iDreamPost
android-app
ios-app

పురంధేశ్వరి కాంగ్రెస్ లో ఉన్నట్టా? లేక TDPలోనా: కొడాలి నాని

  • Published Nov 04, 2023 | 8:29 PM Updated Updated Nov 04, 2023 | 8:29 PM

వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు పురంధేశ్వరిపై మండిపడుతున్నారు. తాజాగా దగ్గుబాటి పురంధేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు.

వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు పురంధేశ్వరిపై మండిపడుతున్నారు. తాజాగా దగ్గుబాటి పురంధేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు.

  • Published Nov 04, 2023 | 8:29 PMUpdated Nov 04, 2023 | 8:29 PM
పురంధేశ్వరి కాంగ్రెస్ లో ఉన్నట్టా? లేక TDPలోనా: కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. పురంధేశ్వరి బీజేపీలో ఉందా లేకా టీడీపీలో ఉందా అంటూ ప్రశ్నించారు. పురంధేశ్వరి లేఖలకు భయపడి, బెదిరిపోయే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరంటూ నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ పురంధేశ్వరి కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు పురంధేశ్వరిపై మండిపడుతున్నారు.

మాజీ మంత్రి కొడాలి నాని శనివారం మీడియాతో మాట్లాడుతూ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈరోజు దగ్గుబాటి పురంధేశ్వరి ఒక లెటర్ రాశారని టీడీపీ అనుకూల మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు. చంద్రబాబు వదిన అయినా పురంధేశ్వరిని రాష్ట్ర బీజేపీ నేతలే కొన్ని ప్రశ్నలు అడిగితే బాగుంటుందని ఆయన తెలిపారు. పురంధేశ్వరి బీజేపీలో ఉన్నట్లుగా కనిపించడం లేదని, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు టీడీపీ మద్దతిస్తోందని బాబు చెప్పడంతోనే టీడీపీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ బయటకు వచ్చారని కొడాలి నాని తెలిపారు.

మరిది చంద్రబాబు ప్రయోజనాల కోసమే పురంధేశ్వరి బీజేపీలో చేరారని, ఆమెకు రాజకీయ విలువలు ఉన్నాయా? లేవా? అని నాని ప్రశ్నించారు. కాంగ్రెస్ వెనుకాల, కాంగ్రెస్‌తోనూ ఉన్నది చంద్రబాబేనని స్పష్టంగా కనిపిస్తోందని, తెలంగాణలో కాంగ్రెస్‌తో పోరాడుతున్నాం, బీఆర్ఎస్‌తో పోరాడుతున్నాం అంటున్న బీజేపీకి కాకుండా.. టీడీపీకి పురంధేశ్వరి మద్దతు ఇస్తోందని మండిపడ్డాడు. టీడీపీ అంటే కాంగ్రెసే కదా?. మరి, పురంధేశ్వరి కాంగ్రెస్‌లో ఉన్నట్టా? లేక టీడీపీలో ఉన్నట్టా? లేక బీజేపీలో ఉన్నట్టా? అన్నది ఆ బీజేపీ నేతలే అర్థం చేసుకోవాలన్నారు. ఆమె గతాన్ని చూస్తే టీడీపీలో ఉండి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిందని నాని గుర్తు చేశారు.

పురంధేశ్వరి కాంగ్రెస్‌లో ఉండి కేంద్రమంత్రి పదవి అనుభవించి, పార్టీ అధికారం పోయిందని వెంటనే వదిలేసి బయటకు వచ్చిందన్నారు. ఆ తర్వాత అధికారంలో ఉన్న బీజేపీలో చేరినా, బాబు ఆదేశాల మేరకు, ఆయన ప్రయోజనాల కోసమే ఆమె పనిచేస్తున్నారని నాని తెలిపారు. కాంగ్రెస్‌లో ఉన్న రేణుకా చౌదరి, బీజేపీలో ఉన్న పురంధేశ్వరి.. చంద్రబాబు ప్రయోజనాలు, పసుపు బ్యాచ్ ప్రయోజనాలు కాపాడటంలో ముందుకు సాగుతున్నారు. వీరి రాజకీయం ఎవరి కోసం?’ అని కొడాని ప్రశ్నించారు. మరి.. పురంధేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom