iDreamPost
android-app
ios-app

చంద్రబాబుకి కొడాలి టెన్షన్! బుర్ర చించుకుంటున్న బాబు!

చంద్రబాబుకి కొడాలి టెన్షన్! బుర్ర చించుకుంటున్న బాబు!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికలో పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కొన్ని నియోజకవర్గాలను టార్గెట్ చేశారు. అక్కడ ఎలాగైనా వైసీపీని ఓడించాలనే భావనతో ఉన్నారు. అలా చంద్రబాబు టార్గెట్ పెట్టుకున్న నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. ఇక్కడ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని ఎలాగైన  ఓడించాలని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తెగ టెన్షన్ పడుతున్నారని టాక్

కొడాలి నాని.. టీడీపీకి కొరకరాని కొయ్యగా మారారు. తరచూ చంద్రబాబు, లోకేశ్ లపై నాని నిప్పులు చెరుగుతుంటారు. దమ్ముంటే తండ్రీకొడుకుల్లో ఎవరైనా వచ్చి గుడివాడలో పోటీ చేయాలంటూ చంద్రబాబుకు సవాళు కూడ విసిరారు. ఇలా వైసీపీ ఫైర్ బ్రాండ్ గా కొడాని నాని గుర్తింపు పొందారు. ఇలా తమను టార్గెట్ చేసిన కొడాలి నాని.. ఎలాగైన ఓడించాలని టీడీపీ భావిస్తోంది. నానిని ఓడించేందుకు సరైన అభ్యర్థి కోసం చంద్రబాబు తీవ్రంగా వెతుకుతున్నారు. రకరకాల పేర్లను పరిశీలనలోకి వస్తునప్పటికీ ఏదో ఒక కొరత కనిపిస్తోంది. చివరకు టీడీపీ నాయకుల పరిస్థితి ఎలా మారిందంటే… అసలు నానికి పోటీ అయినా ఇవ్వగలమా? అనే సందేహంలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఎందుకంటే ఎప్పటి నుంచి సరైన అభ్యర్థిలేని గన్నవరానికి నిన్నగాక మొన్నే యార్లగడ్డ వెంకట్రావును టీడీపీ అభ్యర్థిగా నిలిపారు.  అది కూడా వైసీపీ నుంచి వెళ్లిన నాయకుడే దిక్కయ్యాడని.. సొంత పార్టీ నేతలో విమర్శిస్తున్నారు. ఇక గుడివాడ విషయంలో బాబు బాగా టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇన్ ఛార్జీ గా రావి వెంకటేశరావు ఉన్న..నానికి పోటీ ఇస్తాడా అనేది చాలా మందిలో మెదిలిన సందేహం. అందుకే చంద్రబాబు ఆర్థికంగా బలమున్న ఎన్నారైల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గుడివాడలో టీడీపీ అభ్యర్ధిగా ఎన్నారై వెనిగళ్ల రాము పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆ పేరుపై కూడా టీడీపీ అధినాయత్వం నుంచి స్పష్టత  ఇవ్వలేదు

ఈ నేపథ్యంలోనే స్థానిక నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఈసారి గుడివాడలో ఎట్టిపరిస్థితుల్లోనూ కొడాలి నానీ ని ఓడించాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. అయితే వారి ఆశలు అడియాశలే..తప్ప నానిని ఓడిచంలేరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలా కొడాలని నానిని ఎలా ఓడించాలని చంద్రబాబు బుర్ర చించుకుంటునట్లు పలువురు కామెంట్స్ చేస్తున్నారు. తండ్రే బుర్ర చించుకుంటుంటే.. తనయుడు లోకేశ్ మాత్రం కట్ డ్రాయర్ మీదు నిలబెడతా అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని కొందరు అంటున్నారు. మరి.. గుడివాడలో నానిని ఓడించే సత్తా టీడీపీకి  లేదా?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.