iDreamPost
android-app
ios-app

YCPలోకి వంగవీటి రాధా! అక్కడి నుంచే MPగా పోటీ?

  • Published Feb 28, 2024 | 7:31 PM Updated Updated Feb 28, 2024 | 7:31 PM

YCP MP Seat For Vangaveeti Radha?: విజయవాడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వంగవీటి రాధా తిరిగి వైసీపీలో చేరుతున్నారంటూ వార్తలు జోరందుకున్నాయి.

YCP MP Seat For Vangaveeti Radha?: విజయవాడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వంగవీటి రాధా తిరిగి వైసీపీలో చేరుతున్నారంటూ వార్తలు జోరందుకున్నాయి.

  • Published Feb 28, 2024 | 7:31 PMUpdated Feb 28, 2024 | 7:31 PM
YCPలోకి వంగవీటి రాధా! అక్కడి నుంచే MPగా పోటీ?

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకుంటున్నాయి. తాజాగా విజయవాడ పాలిటిక్స్ లో కీలక పరిణామాలు చోటు చేసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. వంగవీటి మోహనరంగా కుమారుడు, కాపు నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా తిరిగి వైఎస్సార్ సీపీలోకి రానున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా పోటీ చేయబోతున్నారు అంటూ రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే మాజీమంత్రులు కొడాలి నాని, పేర్ని నాని రాధాతో సమావేశమయ్యారు. రాధాకు వైసీపీ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆఫర్ కూడా ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. కొంతకాలంగా వంగవీటి రాధా తిరిగి వైసీపీలోకి వస్తారంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రాధాకు వైసీపీ ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారు అంటున్నారు. ఇప్పుడు ఆ వార్తలకు టీడీపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థుల లిస్టు బలం చేకూర్చినట్లు అయ్యింది. విజయవాడ సెంట్రల్ లేదంటే విజయవాడ తూర్పు నియోజకవర్గాల నుంచి వంగవీటి రాధా పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ, పొత్తులో భాగంగా ప్రకటించిన సీట్లలో అక్కడ వేరే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధా ఆలోచనలో పడినట్లు చెబుతున్నారు. ఇంతకాలం టీడీపీ నుంచి టికెట్ ఉంటుందని, టీడీపీ నుంచే తన పోటీ ఉంటుందని భావించిన రాధాకు చంద్రబాబు టికెట్ ప్రకటించకపోవడం గమనార్హం. వంగవీటి అభిమానులు కూడా చంద్రబాబు తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్ ఇవ్వకుండా రాధాకు తీరని అన్యాయం చేశారని వారు అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. తన పొలిటికల్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో కొడాలి నాని నేరుగా పార్టీలోకి ఆహ్వానించారు. పైగా ఎంపీ టికెట్ కూడా ఇస్తామంటూ చెప్పారంటూ వస్తున్న వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలను చూస్తుంటే రాధా తిరిగి వైసీపీ కండువా కప్పుకుంటారు అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

వంగవీటి రాధా కోసం మచిలీపట్నం ఎంపీ టికెట్ సిద్ధంగా ఉంది అంటూ కొడాలి నాని చెప్పారని వార్తలు వస్తున్నాయి. వంగవీటి రాధా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ, రాధా కూడా తిరిగి వైసీపీలోకి రావాలనే ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. గతంలో కూడా వంగవీటి రాధాను వైసీపీలోకి ఆహ్వానించినా.. టీడీపీ నుంచి పోటీ ఉంటుందని ఆలోచనలో నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు చంద్రబాబు చేసిన అన్యాయానికి వంగవీటి రాధా కూడా పునరాలోచనలో పడినట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే తిరిగి రాధా వైసీపీలో చేరడం ఖాయంగా చెప్పచ్చు. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయక పోయినప్పిటికీ రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోవచ్చు అంటున్నారు. వంగవీటి రాధా చేరికపై క్లారిటీ రావాలి అంటే.. మరో రెండ్రోజులు ఆగాల్సిందే అంటున్నారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş