iDreamPost
android-app
ios-app

చంద్రబాబుకు సంబంధం లేదంటే స్కామ్ ఎవరు చేశారు?: కొడాలి నాని

చంద్రబాబుకు సంబంధం లేదంటే స్కామ్ ఎవరు చేశారు?: కొడాలి నాని

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీమెన్స్ కేసులో అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు రూ.240 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డారన్నఆరోపణలతో ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ని అరెస్ట్‌ చేశారు. శనివారం ఉదయం నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన అధికారులు విజయవాడ తరలించారు. మరి కొద్దిసేపట్లో ఆయన్ని విజయవాడ మూడవ అదనపు జిల్లా కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్‌ను అధికార, విపక్షాలు స్పందిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ మంత్రులు, ముఖ్యనేతలు చంద్రబాబు అరెస్టు సమర్ధిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఆయన చేయని స్కామ్ అంటూ ఏది  లేదని, ఆయన స్కామ్ చేయనిది ఎప్పుడు అంటూ కొడాలి నాని ప్రశ్నించాడు.

కొడాలి నాని మాట్లాడుతూ..”చాలా రోజుల నుంచి చంద్రబాబుపై విచారణ జరుగుతోంది. చివరకు ఈ రోజు చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఈయనతో పాటు గంట శ్రీనివాస రావును, ఆయన కొడుకును కూడా అరెస్ట్ చేశారు. చంద్రబాబు కంటే ముందు 10 మంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. అలానే ఈ కేసులో కొంతమందికి బెయిళ్లు వచ్చాయి. మరికొందరు జైల్లో ఉన్నారు. ఇక ఈ కేసులో ఎఫ్ఐఆర్ చంద్రబాబు లేనిది ఎక్కడా?, ఆయన దొంగతనం చేయనిది ఎక్కడా? , బాబు చేయని అవినీతి కార్యక్రమాలు ఎక్కడా?.

చంద్రబాబు నాయుడు ఓ అవినితి చక్రవర్తి అని ఆనాడే ఎన్టీ రామారావు గారే చెప్పారు. అంతేకాక వెన్నుపోటు దారుడని, 420 అని రామరావు గారే చెప్పారు. అయితే బాలకృష్ణ, పురంధేశ్వరి మాత్రం  ఎన్టీఆర్ గారికి ఏమి తేలియదన్నట్లు మాట్లాడుతారు. వారికి కనీసం తెలివి లేదా.. స్వయంగా ఎన్టీ రామారావు గారే చంద్రబాబు గురించి చెప్పారు. చంద్రబాబు ఔరంగజేబు మాదిరిగా వెన్నుపోటు పొడిచాడని చెప్తే.. ఆయన కడుపున పుట్టిన బాలకృష్ణ, పురందేశ్వరి మాత్రం… చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నారు. చంద్రబాబు, పురందేశ్వరి ఇద్దరూ కలిసే ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారు.

దొరికిపోయిన ప్రతి ఒక్కడు నేను తప్పు చేయలేదనే చెప్తాడు. 40 ఏళ్ల నుంచి కక్ష సాధింపు ఈ రోజు ప్రత్యేకంగా ఏమి వస్తాది. కక్ష సాధింపు అయితే ఎన్నికలు మరికొన్ని నెలల్లో ఉండగా ఎవరు అరెస్ట్ చేయరు కదా. చంద్రబాబును అరెస్ట్ చేసినా, చేయకపోయినా నష్టం ఏమిలేదు. ఈ స్కామ్ లో తనకు సంబంధంలేదని బాబు బుక్కాయిస్తున్నాడే.. మరి.. ఆయన కాకుండే ఈ స్కామ్ ఎవరు చేశారు. అసలు బాబు స్కామ్ లు చేయని ఎప్పుడు?. ఆయన జీవితమే స్కామ్ లు, అవినీతి, వెన్నుపోటుతో కూడినది” అంటూ మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. మరి..కొడాలి నాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis girişesrar satın al