ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కారణంగా అనేక ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చి మంత్రులుగా ఎన్నికైన కొత్తలోనే రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తామని ప్రకటించిన జగన్ అదే బాటలో నడిచారు. కొద్దిరోజుల క్రితం మంత్రివర్గం అంతా రాజీనామాలు చేయగా ఇప్పుడు కొత్త మంత్రివర్గం కొలువు తీరనుంది. పాత, కొత్త కలయికతో క్యాబినెట్ కూర్పు చేసిన సీఎం జగన్ మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు కీలకమైన పదవులు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, గుడివాడ […]
సినిమాల్లో కామెడీ చేస్తూ ప్రేక్షకులను నవ్వించే కొంతమంది నటులు.. రాజకీయాల్లోనూ అదే తరహా తీరును కొనసాగిస్తున్నారు. సినిమాల్లో మాదిరిగా రాజకీయాల్లోనూ కామెడీ చేస్తూ.. సినిమా అయినా, రాజకీయమైనా తమకు ఒకటేనని తాజాగా చాటిచెబుతున్నారు కామెడీ యాక్టర్ శివాజీ. సినిమాలు లేక ఖాళీగా ఉన్న శివాజీ టిక్కెట్ లేకుండానే ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. తాజాగా శివాజీ చేసిన వ్యాఖ్యలు.. ఆయన మానసిక ప్రవర్తనపై అనుమానం కలిగేలా ఉన్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని ఈ […]
చేస్తున్న పని, తీసుకున్న నిర్ణయాలు సరికాదని, తప్పని తేలిన తర్వాత సాధారణంగా ఓ వ్యక్తి మళ్లీ ఆ తప్పు చేయరు. ఏవరేమనుకున్నా.. తన దారి తనదే అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కూడా ఇలానే వ్యవహరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎన్నికలకు సహకరించలేదని అధికారులపై చర్యలకు ఆదేశాలు జారీ చేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారిపై, ప్రజా ప్రతినిధులపై చర్యలు, […]
బట్ట కాల్చి మొహం మీద పడేయడమనే నానుడి మాదిరిగా ఏపీలో ప్రతిపక్ష పార్టీ రాజకీయాలు చేస్తోందనే విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏదైనా ఘటన జరిగితే దాని పూర్వా పరాలు తెలుసుకోకుండా.. వెంటనే ప్రభుత్వాన్ని నిందించడం, అధికార పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం సర్వసాధారణంగా జరుగుతోంది. సదరు ఘటనలు జరిగిన సమయంలో ఆరోపణలు, విమర్శలతో హడావుడి చేస్తున్న ప్రతిపక్ష టీడీపీ.. ఆ తర్వాత జరిగే పరిణామాలపై మాత్రం మౌనం పాటిస్తోంది. ఇటీవల జరిగిన పలు ఘటనలను […]
అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలడంతో కృష్ణా జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుల మధ్య జరిగిన సవాళ్లు, ప్రతి సవాళ్లతో గొల్లపూడిలో ఈ రోజు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్టీ రామారావు విగ్రహం వద్ద దీక్ష చేసేందుకు టీడీపీ, వైసీపీ నేతలు సిద్ధం కావడంతో ఈ రోజు ఉదయం నుంచి గొల్లపూడిలో సెక్షన్ 144, సెక్షన్ 30ని అమలు చేశారు. […]
ప్రతి సంఘటన వెనుకా ఏదో ఒక కారణం లేకపోదు. అందులోనూ ఘనత వహించిన చంద్రబాబు నాయుడు, ఆయన బృందం గతంలో చేసిన ఇప్పుడు చేస్తున్న ఘన కార్యాలను తిరగబెడితే తప్పకుండానే ఏదో ఒక సంఘటన చోటు చేసుకోక మానదు. అందులోనూ నేరుగా చంద్రబాబుపైనే విమర్శలకు దిగుతున్న రాష్ట్ర మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై ప్రత్యర్ధి వర్గం అటెన్షన్ కొంచెం ఎక్కువగానే ఉంటుందనడంలో సందేహం లేదు. అందులో భాగంగానే ఆ నియోజకవర్గంలో పేకాటశిబిరంపై పోలీస్‌లు దాడిచేయడాన్ని హైలెట్ […]
నా ఇల్లు – నా సొంతం.. నా స్థలం నాకు ఇవ్వాలి అంటూ టిడ్కో ఇళ్ల కేటాయింపుపై రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని బంపరాఫర్ ఇచ్చారు. పూర్తయిన రెండు లక్షల ఇళ్లు, 30 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ చేసేందుకు టీడీపీ నేతలు కోర్టుల్లో వేసిన కేసులు ఉపసంహరించుకోవాలన్నారు. కేసులు వేసి స్టే తెచ్చిన తప్పులను ఒప్పుకుని ఆ స్టేలను తీసేయిస్తే.. వచ్చే నెల […]
సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ శ్రేణులు ప్రవర్తిస్తున్న తీరును బట్టి చెప్పవచ్చు. ముఖ్యమంగా టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎప్పుడు గోడదూకుతారో అన్న ఆందోళనలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు, శ్రేణులు ఉంటున్నాయి. ఎక్కడ, ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీని వీడుతారో అన్న అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేల కథలికలపై నిఘా పెట్టిన చంద్రబాబు వారిని ఓ కంట […]
ఏడాది కాలంగా కొత్త రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు తెరదించేలా రాష్ట్ర పౌరసరపరాల శాఖ మంత్రి కొడాలి నాని కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్‌కార్డులు జారీ విధానానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోద ముద్రవేశారని మంత్రి కొడాలి తెలిపారు. అర్హులైన వారు తమ పరిధిలోని గ్రామ,వార్డు సచివాలయాల్లో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా.. ఐదు రోజుల్లో కార్డు మంజూరవుతుందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో అర్హత ఉన్న వారు, […]
కరోనా నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎలాంటి కష్టాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పేదల కోసం అమలు చేసే సంక్షేమ పథకాల కోసం ఆహారా ధాన్యాలను సిద్ధం చేసి పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద దాదాపు 16.89 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అందుబాటులో ఉన్నాయి. బియ్యం, గోధుమలు, కందిపప్పు, శనగలు వీటిలో ఉన్నాయి. వీటితో ఏడాది పాటు సంక్షేమ పథకాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా అమలు చేయవచ్చు. కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో […]