iDreamPost
android-app
ios-app

లోకేష్‌ ఢిల్లీ పారిపోయి.. తల్లిని రోడ్ల మీద తిప్పుతున్నాడు: కొడాలి నాని

  • Published Oct 25, 2023 | 3:10 PM Updated Updated Oct 25, 2023 | 3:10 PM

చంద్రబాబు వారసుడు లోకేష్‌ అసమర్థుడని.. అందుకే ఆడవాళ్లు బయటకు రావాల్సిన పరిస్థితి తలెత్తిందంటూ.. మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఆ వివరాలు..

చంద్రబాబు వారసుడు లోకేష్‌ అసమర్థుడని.. అందుకే ఆడవాళ్లు బయటకు రావాల్సిన పరిస్థితి తలెత్తిందంటూ.. మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఆ వివరాలు..

  • Published Oct 25, 2023 | 3:10 PMUpdated Oct 25, 2023 | 3:10 PM
లోకేష్‌ ఢిల్లీ పారిపోయి.. తల్లిని రోడ్ల మీద తిప్పుతున్నాడు: కొడాలి నాని

చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ తర్వాత టీడీపీలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాబు అరెస్ట్‌ తర్వాత పార్టీని ముందుండి నడిపించాల్సిన లోకేష్‌.. ఢిల్లీ వెళ్లి కూర్చున్నాడు. దాంతో భువనేశ్వరి, బ్రాహ్మణి ప్రజల్లోకి రావాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో జనాల్లోకి వెళ్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నిజం గెలిస్తే.. చంద్రబాబు పర్మినెంట్‌గా జైలుకే పరిమితం అవుతాడని అంటున్నారు జనాలు. ఈ క్రమంలో తాజాగా భువనేశ్వరి యాత్రపై వైసీప ఎమ్మెల్యే కొడాలి నాని సెటైర్లు వేశారు. లోకేష్‌ అసమర్థుడు కావడం వల్లనే.. ఇంట్లోని ఆడవారు రోడ్ల మీదకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆ వివరాలు..

నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని.. భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు.. ఇక జీవితాంతం జైలుకే పరిమితం అవుతారని.. బయటకు రారని విమర్శించారు. చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయిందన్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు.. భువనేశ్వరి ఏ స్థాయిలో ఉన్నారని కొడాలి నాని ప్రశ్నించారు. రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు రూ.2 వేల కోట్లు దాటిందని తెలిపారు. కేవలం 40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు చంద్రబాబు రూ.35 కోట్లు ఫీజుగా చెల్లించారని.. ఆ డబ్బు ఎక్కడిదని కొడాలి నాని ప్రశ్నించారు.

కష్టపడి పొలం దున్నితే వచ్చిన డబ్బుతోనే రూ.ఏడు కోట్లతో రూపొందించిన బస్సులో యాత్ర చేస్తున్నారా అని ఈ సందర్భంగా కొడాలి నాని.. భువనేశ్వరిని ప్రశ్నించారు. చంద్రబాబు వారసుడు లోకేష్ సమర్థుడు అయితే ఇంట్లో మహిళలు రోడ్లపైకి ఎందుకు వస్తారని కొడాలి నాని ప్రశ్నించారు. లోకేష్ పప్పు అని మరోసారి రుజువైందని.. ఆయన ఢిల్లీ పారిపోయి తల్లిని రోడ్లపై తిప్పుతున్నారని విమర్శించారు.

అంతేకాక పవన్‌ మీద కూడా విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తెర వెనుక ఉండి టీడీపీకి మద్దతు తెలిపారన్నారు. ఇప్పుడు ముసుగు తొలగిందని..చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్  పార్టీ పెట్టారని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

 

 

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss