iDreamPost
android-app
ios-app

మా నాన్నకు నేను డైరెక్టర్ అవ్వడం ఇష్టం లేదు.. దిగ్గజ దర్శకుడు షాకింగ్ కామెంట్స్

  • Published Aug 03, 2024 | 4:51 PM Updated Updated Aug 03, 2024 | 4:51 PM

భారతీయ చిత్ర పరిశ్రమలో ఇతనో దిగ్గజ దర్శకుడు. ప్రేమ కథలను తెరకెక్కించడంలో ఆయనకు ఆయనే సాటి. కానీ ఇతను డైరెక్టర్ కావడం వాళ్ల నాన్నకు ఏ మాత్రం ఇష్టం లేదట. మరి ఆ డైరెక్టర్ ఎవరు? ఆ వివరాలు..

భారతీయ చిత్ర పరిశ్రమలో ఇతనో దిగ్గజ దర్శకుడు. ప్రేమ కథలను తెరకెక్కించడంలో ఆయనకు ఆయనే సాటి. కానీ ఇతను డైరెక్టర్ కావడం వాళ్ల నాన్నకు ఏ మాత్రం ఇష్టం లేదట. మరి ఆ డైరెక్టర్ ఎవరు? ఆ వివరాలు..

మా నాన్నకు నేను డైరెక్టర్ అవ్వడం ఇష్టం లేదు.. దిగ్గజ దర్శకుడు షాకింగ్ కామెంట్స్

భారతీయ చిత్ర పరిశ్రమలో ఆయనో దిగ్గజ దర్శకుడు. ఎందరికో స్ఫూర్తి, పైగా ఎందరినో ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి. ఆయన సినిమాలు వస్తున్నాయంటే చాలు.. వేయి కళ్లతో ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. అలా అని ఆ లెజెండరీ డైరెక్టర్ తీసేవి మాస్ సినిమాలు కావు. పక్కా క్లాస్ సినిమాలు. ప్రేమ కథలను తెరకెక్కించడంలో ఈ డైరెక్టర్ ది అందెవేసిన చేయి. ఇక ఈయన మూవీస్ లో పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీనే. మరి ఇలాంటి వ్యక్తి డైరెక్టర్ కావడం వాళ్ల నాన్నకు అస్సలు ఇష్టం లేదట. ఈ విషయాన్ని స్వయంగా ఆ దిగ్గజ దర్శకుడే చెప్పాడు.

మణిరత్నం.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని సినీ లవర్ ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో. అంతలా ఈ దిగ్గజ దర్శకుడు చలన చిత్రసీమపై తన ముద్రను వేశాడు. తన సుదీర్ఘ కెరీర్ లో చేసిన సినిమాలు తక్కువే అయినప్పటకీ.. అవి ఇండస్ట్రీ హిట్స్ గా, కల్ట్ క్లాసికల్ మూవీస్ గా నిలిచాయి. మణిరత్నం తెరకెక్కించిన రోజా, దళపతి, గీతాంజలి, బొంబాయి లాంచి చిత్రాలు ఎవర్ గ్రీన్. ప్రేమ కథలను మనసుకు హత్తుకునేలా తీయడంలో ఈ లెజెండరీ డైరెక్టర్ తోపు. కానీ.. మణిరత్నం డైరెక్టర్ కావడం తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదట. ఈ విషయాన్ని మణిరత్నం ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.

మణిరత్నం మాట్లాడుతూ..”వీనస్ స్టూడియో రత్నం అయ్యర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చావని నన్ను చాలా మంది అడిగారు. కానీ, నేను అలా రాలేదు. అసలు నేను డైరెక్టర్ కావడం మా నాన్నకు ఇష్టం లేదు. మెుదటి నుంచి మా కుటుంబాన్ని ఆయన చిత్ర పరిశ్రమకు దూరంగానే ఉంచారు. ఇక నాన్న కోరిక మేరకు నేను ముంబాయిలో ఎంబీఏ చేశాను. ఇక అదే టైమ్ లో ఓ కంపెనీకి డైరెక్టర్ గా చేశాను. ఆ సమయంలో అంత మంది ఉద్యోగులతో పని చేయించడం భారంగా అనిపించింది. దాంతో క్రియేటీవ్ ఫీల్డ్ వైపు అడుగులు వేశాను. ఇక నేను విదేశాలకు వెళ్లి ఫిల్మ్ కోర్స్ నేర్చుకున్నానని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఏ కోర్స్ నేర్చుకోలేదు. అయితే ఇప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాను” అంటూ ఈ దిగ్గజ దర్శకుడు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మణిరత్నం-కమల్ హాసన్ కాంబినేషన్ లో ‘థగ్ లైఫ్’ అనే ప్రతిష్టాత్మకమైన సినిమా తెరకెక్కుతోంది. మరి ఈ లెజెండరీ డైరెక్టర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.