తాజగా సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు ఓ సంచలన తీర్పు ఇచ్చింది. తెలంగాణ హైదరాబాద్ లో పని చేస్తున్న నలుగురు పోలీసు ఉన్నతాధికారులకు నాలుగు వారాల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ధిక్కరణ కేసులో ఈ పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించింది తెలంగాణ హైకోర్టు. హైదరాబాద్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నరేశ్ లకు తెలంగాణ హైకోర్టు నాలుగు […]
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా రోగులకు ఉచిత వైద్యం అందించాలని కోరినందుకు ముంబాయి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ…తిరిగి పిటిషనర్ కు జరిమానా విధించింది. మహారాష్ట్రలోని కరోనా పేషెంట్స్ అందరికీ ఉచితంగా చికిత్స అందించాలంటూ పిటిషన్ వేసిన వ్యక్తిపై ముంబాయి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ డిమాండ్ అర్థరహితంగా ఉందని వ్యాఖ్యానించింది. అంతేకాదు పిటిషనర్ కు రూ. 5 లక్షల జరిమానా విధించింది. నెల వ్యవధిలో ప్రభుత్వ ఖాతాలో ఈ మొత్తాన్ని జమ […]
కరోనా వైరస్ నియంత్రణకు నిధులు సేకరించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పిఎం కేర్స్ నిధిపై వివాదం రేగుతుంది. తొలి నుంచి దానిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దానికి ఆడిట్ లేదని, ప్రజలిచ్చిన కోట్లు ఎక్కడికి పోతున్నాయని కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. మరోవైపు సమాచార హక్కు కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు పిఎం కేర్స్ పై ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేసి…దాని సమాచారం అడుగుతున్నారు. అయితే పిఎం కేర్స్ ప్రభుత్వ సంస్థ కాదని, ప్రైవేట్ సంస్థ అని కేంద్రం […]
ఒక్క పేరు.. ఆ ఒక్క పేరును ఇంటి పేరుతో సహా ఎందుకు పలకలేకపోయారు..? సీనియర్ జర్నలిస్టు, పైగా పలు ఛానెళ్లలో లైవ్ డిబేట్లు నిర్వహించిన అనుభవం ఉన్న వ్యక్తి, ఆంధ్రా అర్నబ్ గోస్వామిగా పిలుపించుకునేందుకు ఇష్టపడే వ్యక్తి అయిన వెంకట కృష్ట.. ఆ పేరు వచ్చిన సమయంలో నోరు ఎందుకు తడబడింది..? ఎందుకు నీళ్లు నమిలారు..? ఇదీ మంగళవారం రాత్రి నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. ఇంతకీ ఏమిటా పేరు..? ఏమిటా కథ..? హైకోర్టు తీర్పులపై […]
విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించిన రాష్ట్ర హైకోర్టు నిర్ణయాన్ని సుప్రిం కోర్టులో సవాల్ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు న్యాయ నిపుణులతో సమాలోచనలు చేస్తోంది. సుధాకర్ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే సమయంలో హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ విశ్వసనీయతను కించపరిచేలా వ్యాఖ్యలు చేసింది. సుధాకర్ ఘటనలో ప్రభుత్వం చేసే దర్యాప్తుపై తమకు నమ్మకం లేదంటూ వ్యాఖ్యానించింది. సుధాకర్ ఘటన దర్యాప్తును సీబీఐకి ఇవ్వడంపై అందరూ ఓకింత ఆశ్చర్యానికి గురయ్యారు. […]
కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో దాని నియంత్రణ, రోగులకు చికిత్స అందించడంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ తప్పులు, వైఫల్యాలు బహిర్గతమయ్యాయి. రాష్ట్రంలోని పరిస్థితులు ‘మునుగుతున్న టైటానిక్ షిప్’ మాదిరిగా ఉన్నాయని రాష్ట్ర హైకోర్టే వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలకు గుజరాత్ సొంత రాష్ట్రం. రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి విజరురూపానీ నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తున్నా కేంద్రం, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే రాష్ట్ర పాలన సాగుతోందని విశ్లేషకులు పేర్కొటున్నారు. మోడీ […]
ప్రతిపక్ష నేత చంద్రబాబు నిన్న సోమవారం హైదరాబాద్ నుంచి తాడేపల్లికి వచ్చే సమయంలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ భారీగా జన సమీకరణతో స్వాగతాలు, తాడేపల్లిలో టీడీపీ శ్రేణులకు అభివాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ, వారిపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మేరుగ […]
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ వివాదాన్ని సిబిఐతో విచారణ చేయించాలన్న హైకోర్టు ఆదేశాలను అధికార వైసిపి స్వాగతిస్తోంది. మామూలుగా ప్రతిపక్షాలు సిబిఐ విచారణ డిమాండ్ చేయటం, అధికారపార్టీ పట్టించుకోకపోవటం సహజంగా అందరు చూసేదే. కానీ ఇక్కడ రాజకీయపార్టీల ప్రమేయం లేకుండా హైకోర్టు వివాదాన్ని సిబిఐతో విచారణ చేయించాలని డిసైడ్ చేసింది. నిజానికి హైకోర్టు ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని జనాలు ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే సిబిఐతో విచారణ చేయించేంత తీవ్రమైనది కాదు ఈ వివాదం. అయితే ఎప్పుడైతే హైకోర్టు సిబిఐ […]
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేయాలని ఏపీ సర్కార్ ఇచ్చిన జీవోను ఇటీవల రద్దు చేసిన రాష్ట్ర హైకోర్టు తాజాగా మరో జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడం, ఆయా రంగులకు అర్థాలు వివరిస్తూ జగన్ సర్కార్ జారీ చేసిన జీవో నంబర్ 623ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు రద్దు చేసింది. ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు రెండు రోజుల […]
లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వైసీపీ ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన లాక్‌డౌన్‌ను ప్రజా ప్రతినిధులే ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి బాష్కర్ రెడ్డి, విడదల రజనీ, ఆర్కే రోజా, బియ్యపు మధుసూదన్ రెడ్డిలు తమ నియోజకవర్గ ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పై విధంగా […]