ‘ వరకు ప్రతి పాట గీతామృతం. ఇక ఇందులో నాగార్జునకు పోటీగా నటించింది గిరిజ. ‘లేచి పోదామన్నా మొనగాడా రా చూద్దాం’ అంటూ అతడ్ని ఆటపట్టించడం దగ్గర నుండి అతడి ప్రేమ కోసం పరితపించే సగటు అమ్మాయిగా ఆమె లీనమైంది. ఇదే ఆమెకు తొలి సినిమా అయినా.. ఎక్కడ అలా అనిపించదు. గీతాంజలి మూవీ వచ్చి ఈ ఏడాది మే 12తో 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ అంతే ఇష్టంతో సినిమాను వాచ్ చేస్తారు అభిమానులు. మరీ ఇందులో తన నటనతో ఆకట్టుకున్న గిరిజ ఎక్కడ ఉందో. . ఎలా ఉందో తెలుసా..? ఆమె మెడిటేషన్ కోచ్‌గా మారింది. ఇప్పుడు ఆమెను చూస్తే గుర్తు పట్టలేరు. ఆ నటి..ఈమె ఒకరేనా అని మన కళ్లని మనల్ని నమ్మలేని విధంగా ఛేంజ్ అయిపోయింది గిరిజ.

లా గ్రేస్ శ్రీ అరబిందో ఇంటెగ్రల్ లైఫ్ సెంటర్ పేరుతో మెడిటేషన్ క్లాసెస్ చెబుతోంది. 1969లో బ్రిటన్‌లో జన్మించింది. ఆమె తండ్రి భారతీయుడు కాగా, తల్లి బ్రిటీష్ దేశస్తురాలు. ఆమె భరత నాట్యంలో శిక్షణ తీసుకుంది. 2003లో కార్డిఫ్ విశ్వవిద్యాలయం నుండి సమగ్ర యోగా తత్వశాస్త్రం, భారతీయ ఆధ్యాత్మిక మనస్తత్వశాస్త్రంలో డాక్టరల్  థీసెస్ పూర్తి చేసింది. ఆమె తెలుగులో గీతాంజలి అనే మూవీతో పాటు హృదయాంజలి అనే సినిమాలో కూడా నటించింది. 1992లో నటిస్తే 2002లో రిలీజ్ కావడం గమనార్హం. మలయాళంలో రెండు చిత్రాల్లో నటించగా.. ఒకటి విడుదల కాలేదు. హిందీలో రెండు చిత్రాల్లో స్పెషల్ పాత్రల్లో కనిపించింది. 2003 నుండి పూర్తిగా మెడిటేషన్ వైపే మళ్లింది గిరిజ. ఇండియా, విదేశాల్లో క్లాసెస్ చెబుతోంది ఇప్పుడు.

 

View this post on Instagram

 

A post shared by Girija Shettar (vegan/non-prejudiced) (@girijaejshettar)