iDreamPost
android-app
ios-app

Jr NTRపై కుట్రలు చేసి ఇబ్బంది పెడుతున్నారు: MLA కొడాలి నాని

  • Published Mar 06, 2024 | 9:12 AM Updated Updated Mar 06, 2024 | 10:28 AM

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్‌లు కలిసి జూనియర్‌ ఎన్టీఆర్‌పై కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆ వివరాలు..

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్‌లు కలిసి జూనియర్‌ ఎన్టీఆర్‌పై కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆ వివరాలు..

  • Published Mar 06, 2024 | 9:12 AMUpdated Mar 06, 2024 | 10:28 AM
Jr NTRపై కుట్రలు చేసి ఇబ్బంది పెడుతున్నారు: MLA కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. అధికార, విపక్ష పార్టీలన్ని.. ఎలక్షన్‌ పనులతో బిజీగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించి.. మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ భావిస్తుండగా.. ఎలాగైనా జగన్‌కు చెక్‌ పెట్టాలని టీడీపీ, జనసేన కూటమి భావిస్తోంది. ఇక వైసీపీ అభ్యర్థులను ప్రకటించడమే కాక.. సిద్ధం సభలతో ప్రచార కార్యక్రమాల్లో కూడా దూసుకుపోతుంది. ఇటు చూస్తే కూటమి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉంది. ఇప్పటికే ఈ కూటమి అభ్యర్థులకు సంబంధించి ఫస్ట్‌ లిస్ట్‌ విడుదల చేసింది. జనసేనకు 24 సీట్లు కేటాయిస్తే.. ఆ పార్టీ కేవలం 5 గురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. మరో 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలి. మరి దానికి మోక్షం ఎప్పుడో అని జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే.. టీడీపీ నేతలు జనసేనతో పొత్తు కాదు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ను పార్టీలోకి ఆహ్వానించాలని.. లోకేష్‌ను పక్కకు పెట్టాలని పట్టుబడుతున్నారట. పార్టీని బతికించాలంటే ఇప్పుడు జూనియరే రావాలని కోరుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరూ కలిసి జూనియర్‌ ఎన్టీఆర్‌పై కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆ వివరాలు..

చంద్రబాబు జూ.ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేశాడని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో మంగళవారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు.. 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుని వదిలేశారంటూ ధ్వజమెత్తారు.

కొడాలి నాని మాట్లాడతూ..‘‘ఎన్నికల ప్రచారం సమయంలో జరిగిన ఓ ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఎన్నికల తర్వాత చంద్రబాబు జూనియర్‌ పట్టించుకోలేదు.. అంతేకాక తనను అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే జూ.ఎన్టీఆర్‌ను టీడీపీ నుండి గెంటేస్తారు. పుట్టినరోజుకు, చావుకు తేడా తెలియని లోకేష్‌ను సీఎం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. పెద్ద ఎన్టీఆర్, చిన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానించే ప్రతి ఒక్కరు చంద్రబాబును ఓడించాలి.. అతడిని గొయ్యి తీసి పాతిపెట్టాలి. అప్పుడే టీడీపీ బతికి బట్టగడుతుందంటూ’’ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘అంబేద్కర్ బాటలో నడుస్తున్న సీఎం జగన్‌కు అందరూ అండగా నిలవాలి. మంచి చేస్తేనే ఓటేయమని ధైర్యంగా అడుగుతున్నారు. జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసి అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టాలి. మీ కోసం 120 సార్లు బటన్ నొక్కిన జగన్ కోసం.. మీరు రెండు బటన్‌లు నొక్కండి. ఈ సారికి చంద్రముఖిని ఈవీఎంలలో బంధించండి. ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోతుందంటూ’’ కొడాలి నాని ఆరోపించారు.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş